జానకి బిల్డర్ మధు తనని బెదిరించిన విషయం ఎస్సైకి చెప్తుంది. వాడు ఎంత పవర్ఫుల్ చూశావు కదా ఇప్పుడు నేను నీకు అండగా నిలబడితే ఏదో ఒక దొంగ నోట్ల కేసులో ఇరికిస్తాడని అంటాడు. నా మాట విని బుద్ధిగా డీల్ కి ఒప్పేసుకో వాడేవాడో డ్రైవర్ హత్య చేసింది తనే అని ఒప్పుకున్నాడు కద నీకేంటి ప్రాబ్లమని అంటాడు.


జానకి: తప్పు చేసిన వాడిని వదలకూడదు


మనోహర్: సరే అయితే రేపు మరో నాలుగు మత్తు పదార్థాల ప్యాకెట్లు మీ అత్త గదిలోనే, పెళ్లి కావాల్సిన మీ ఆడపడుచు బెడ్ రూమ్ లోనే దొరుకుతాయి వాళ్ళని అరెస్ట్ చేయడానికి రెడీగా ఉండు. రామ మీద ఎఫ్ఐఆర్ రెడీ చెయ్యి. సరే నీకు రేపటి వరకు టైమ్ ఇస్తున్నా మధుకర్ తో డీల్ కి ఒప్పుకో లేదంటే రేపు పొద్దున్నే రామ మీద ఎఫ్ఐఆర్ రెడీ చేయాల్సిందే. ఉద్యోగం వదులుకుంటావో నీ భర్తని వదులుకుంటావో నీ ఇష్టం


Also Read: పెళ్లికూతురిగా దివ్యని చూసి ఎమోషనలైన నందు- సంబరపడుతున్న లాస్య


మధుకర్ తోకకి నేనే నిప్పు పెట్టాను ఖాకీ బట్టలకు దూరం చేయమని నేనే అడిగాను. నువ్వు ఉన్నంత వరకు నేను నా స్టైల్ లో పని చేసుకోలేను. చచ్చినట్టు నువ్వు రేపు రిజైన్ చేయాల్సిందేనని మనోహర్ సంబరపడతాడు. మల్లిక గదిలోకి వచ్చి తెగ తీన్మార్ డాన్స్ వేస్తుంటే విష్ణు వస్తాడు. ఇంట్లో పరిస్థితి ఏంటో నీకు తెలుసు అన్నయ్య జైలుకి వెళ్లాడని అందరూ బాధపడుతుంటే ఈ డాన్స్ ఏంటి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారని మల్లిక మీద కొప్పడతాడు.


జానకి మీద ఎప్పుడెప్పుడు రివేంజ్ తీర్చుకుందామని చూశాను టైమ్ దొరికిందని అనుకున్నా ఇప్పుడు దొరికిందని చెప్తుంది. ఎందుకు నీకు వదిన అంటే అంత కోపమని అనగానే జానకి తన చెంప మీద కొట్టిన విషయం గుర్తు చేసుకుని అత్తయ్యతోనే తనని బయటకి పంపించేలా చేస్తానని అంటుంది. ఇంట్లో అందరూ టెన్షన్ గా జానకి, రామ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒకసారి ఫోన్ చేయవచ్చు కదా అని జెస్సి, వెన్నెల అంటారు. చేశాను కానీ జానకి లిఫ్ట్ చేయలేదని గోవిందరాజులు చెప్తాడు. స్టేషన్ కి వెళ్ళి పరిస్థితి ఏంటో చూద్దామని మలయాళం అంటాడు అప్పుడే జానకి ఇంటికి వస్తుంది. రామ వచ్చాడని అనుకుని హారతి తీసుకురమ్మని జ్ఞానంబ చెప్తుంది. కానీ కనిపించకపోయేసరికి వాడు ఏడి అమ్మకి మొహం చూపించలేక దాక్కున్నాడ అని పిలుస్తుంది. అందరూ గుమ్మం వైపు రామ కోసం చూస్తుంటే ఆయన్ని తీసుకుని రాలేదని జానకి చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. వాడు తప్పు చేశాడంటే నమ్ముతున్నావా అని జ్ఞానంబ నిలదీస్తుంది.


జానకి: నా భర్త తప్పు చేశాడంటే నేను నమ్మను. ఇప్పుడున్న సాక్ష్యం రామకి వ్యతిరేకంగా ఉంది


జ్ఞానంబ: అందుకని తిప్పుకుంటూ ఇంటికి వచ్చావా రామని విడిపించడం నీ వల్ల అవుతుందా కాదా


జానకి: తప్పకుండా విడిపిస్తాను కానీ దానికి ఒక పద్ధతి ఉంటుందని మధు బెదిరించిన విషయం గుర్తు చేసుకుంటుంది


జ్ఞానంబ: పద్ధతి అంటే ఏంటి ఇంకా ఎన్ని వారాలు పడుతుంది


Also Read: కాలు జారిన రాజ్, కడుపుబ్బా నవ్వించేసిన మీనాక్షి- కనకం ఇంటికి అపర్ణ


రామని విడిపించడం నా ఉద్యోగంతో ముడి పడి ఉందని ఇంట్లో చెప్పకూడదని జానకి మనసులో అనుకుంటుంది. రామ అలాంటి పని చేయడని జ్ఞానంబ అంటే శిక్ష పడుతుందా అని జ్ఞానంబ అంటుంది.


జ్ఞానంబ: అసలు నిన్ను ఐపీఎస్ చదివించడానికి ప్రోత్సహించి రామ తప్పు చేశాడు. కట్టుకున్న భర్త మీద తప్పుడు కేసు బనాయిస్తే ఎదిరించాల్సింది పోయి చేతికి సంకెళ్ళు వేసుకుని తీసుకుని వెళ్ళింది. అసలు నువ్వు ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చో అందరం ప్రశాంతంగా ఉంటాం. జానకి రామని విడిపిస్తుందని నమ్మకం లేదు ఇక్కడ తన మాట ఎవరూ వినాల్సిన అవసరం లేదు


జానకి: లాయర్ ని పెట్టడం వల్ల మనకి లాభం కంటే నష్టం ఎక్కువ. నా భర్తని నేను కాపాడుకుంటాను