Zodiac signs: ఓ వ్యక్తిమనస్తత్వం, తీరు, స్వభావం చెప్పేస్తుంది జాతకం. ఓ వ్యక్తి భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. మొత్తం 12 రాశిచక్రాలలో  కొన్ని రాశులని దేవగురువు బృహస్పతి పాలిస్తే మరికొన్నింటిని శుక్రుడు పరిపాలిస్తాడు. ఈ రెండు గ్రహాలు వివాహానికి, దాంపత్య జీవితానికి కారకాలుగా చెబుతారు. ఈ గ్రహాల సంచారం ఆధారంగానే బంధం బలంగా ఉంటుందా, వివాదాలుంటాయా అన్నది చెబుతారు. అబ్బాయిల వివాహానికి బృహస్పతి కారకుడైతే..అమ్మాయిలకు వివాహానికి శుక్రుడు కారకుడని నమ్ముతారు. రాశుల ప్రకారం చూస్తే మూడు రాశులకు చెందిన అమ్మాయిలు వివాహం తర్వాత అదృష్టవంతులుగా మారుతారు...వాళ్లు మాత్రమే కాదు వీరి కారణంగా వారి జీవితభాగస్వామికి కూడా అదృష్టం కలిసొస్తుందని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఆ మూడు రాశులేంటంటే..


వృషభ రాశి (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)


జ్యోతిషశాస్త్రం ప్రకారం వృషభ రాశి అమ్మాయిలు వివాహం తర్వాత భర్త లక్కుని టర్న్ చేస్తారు. అప్పటి వరకూ అటు ఇటుగా ఉన్న జీవితం వృషభ రాశి అమ్మాయిలు అడుగుపెట్టిన తర్వాత ఓ రేంజ్ లో ఉంటుందట. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి అమ్మాయిలు చాలా ఆకర్షణీయంగా ఉంటారు..తెలివైన వారు, కళా ప్రేమికులు..ఈ రాశి అమ్మాయిని వివాహం చేసుకున్న పురుషుడి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది..జీవితంలో ఉన్నత స్థానానికి వెళతారని చెబుతారు.


Also Read: అక్షయ తృతీయ ఎప్పుడు (ఏప్రిల్ 22 or ఏప్రిల్ 23) జరుపుకోవాలి, ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి!


కర్కాటక రాశి (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడి ఆరాధ్య దైవం పరమేశ్వరుడు. అందుకే ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలు స్వతహాగా ప్రకాశవంతంగా ఉంటారు..ఏ రంగులో ఉన్నా మంచి కళ కలిగిన ముఖం కలిగి ఉంటారు,చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. వీరిలో ఏమోషన్స్ ఎక్కువ. అయితే కష్టసమయాల్లో భర్తకు అండగా నిలవడంలో కర్కాటక రాశి అమ్మాయిలు ముందుంటారని చెబుతున్నారు జ్యోతిష్యశాస్త్ర పండితులు. వీరి వైవాహిక జీవితం గర్వంగా గడిచిపోతుంది. జ్యోతిష్య శాస్త్రంలో కర్కాటక రాశి అమ్మాయిలను కోహినూర్ డైమండ్ అంటారు. ప్రతి విషయంలోనూ వీరి తీసుకునే జాగ్రత్తలు ఓ రేంజ్ లో ఉంటాయి..


Also Read: ఏప్రిల్ 13 రాశిఫలాలు, ఈ రాశివారు ఆర్థిక విషయాల్లో రిస్క్ చేయకూడదు


మీన రాశి (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీన రాశికి అధిపతి దేవగురువు బృహస్పతి. ఆయన ఆరాధ్య దైవం శ్రీ మహా విష్ణువు. ఈ రాశికి చెందిన అమ్మాయిలు ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ అమ్మాయిలకు తమ భర్తంటే చాలా ఇష్టం. వీరి వైవాహిక జీవితం చాలా సంతోషంగా గడిచిపోతుంది. అత్తమామలతో కూడా మంచి అనుబంధం ఉంటుంది. ఈ రాశి అమ్మాయిలను పెళ్లిచేసుకున్న వారు చాలా చాలా అదృష్టవంతులు


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం.  ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.