ఏప్రిల్ 14 రాశిఫలాలు


మేషరాశి


 ఈ రాశివారు ఈ రోజు ఎలాంటి వివాదాల జోలికి పోవద్దు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మాటను అదుపులో ఉంచుకోవాలి..లేదంటే భాగస్వాములతో గొడవలు తప్పవు. ఈ రోజు మీకు పెద్దగా అదృష్టం కలసిరాదు. కొత్త ఆర్థిక ప్రణాళికను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఉద్యోగులు పనిలో తొందరపాటు ప్రదర్శిస్తే సక్సెస్ కారు. 


వృషభ రాశి 


ఈ రోజు మీరు భావోద్వేగానికి లోనవుతారు. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. మానసికంగా దృఢంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడం అంత మంచిది కాదు. నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఆహారం విషయంలో శ్రద్ధ అవసరం.


మిథున రాశి 


ఈ రోజు మీరు రోజంతా సరదాగా ఉంటారు..అంతే బిజీగా ఉంటారు. స్నేహితులతో సరదా సమయం గడుపుతారు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది కానీ టార్గెట్ రీచ్ అవుతారు. వ్యాపారులకు అనుకూల సమయం. ఆర్థికపరిస్థితి బావుంటుంది. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుంటారు.


Also Read: ఈ రాశికి అమ్మాయిలకు పెళ్లితర్వాత రాణిభోగమే - భర్తకు కూడా ఫుల్ సపోర్ట్ గా ఉంటారు!


కర్కాటక రాశి 


వ్యాపార ప్రదేశంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రత్యర్థులు ఉత్సాహంగా ఉన్నప్పటికీ మీ విషయంలో మాత్రం తగ్గే ఉంటారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగులకు మంచి జరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి


సింహ రాశి


ఈ రాశివారు కోపాన్ని అదుపుచేసుకోవడం మంచిది. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. కుటుంబంలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. మానసిక క్షోభ ఉంటుంది.వ్యాపారులు మాత్రం లాభపడతారు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెడతారు. 


కన్యా రాశి 


ఈ రాశివారికి ఈ రోజు శారీరక బలహీనత ఉంటుంది. పనిలో ఆందోళన పెరుగుతుంది. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఏదో విషయంలో నిరాశ చెందుతారు. సంతానం గురించి ఆందోళన వెంటాడుతుంది. రోజంతా ప్రశాంతంగా గడుపుతారు.


Also Read: సింహాద్రి అప్పన్నకు ఏడాదికోసారి చందనోత్సవం ఎందుకు చేస్తారు, ఈసారి ఎప్పుడొచ్చింది!


తులా రాశి


ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడం మంచిది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచిరోజు. పాత స్నేహితులను కలుసుకుంటారు. సామాజిక జీవితంలో గౌరవం లభిస్తుంది. మధ్యాహ్నాం తర్వాత ఏదో విషయంలో మీ మనసు ఆందోళనగా ఉంటంది. కుటుంబ వాతావరణం ఉద్రిక్తంగా ఉంటుంది.


వృశ్చిక రాశి


కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మాట విషయంలో సంయమనం పాటించాలి. పనిలో ఆశించిన విజయం లభించదు.  మనసులో ఏదో ఒక విషయంలో గందరగోళం నెలకొంటుంది. పనిభారం అధికంగా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. బంధుమిత్రులతో సంబంధాల మెరుగుపడతాయి


ధనుస్సు రాశి


ఈ రోజు మీకు మంచిరోజు అవుతుంది.అదృష్టం  కలిసొస్తుంది. ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. శారీరకంగా మరియు మానసికంగా  ఉత్సాహంగా ఉంటారు. ప్రతి పనిలో విజయం సాధించడం వల్ల ఉత్సాహం  రెట్టింపు అవుతుంది. ఓవరాల్ గా చూస్తే శుభఫలితాలే ఉన్నాయి.


మకర రాశి


ఈరోజు మీ మాట విషయంలో సంయమనం పాటించండి. కోపం మితిమీరి ఉంటుంది. తీవ్రమైన చర్చలకు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మనసులో ఆందోళన కలుగుతుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కనబరచడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మధ్యాహ్నం తరువాత, మీరు కొత్త శక్తిని అనుభవిస్తారు. మీ వల్ల ఎవరైనా ప్రభావితమవుతారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.


కుంభ రాశి


ఈ రోజు ప్రయోజనకరమైన రోజు. రోజంతా చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. మీ పేరుప్రఖ్యాతులు పెరుగుతాయి. వివాహిత యువకులకు అనుకూలమైన జీవిత భాగస్వామి లభించే అవకాశం ఉంది. సన్నిహితులతో కలవడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. మధ్యాహ్నం తరువాత ఇంట్లో ఎవరితోనైనా వివాదం ఉండవచ్చు. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది.


మీన రాశి 


ఈ రోజు మీ ఆలోచనలు దృఢంగా ఉండవు. భాగస్వామ్య వ్యాపారులు లాభపడతారు. ఉద్యోగులు చేపట్టిన పనులు సకాలంలోపూర్తిచేస్తారు. అదనపు పనిభారం మీపై ఉంటుంది. వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. శాంతి, సంతోషాలు కలుగుతాయి. ఈ రాశివారు తండ్రి నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.