ఏప్రిల్ 13 రాశిఫలాలు


మేష రాశి
ఈ రాశివారు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది..మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, వ్యాపారులకు శుభసమయం. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది.


వృషభ రాశి
ఈ రాశివారికి కుటుంబ సంబంధాలు దృఢంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్వక్ష్యంగా వ్యవహరించవద్దు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పూర్తవుతాయి. ఉద్యోగులు పనిపై శ్రద్ధపెట్టాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞువ సలహాలు తీసుకోవడం మంచిది.


మిథున రాశి
ఈ రాశివారు కోపాన్ని అదుపులో పెట్టుకోండి. పని ఒత్తిడి పెరుగుతుంది..మీ ఆరోగ్యం దెబ్బతినొచ్చు జాగ్రత్తపడండి. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహాయసహకారాలు లభిస్తాయి. సంతానం కారణంగా కొంత ఆందోళన ఉంటుంది.


Also Read: ఈ వారం ఈ రాశివారు డబ్బు-సమయం రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి


కర్కాటక రాశి
ఈ రాశి వ్యాపారులు, ఉద్యోగులకు...పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. రాజకీయనాయకుల నుంచి మీకు అవసరమైన సపోర్ట్ పెరుగుతుంది. 


సింహ రాశి
ఈ రాశికి చెందినవారిని ఏదో తెలియని ఆందోళన వెంటాడుతుంది. పై అధికారుల నుంచి ఉద్యోగులకు సహాయం అందుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు కలిసొస్తాయి. ఆదాయం బాగానే ఉంటుంది...ఖర్చులు మాత్రం తగ్గించేందుకు ప్లాన్ చేసుకోండి.


కన్యా రాశి
ఈ రాశివారికి కుటుంబంలో, పనిచేసే ప్రదేశంలోనూ ఒత్తిడి ఉంటుంది. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. మీరు తలపెట్టిన పనులన్నింటికీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.


Also Read:ఈ వారం ఈ రాశివారికి శుభప్రదం - కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది


తులా రాశి
ఈ రాశివారి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబం నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిపై శ్రద్ధ పెరుగుతుంది... ఉన్నతాధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారం విజృంభిస్తుంది. ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది.


వృశ్చిక రాశి
ఈ రాశివారికి ఉద్యోగంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. వీరి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. తెలివితేటలతో చేపట్టిన పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు లాభాలొస్తాయి


ధనుస్సు రాశి
ఈ రాశివారు ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా పనులు పెండింగ్ ఉన్నా...ఈరోజే ప్రారంభించినా అంతా బాగానే ఉంటుంది. కుటుంబం నుంచి సహకారం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు


మకర రాశి
ఈ రాశివారి సృజనాత్మక ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. జీవనోపాధి రంగంలో పురోగతి ఉంటుంది.నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమచారం వింటారు. 


కుంభ రాశి 
ఈ రాశివారు ఆర్థిక విషయాల్లో రిస్క్ తీసుకోవద్దు. లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. వ్యాపారం లేదా ఉద్యోగం పరంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది...ఈ ప్రయాణాల వల్ల విజయం పొందుతారు.


మీన రాశి
ఈ రాశి ఉద్యోగుల కెరీర్ పరంగా మరో మెట్టు ఎక్కుతారు. వ్యాపారం బాగా సాగుతుంది. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. కోపం తగ్గించుకోవాలి..అనవసర విషయాలపై చర్చలు పెట్టొద్దు