Garuda purana: హిందూ సంప్ర‌దాయంలో గరుడ పురాణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వేదవ్యాసుడు రచించిన ఈ పురాణాన్ని చదవడం ద్వారా మానవ జీవితానికి అవసరమైన చాలా మంచి సమాచారాన్ని పొందవచ్చు. గరుడ పురాణం ప్రకారం, మనం పాపుల నుంచి ఆహారం స్వీక‌రిస్తే, వారి పాపాలలో మనం కూడా పాలుపంచుకుంటాము. ఐతే ఎవ‌రి నుంచి ఆహారం తీసుకుంటే మ‌న‌కూ పాపం అంటుతుందో తెలుసా..?


నేరస్థుడి నుంచి ఆహారం తీసుకుంటే
గరుడ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి న్యాయ‌స్థానంలో లేదా చట్టం ద్వారా దోషిగా తేలితే, ఆ వ్యక్తి నుంచి ఆహారం ఎప్పుడూ తీసుకోకూడ‌దు. అన్యాయం చేసిన వ్యక్తి చేతి నుంచి ఆహారం మనం స్వీక‌రిస్తే, అతని పాపంలో మనం పాలుపంచుకుంటాము. నేరస్థుడి నుంచి ఆహారం తినడం మన వ్యక్తిగత జీవితాలపై కూడా చెడు ప్రభావం చూపుతుంది.


వ‌డ్డీ వ్యాపారుల‌ దగ్గర స్వీక‌రిస్తే
నేటి కాలంలో చాలామంది తమ డబ్బును వడ్డీకి అప్పుగా ఇస్తున్నారు. ముఖ్యంగా వడ్డీకి డబ్బులు తీసుకున్న వ్యక్తి పరిస్థితి చూడకుండా.. వడ్డీల పేరుతో మోసం చేసి అతని నుంచి వీలైనంత ఎక్కువ సొమ్ము తీసుకుంటున్నారు. వడ్డీ పేరుతో పేదల ప్రాణాలను హరించే వారి నుంచి ఆహారం మాత్రమే కాదు, కొంచెం నీరు కూడా తాగకూడదని గరుడ పురాణం చెబుతోంది.


Also Read: అమ్మ కడుపులో ఉన్నప్పుడే నరకం మొదలైపోతుందా, గరుడ పురాణం ఏం చెబుతోంది


ఇలాంటి మ‌హిళ‌ల‌ నుంచి
శాస్త్రాల ప్రకారం, మ‌హిళ‌లు తాము వెళ్లే మార్గం మంచి మార్గం కాదని తెలిసినప్పటికీ ఆమె ఇష్టపూర్వకంగా ఆ మార్గంలో వెళితే ఆమె నుంచి ఆహారం తీసుకోకూడ‌దు. అలాంటి స్త్రీల నుంచి ఆహారం తీసుకోవ‌డం మానవ ధర్మాన్ని అవమానించడమే. తెలిసీ తెలియక చేసిన తప్పులకు క్షమాపణ ఉంటుంది, కానీ తప్పని తెలిసీ చేసినా క్షమాపణ ఎక్కడుంది?


రోగి నుంచి
అంటు వ్యాధి లేదా నయం చేయలేని తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి నుంచి ఆహారాన్ని ఎప్పుడూ తినకూడదు. కొన్నిసార్లు ఆ వ్యక్తి తన పాపం వల్ల అనారోగ్యం అనుభ‌వించ వ‌చ్చు, మీరు అతని నుంచి ఆహారం స్వీక‌రిస్తే మీరు అతని పాపాన్ని కూడా పొందవచ్చు. శాస్త్రీయంగా చెప్పాలంటే ఆ ఇన్ఫెక్షన్ మీకు కూడా వ్యాపిస్తుంది.


హిజ్రాల నుంచి 
గరుడ పురాణం ప్రకారం, హిజ్రాల నుంచి ఆహారం తీసుకోరాదు. హిజ్రాలకు మనం దానం చేస్తే పుణ్యం వస్తుంది. మనలా చాలా మంది వారికి దానం చేస్తారు. వారిలో పాపాలు చేసిన వారూ ఉంటారు. కాబట్టి హిజ్రాల‌కు దానధర్మాలు చేయండి కానీ వారి నుండి ఆహారాన్ని స్వీకరించవద్ద‌ని గ‌రుడ పురాణం సూచించింది.


కోపంగా ఉన్న వ్యక్తుల నుంచి
మనిషికి ప్రధాన శత్రువు అతని కోపం. కోపంతో ఉన్న‌ వ్యక్తి భావోద్వేగాలను పట్టించుకోడు. అలాంటి వారి నుంచి ఆహారాన్ని స్వీకరిస్తే మన జీవితంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.


Also Read: పక్కవాళ్లకు స్వీట్ ఇవ్వకుండా తింటే కూడా పాపమే? గరుడ పురాణంలో ఘోరమైన శిక్ష?


మోసగాళ్ల నుంచి
మోసపూరిత స్వభావం గల వ్యక్తుల నుంచి ఆహారం ఎప్పుడూ తీసుకోకూడదు. మోసం చేయడం అత్యంత ఘోరమైన పాపం, ఎందుకంటే ఇది మోసపోయిన వ్యక్తిని మాత్రమే కాకుండా అతని కుటుంబాన్ని, స‌న్నిహితుల‌నూ బాధపెడుతుంది.


క‌ఠినాత్ముల‌ నుంచి
ఇత‌ర ప్రాణుల ప‌ట్ట దయ, క‌రుణ‌ లేని వారి నుంచి ఆహారాన్ని ఎప్పుడూ స్వీకరించకూడదు. కరుణామయులైన వ్యక్తుల నుంచి ఆహారం తీసుకోవడం వల్ల మన పాప ఫ‌లం కూడా తగ్గుతుంది. మనలో ధర్మం పెరుగుతుంది.


మ‌త్తు బానిసల నుంచి
గరుడ పురాణం ప్రకారం, మ‌త్తు ప‌దార్థాల‌కు బానిసైన వారి నుంచి అవి విక్రయించే వ్యక్తి నుంచి ఆహారం తీసుకోరాదు. మ‌త్తు ప‌దార్థాలు వ్య‌క్తుల‌ను, వారి కుటుంబాన్ని నాశనం చేస్తాయి. అందువ‌ల్ల‌ అలాంటి వారి దగ్గర ఆహారం తీసుకుంటే వారి పాపంలో మనం కూడా భాగ‌స్వాములు అవుతాం.