పీరియడ్స్ సమయంలో కడుపులో నొప్పి, వెన్ను, కాళ్ళు విపరీతమైన నొప్పులుగా ఉంటాయి. ఇక ఉబ్బరం సమస్య భరించడం చాలా కష్టమైన పని. పీరియడ్స్ శరీరంలోని హార్మోన్లను షఫుల్ చేయడమే కాకుండా మూడ్ స్వింగ్స కూడా మారిపోతాయి. కడుపు ఉబ్బరం తట్టుకోవడం అందరి వల్ల కాదు. దీని నుంచి ఉపశమనం పొందటం కోసం ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతారు. కానీ అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తుంది. పీరియడ్స్ సమయంలో కడుపు ఉబ్బరాన్ని ఎదుర్కోవడానికి మీకు ఈ ఆహారాలు సరిగా సరిపోతాయి.
సొంపు గింజలు
ఫెన్నెల్ గింజలు సాధారణంగా భోజనం తర్వాత తింటారు. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. ఒక గ్లాసు నీటిని మరిగించి అందులో టీ స్పూన్ సొంపు గింజలు వేసుకుని చల్లారిన తర్వాత ఆ నీటిని తాగాలి. ఇందులో అనెథోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది సహజమైన యాంటీ స్పాస్మోడిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్. అనెథోల్ జీర్ణాశయంలోని కండరాలను సడలించడంలో సహాయపడుతుంది. తిమ్మిరి, ఉబ్బరం సమస్యల్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
పుదీనా టీ
పిప్పర్ మెంట్ టీ అనేది పీరియడ్స్ సమయంలో ఉపయోగపడే నేచురల్ రెమిడీ. ఇందులో మెంతొల్ అనే క్రియాశీల పదార్థం ఉంటుంది. జీర్ణవ్యవస్థపై అనుకూల ప్రభావం చూపుతుంది. జీర్ణవ్యవస్థ నుంచి గ్యాస్ ని తొలగించడంలో సహాయపడుతుంది. అందుకే పీరియడ్స్ సమయంలో ప్రతిరోజూ కనీసం ఒక కప్పు పిప్పర్ మెంట్ టీ తాగితే మంచిది.
జీలకర్ర, వామ్ము కలిపిన టీ
తిమ్మిరి, పొట్ట ఉబ్బినట్టుగా అనిపిస్తే జీరా అజ్వైన్ టీ టీ చక్కగా ఆపని చేస్తుంది. ఇవి రెండూ సహజంగా వెచ్చని స్వభావాన్ని కలిగి ఉన్నందున తిమ్మిరి నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. ఉబ్బరం తగ్గించి జీర్ణక్రియని క్రమబద్ధీకరిస్తుంది.
కీరదోసకాయ నీళ్ళు
కీరదోస కాయ నీటిని తయారు చేయడానికి ఒక జగ్ లో నీటిని తీసుకుని అందులో దోసకాయ ముక్కలు వేసుకోవాలి. తాజాదనం కోసం కొన్ని పుదీనా ఆకులు కూడా జోడించుకోవచ్చు. రాత్రిపూట లేదా కొన్ని గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి. ఈ నీటిని రోజంతా తాగాలి. ఇది ఉబ్బరాన్ని తగ్గించడమే కాకుండా మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది. వేసవిలో ఈ నీటిని తీసుకుంటే శరీరం హైడ్రేట్ గాను ఉంటుంది.
చమోమిలీ టీ
చామంతి పూల టీ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల ప్రశాంతత, విశ్రాంతి గా అనిపిస్తుంది. ఆందోళన తగ్గించి మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. ఇందులో ఫ్లేవనాయిడ్లు ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తాయి. ఉబ్బరం తగ్గడానికి రోజులో ఎప్పుడైనా ఈ టీని తీసుకోవచ్చు. ఈ టీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: వాయు కాలుష్యం కోవిడ్ వ్యాక్సిన్ సామర్థ్యాన్ని తగ్గిస్తుందా? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది