పెళ్లి అయితే అమ్మ మీద ప్రేమ తగ్గుతుందని బసవయ్య అనేసరికి విక్రమ్ కొప్పడతాడు. అమ్మ ప్రేమతో పోటీ పడేది భార్య మాత్రమేనని అంటాడు. నా జీవితంలోకి ఎవరు వచ్చినా అమ్మ తర్వాతే నాకు అమ్మ మాట తర్వాతే ఏదైనా రాసి పెట్టుకోమని కోపంగా చెప్తాడు. విక్రమ్ తన తండ్రి దగ్గరకి వచ్చి అక్షింతలు చూపించి ఆశీర్వదించమని చూపిస్తాడు. మీ నాన్న చేతులతో మాటలతో దీవించలేడు, మనసుతో మాత్రమే దీవించగలడు దేవుడు ఆ అవకాశం మాత్రమే ఇచ్చాడని విక్రమ్ తాతయ్య ఎమోషనల్ అవుతాడు. విక్రమ్ తండ్రి కాళ్ళ మీద పడి ఆశ్వీరవాదం తీసుకుంటాడు. తల్లిలేని కొడుకుని చూసుకోవడం కోసం బలవంతంగా పెళ్లి చేశాను కానీ ఆ మహాతల్లి తండ్రిని కూడా దూరం చేసింది ఇలా తయారు చేసిందని చెప్తాడు. మీరు అనవసరంగా అమ్మని అనుమానిస్తూ దూరం చేసుకుంటున్నారు మీరు మారాడం లేదు ఏంటని విక్రమ్ అంటాడు.
Also Read: కాలు జారిన రాజ్, కడుపుబ్బా నవ్వించేసిన మీనాక్షి- కనకం ఇంటికి అపర్ణ
మారాల్సింది తెలుసుకోవాల్సింది నేను కాదు నువ్వని విక్రమ్ తండ్రి బాధపడతాడు. దివ్యని అందంగా ముస్తాబు చేసి తీసుకొస్తారు. పెళ్లి కళ వచ్చేసిందని అందరూ సంతోషంగా ఉంటారు. ఇన్నేళ్ళు తండ్రిగా చెప్పుకున్నా కానీ ఇప్పుడు తండ్రిగా ఫీల్ అవుతున్నా. ఆడపిల్ల పెళ్లి చేయడంతో అమ్మానాన్న బాద్యత తీరిపోయిందని అందరూ చెప్తారు. కానీ పెళ్లితో బాధ్యత పెరుగుతుంది. అత్తారింట్లో కూతురు ఎలా ఉందో కూతురు చెప్తే కానీ తెలియదని నందు ఎమోషనల్ అవుతాడు. తులసి జీవితం అత్తారింట్లో ఎలా ఉందో చూసి నేర్చుకోమని సరస్వతి అంటుంది. నందు మాటలు విని పరంధామయ్య సంతోషంగా ఉందని అంటాడు. అక్కడ ఉంది రాజ్యలక్ష్మి మీరంతా ఆ పద్మ వ్యూహంలో చిక్కుకుని అల్లాడిపోవాల్సిందేనని లాస్య మనసులో సంబరపడుతుంది. ప్రియ కాఫీ తీసుకుని సంజయ్ దగ్గరకి వస్తుంది. తన మీద అరుస్తాడు. అప్పుడే పనిమనిషి వచ్చి విక్రమ్ పిలుస్తున్నాడని చెప్పేసరికి సంజయ్ వెళ్ళిపోతాడు.
Also Read: చావు బతుకుల్లో యష్- వేద, విన్నీకి అక్రమసంబంధం అంటగట్టిన మిస్టర్ యారగెంట్
ప్రియ సంజయ్ ఫోన్ తీసుకుని దివ్యకి ఫోన్ చేస్తుంది. దివ్యని రక్షించడానికి ఈ అవకాశం ఇచ్చినట్టు ఉన్నాడని అనుకుంటుంది. దివ్యని ఇంట్లో అందరూ ఆట పట్టించేసారికి ఫోన్ పక్కన పెట్టేస్తుంది. అది చూసి సంజయ్ నాకు కాల్ చేస్తున్నాడు ఏంటని ఆలోచిస్తూ ఉండగా ఇటు ప్రియ ఫోన్ చేయడం రాజ్యలక్ష్మి చూస్తుంది. వెంటనే తన దగ్గరకి వచ్చి ఫోన్ లాగేసుకుని దివ్య వాయిస్ విని ఫోన్ ఆఫ్ చేస్తుంది. ముద్దుగా చెప్పినా అర్థం కాలేదు, బెదిరించినా అర్థం కాలేదు ఏంటి నీ ధైర్యం. నాకు ఎదురు తిరిగితే నా అంత రాక్షసి ఉండదు. దివ్యని కోడల్ని చేసుకునేది నరకం చూపించడానికి అని నిజం బయటకి వస్తే శాశ్వతంగా నీ నోరు మూగబోతుంది. నీ ప్రాణాలతో పాటు మీ అమ్మానాన్న ప్రాణాలు పోతాయని బెదిరిస్తుంది. దివ్య నేను బతిమలాడితేనే ఇలా చేసింది తనని వదిలేయమని ప్రియ వేడుకుంటుంది. నువ్వు చెప్తే ఎగేసుకుని నా మీద యుద్ధానికి రావడమేనా? నా కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా. కానీ బూడిదలో పోసిన పన్నీరు చేసింది. దానికి నరకం చూపిస్తానని అంటుంది.