వాయు కాలుష్యం ఎంత ప్రమాదకరమో అనేది అందరికీ తెలిసిందే. శరీరంలోని ముఖ్యమైన అవయవాల పనితీరు మందగించేలా చేసే వాయు కాలుష్యం వల్ల కోవిడ్ వ్యాక్సిన్ సరిగా పని చేయదని కొత్త అధ్యయనం వెల్లడించింది. కోవిడ్ మహమ్మరికి ముందు అధిక స్థాయి వాయు కాలుష్యానికి గురైన వ్యక్తులు కోవిడ్ వ్యాక్సిన్స్ వల్ల తక్కువ యాంటీ బాడీలను కలిగి ఉంటున్నట్టు అధ్యయనం సూచించింది. ప్రత్యేకించి ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ (PM2.5), నైట్రోజన్ డయాక్సైడ్ (NO2), బ్లాక్ కార్బన్ (BC)కి గురికావడం వల్ల ముందస్తు ఇన్‌ఫెక్షన్ లేని వ్యక్తులలో IgM, IgG యాంటీబాడీ ప్రతిస్పందనలలో 10 శాతం తగ్గుదల ఉంటుందని పరిశోధకులు తెలిపారు. బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్, స్పెయిన్ లోని జర్మన్స్ ట్రయాస్ ఐ పుజోల్  రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా పరిశోధన జరిపారు.


టీకా వేయడం వల్ల ఇన్ఫెక్షన్ ని ఎదుర్కొనే యాంటీ బాడీలు ఎక్కువగా స్పందిస్తాయి. వాయు కాలుష్యం దీర్ఘకాలిక మంటాను ప్రేరేపిస్తుంది. ఇది టీకా సమర్థతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశోధకులు తెలిపారు. నిరంతర సేంద్రీయ కాలుష్య కారకాలు పిల్లల్లో టీకా ప్రతిస్పందనలు తగ్గిస్తాయని సాక్ష్యాలతో సహా పరిశోధకులు నిరూపించారు. వాయు కాలుష్య కారకాలు రోగనిరోధక ప్రతిస్పందనలను ప్రభావితం చేస్తుందని తేలింది.  వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, హృదయ, శ్వాసకోశ వ్యాధులు, మధుమేహంలో సహా అనేక రోగాలతో ముడి పడి ఉంది.


పరిశోధన సాగింది ఇలా..


మొదటి లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత 2020 వేసవిలో, 2021 కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానికి సంబంధించి కొన్ని ప్రశ్నాపత్రాలు ఇచ్చారు. ఈ సర్వేలో పాల్గొన్న వారి రక్తనమూనాలు కూడా సేకరించారు. 40 నుంచి 65 సంవత్సరాల వయసు కలిగిన 927 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ఒకటి లేదా రెండు డోస్ లను అందరూ తీసుకున్నారు. పరిశోధనా బృందం వారి IgM, IgG, IgA ప్రతిరోధకాలను ఐదు వైరల్ యాంటిజెన్‌లకు (వాక్సిన్‌లో ఉన్నమూడు స్పైక్ ప్రోటీన్‌ లు) కొలిచింది. ఫైన్ పర్టిక్యులేట్ మ్యాటర్ (PM2.5), బ్లాక్ కార్బన్ (BC), నైట్రోజన్ డయాక్సైడ్ (NO2), ఓజోన్ (O3)కి ఎక్స్పోజర్ మహమ్మారికి ముందు  ఎలా ఉన్నాయో పరిశీలించారు.


వ్యాధి శోకని వ్యక్తుల్లో PM2.5, NO2, BCలకు ప్రీ పాండమిక్ ఎక్స్పోజర్ వ్యాక్సిన్ ప్రేరిత స్పైక్ యాంటీబాడీస్‌లో 5 శాతం నుండి 10 శాతం తగ్గింపుతో సంబంధం కలిగి ఉందని ఫలితాలు చూపిస్తున్నాయి. మొదటి మోతాదు తర్వాత IgG ప్రతిస్పందన అధిక వాయు కాలుష్య స్థాయిలకు గురైన పాల్గొనేవారిలో గరిష్ట స్థాయికి చేరుకుంది. టీకా తర్వాత చాలా నెలల పాటు తక్కువ IgG స్థాయిలు కొనసాగాయి. మూడు వ్యాక్సిన్‌లకు ఫలితాలు సమానంగా ఉన్నాయి.యాంటీబాడీ ప్రతిస్పందనలో తగ్గుదల వల్ల అంటు వ్యాధులు, వాటి తీవ్రత ఏ విధంగా ఉంటుందో పరిశీలించలేదు. కానీ ఏది ఏమైనప్పటికీ వాయు కాలుష్యం వల్ల మాత్రం అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: తెల్ల జుట్టుకి ఇవి అప్లై చేశారంటే మీకు కావాల్సిన రంగులోకి జుట్టు మారిపోతుంది