సలాడ్ లో కూరగాయ ముక్కలతో పాటు ఆకుకూరలు జోడిస్తేనే అది అద్భుతంగా రుచిగా, కలర్ ఫుల్ గా మారిపోతుంది. చూడగానే నోరూరించేలా కనిపిస్తుంది. గ్రీన్ వెజిటబుల్స్ లో కేలరీలు తక్కువ పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే సలాడ్ కి సరైన జోడింపు ఆకుకూరలు. దీన్ని అల్పాహారం లేదా భోజనంతో పాటు తీసుకోవచ్చు. కూరగాయలు, చికెన్, ఫిష్ వంటి ప్రోటీన్ ఫుడ్ తో సలాడ్ చేసుకుని తింటే చాలా ఆరోగ్యం. మీకు సలాడ్ అంటే ఇష్టమా అయితే చివర్లో డ్రెస్సింగ్ గా ఈ ఆకుకూరలు చేర్చుకోండి. టేస్ట్ సూపర్ గా కంటికి కూడా ఇంపుగా కనిపిస్తుంది.


పాలకూర


ఆకుకూరలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పాలకూర. భారతదేశంలో సమృద్ధిగా లభించడమే కాకుండా అనేక పోషకాలతో నిండి ఉంది. పాలకూర తీసుకోవడం వల్ల ఐరన్, కాల్షియం, విటమిన్లు ఏ, సి వంటి పోషకాలు లభిస్తాయి. సలాడ్ కి మంచి రంగు ఇవ్వడం కోసం పాలకూర పచ్చిగా వేసుకోవచ్చు. లేదంటే దాన్ని కాస్త బ్లాంచ్ చేసుకోవచ్చు.


అరుగులా


అరుగులా ఆకులు వివిధ వంటకాల్లో ఉపయోగించే మరొక ప్రసిద్ధ ఆకుకూర. కొద్దిగా చేదు, పెప్పర్ టేస్ట్ ని కలిగి ఉంటుంది. ఇతర సలాడ్ రుచిని సంపూర్ణం చేస్తుంది. దీన్ని రాకెట్ ఆకులు అని కూడా పిలుస్తారు. అరుగులా ఆకుల్లో విటమిన్లు ఏ, సి, కె, ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఇనుము, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. మధుమేహులకు చక్కగా పని చేస్తుంది. ఇది తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. పేగుల పనితీరుని పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.


కాలే


కాలే అనేది ఫైబర్ ప్యాక్డ్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్. దీన్ని పచ్చిగా లేదంటే వండుకుని తినవచ్చు. కాలే ఎటువంటి సలాడ్ కి అయినా మంచి రుచిని యాడ్ చేస్తుంది. ఇది కొద్దిగా మట్టి వాసన రుచిని కలిగి ఉంటుంది. సలాడ్ కి క్రంచ్‌ను జోడిస్తుంది. కాలేలో ఒమేగా 3 ఆమ్లాలు, ప్రోటీన్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు ఏ, సి, కె వంటివి లభిస్తాయి.


బచ్చలికూర


బర్గర్, శాండ్ విచ్, ర్యాప్ కి బచ్చలికూర అద్భుతమైన రుచిని అందిస్తుంది. డిష్ కి క్రంచీనెస్ ఇస్తుంది. ఒకవేళ ఇది దొరక్కపోతే క్యాబేజీని ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఇది వేయడం వల్ల సలాడ్ కి తాజాదనం ఇస్తుంది. ఇందులో విటమిన్ ఏ, సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, నీటితో నిండి ఉంటుంది.


బ్రొకోలి


సలాడ్ ని పోషకాలతో నింపాలని అనుకుంటే మీరు ఖచ్చితంగా బ్రొకోలి జోడించుకోవాల్సిందే. దాన్ని చిన్న చిన్న పుష్పగుచ్చాలుగా కట్ చేసి ఆపై రెండు నిమిషాలు బ్లాంచ చేయడం ఉత్తమం. తర్వాత వాటిని చల్లని ఐస్ వాటర్ లో కొన్ని నిమిషాల పాటు ఉంచి వాటిని తీసేయాలి. ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి, ఫైటో కెమికల్స్ ఉన్నాయి. ఇవి శరీరంపై శోధ నిరోధక ప్రభావాన్ని కలిగి ఉంటుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: పిరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కలిగించే పానీయాలు ఇవే