వేద క్యారెక్టర్ గురించి యష్ నీచంగా మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా అని వేద బాధగా అడుగుతుంది. తనని బలవంతం చేయబోతుంటే మీతో మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉందని అంటుంది.
యష్: వదిలితే ఎక్కడికైనా వస్తానని ఎవరికైనా చెప్పావా అనేసరికి వేద లాగి పెట్టి చెంప పగలగొడుతుంది.
వేద: ఏదో బాధలో ఉన్నారు కదా అని ఓదారుద్దామని వచ్చాను కానీ అనేసి బాధగా వెళ్ళిపోతుంది. వెళ్లిపో నువ్వు ఎందుకు ఇక్కడ ఉంటావ్ నీకు ఇంకెవరో కావాలని యష్ నీచంగా మాట్లాడతాడు. వేద ఏడుస్తూ కూర్చుంటే చిత్ర ఫోన్ చేస్తుంది. పార్టీ నుంచి వస్తుంటే కొంతమంది తాగుబోతులు వసంత్ మీద ఎవరో అటాక్ చేశారని భయంగా ఉందని చెప్తుంది. దీంతో వేద కంగారుగా యష్ దగ్గరకి వచ్చి నిద్రలేపుతుంది. కానీ యష్ లేవకుండా తనని పక్కకి నెట్టేస్తాడు. వెంటనే విన్నీకి ఫోన్ చేసి విషయం చెప్తుంది. చాలా సేపటి తర్వాత యష్ కి మెలుకువ వచ్చి చూసేసరికి గదిలో వేద ఉండదు. ఇల్లంతా వెతికినా కనిపించకపోయే సరికి బయటకి వస్తాడు. అప్పుడే విన్నీ వేదని తీసుకుని కారులో ఇంటికి వస్తాడు.
Also Read: జానకికి ఫోన్ చేసి బెదిరించిన మధు- డీల్ కి ఒప్పేసుకోమన్న ఎస్సై
వసంత్ సేఫ్ కదా ఇంక టెన్షన్ పడకని విన్నీ అంటుంటే యష్ వస్తాడు. మీరిద్దరూ ఏదో మంచిగా మాట్లాడుకుంటున్నట్టు ఉన్నారు. ఇంత రాత్రి పూట నా భార్య కోసం వెయిట్ చేస్తున్నా. కానీ నా భార్యకి భర్త కాదు పాత స్నేహాలు ఉన్నాయని అంటాడు. అప్పుడే వసంత్ దెబ్బలతో వస్తాడు. ఏమైందని అడుగుతాడు. దారిలో వస్తుంటే తాగుబోతులు అటాక్ చేశారు టైమ్ కి వేద అక్క విన్నీ రావడం వల్ల సేఫ్ అయ్యామని చిత్ర చెప్తుంది.
అర్థరాత్రి ఎమర్జెన్సీ నీకు నీ భర్త గుర్తుకు రాలేదు కానీ విన్నీ గుర్తుకు వచ్చాడు. అయినా నా భార్యకి ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళ మీద నమ్మకం ఎక్కువ అనేసరికి విన్నీ ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదని అంటాడు. విన్నీ వెళ్లబోతుంటే వేద తన చెయ్యి పట్టుకుని ఆపుతుంది. ఏం తప్పు చేశావాని వెళ్లిపోతున్నావ్ నేను కాల్ చేయగానే వచ్చి వసంత్ ని సేవ్ చేశావ్ నీకు మా ఫ్యామిలీ అంతా రుణపడి ఉంటామని చెప్తుంది. పైకి వెళ్ళి కాఫీ తాగి రిలాక్స్ అవుదుగానీ పద అని అంటుంది. కానీ యష్ మాత్రం తప్పుగా మాట్లాడుతూనే ఉంటాడు. ఆ చేతిని ముందే ఎందుకు పట్టుకోలేదు వేద నేను ఏం ద్రోహం చేశానని యష్ బాధపడతాడు.
Also Read: పెళ్ళికూతురిగా ముస్తాబైన దివ్య, మురిసిన విక్రమ్- పెళ్ళికి రాకుండా ప్రియని బంధించిన రాజ్యలక్ష్మి
మీరు నాతో ఎలా ప్రవర్తించారో తెలుసా? అయినా వసంత్ కి అలా జరగానే మీదగ్గరకి వచ్చి లేపితే మెలుకువ లేకుండా తాగిన మైకంలో ఉన్నారని వేద చెప్తుంది. కానీ యష్ మాత్రం ఆగకుండా వేద, విన్నీ గురించి తప్పుగా మాట్లాడతాడు. లైఫ్ లో ఎవరినైతే నేను నమ్మానో ప్రేమించానో అందరూ నన్ను వదిలేశారు ఇప్పుడే అన్నీ అర్థం చేసుకున్నానని యష్ అంటాడు. విన్నీ సంజాయిషీ ఇవ్వబోతుంటే తప్పు చేయనప్పుడు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని వేద తనని ఆపుతుంది. నీకు ఎప్పుడు ఏం అవసరం మొచ్చినా నేను ఉన్నాను అండగా ఉంటానని చెప్పేసి విన్నీ వెళ్ళిపోతాడు. యష్ కోపంగా కారు డ్రైవ్ చేసుకుంటూ యాక్సిడెంట్ చేస్తాడు.