జానకి భర్త రామని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వస్తుంది. మనోహర్ కావాలని రామని డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు. రామని తీసుకెళ్ళి సెల్ లో వేయమని ఆర్డర్ వేస్తాడు. ఆయన అమాయకులు అని జానకి చెప్తున్నా వినిపించుకోకుండా మనోహర్ మాత్రం సెల్ లో వేయాల్సిందేనని అంటాడు. కట్టుకున్న భర్తని అరెస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి గొప్ప పని చేసి మీ ఆవిడ చరిత్రకెక్కింది. రేపటి నుంచి అందరూ ఈ విషయమే చెప్పుకుంటారు. కాసేపటిలో మీడియా వాళ్ళు వచ్చి ఫోటోలు తీసి జానకిని మెచ్చుకుని డిపార్ట్ మెంట్ వాళ్ళు ప్రమోషన్ ఇస్తారు. ఇదంతా నీ వల్లే కదా. కొంపదీసి ఇది నీ ప్లాన్ కాదు కదా జానకి అని రామకి ఎక్కిస్తాడు.


బిల్డర్ మధు జానకికి ఫోన్ చేస్తాడు. నీ భర్తని విడిపించుకునే దారి చెప్తానని అంటాడు. ఇప్పుడు దెబ్బకి దారిలోకి వస్తుంది జానకి అని మనోహర్ మనసులో అనుకుంటాడు. నా కేసు విషయంలో చాలా దూకుడుగా ఉన్నాడు కంట్రోల్ చేద్దామని అనుకున్నా కుదరలేదు. అందుకే నీ భర్తని ఇలా ఇరికించాను. నీ భర్త క్షేమంగా ఇంటికి రావాలని అనుకుంటే నువ్వు రెండు పనులు చేయాలి. ఒకటి నేను చేసిన మర్డర్ విషయంలో నువ్వు నోరు తెరవకూడదు. చూసింది చూసినట్టు మర్చిపోవాలి. రెండు నీ పోలీస్ ఉద్యోగానికి రిజైన్ చేయాలని కండిషన్ పెడతాడు. 24 గంటలు టైమ్ ఇస్తున్నా నా మాట వినకపోతే ఇంకా దారుణమైన పరిస్థితి ఎదురవుతుంది. ఇంటిల్లిపాది జైల్లో కూర్చుంటారని బెదిరిస్తాడు. జ్ఞానంబ వాళ్ళు ఇంట్లో అందరూ రామ కోసం దిగులు పడతారు.


Also Read: పెళ్ళికూతురిగా ముస్తాబైన దివ్య, మురిసిన విక్రమ్- పెళ్ళికి రాకుండా ప్రియని బంధించిన రాజ్యలక్ష్మి


రామ మంచివాడని అందరికీ తెలుసు అలాంటి వాడి చేతికి సంకెళ్ళు వేసి తీసుకెళ్లారని జ్ఞానంబ బాధపడతారు. ఇలా జరుగుతుందని అసలు ఊహించుకోలేదని గోవిందరాజులు అంటాడు.


మల్లిక: జానకి రాముల వారు లాంటి బావకి సంకెళ్ళు వేసి జైలుకి తీసుకెళ్లింది. అసలు తనది మనసా రాయా? మూడు ముళ్ళు వేసిన మొగుడ్ని సంకెళ్ళు వేసి లాక్కెళ్ళింది


జెస్సి: అక్క తన బాధ్యత నెరవేర్చింది


మల్లిక: పోలీస్ గానే కాదు భార్యగా కూడా ఉండాలి. ఒక తల్లిగా మీరు ఎంత బాధపడుతున్నారో మీ కన్నీళ్ళు చెప్తున్నాయి. మీ నలుగురు పిల్లల్లో మీకు బావ అంటేనే ఎక్కువ ఇష్టం. మీ తల్లి మనసుకి జానకి తూట్లు పొడిచింది. నా పెద్ద కోడలిది గవర్నమెంట్ ఉద్యోగమని డప్పు కొట్టుకున్నారు కదా ఇప్పుడు మరొక డప్పు పట్టుకుని వెళ్ళండి నా పెద్ద కోడలు కొడుకిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిందని. మీ తప్పు కూడా ఉంది అత్తయ్య. చిన్న పిల్లల ఫోటోలు కాకుండా సతీ సావిత్రి ఫోటోస్ ఇవ్వాలి. అప్పుడు ఈ తలనొప్పి ఉండేది కాదు


Also Read: రాజ్ ని మర్యాదలతో ముంచెత్తిన కనకం అండ్ కో- రాహుల్ కి దిమ్మతిరిగే షాకిచ్చిన స్వప్న


రామని విడిపించే మార్గం చూడమని జ్ఞానంబ విష్ణుకి చెప్తుంది. బయట నుంచి ఏదైనా సమస్య వస్తే చూసుకోవాల్సిన వదినే అన్నాయికి సంకెళ్ళు వేస్తే ఎవరికి చెప్పుకుంటాము. వెళ్ళి ఎస్సై కాళ్ళ మీద పడితే వదిన్ని అవమానించినట్టే, మన చేతుల్లో ఏమి లేదు అంతా వదిన చేయాలి తనని గట్టిగా అడగమని విష్ణు సలహా ఇస్తాడు. జానకి మనోహర్ దగ్గరకి వచ్చి మాట్లాదమని చూస్తుంది. ఎస్సై ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ వేస్తాడు. బిల్డర్ మధుకర్ రామ మీద తప్పుడు కేసు పెట్టి ఇరికించారని జానకి చెప్తుంది. కానీ మనోహర్ మాత్రం సాక్ష్యం ఉందా అని అడుగుతాడు. మధు చెప్పిన డీల్ గురించి జానకి ఎస్సైకి చెప్తే డీల్ కి ఒప్పేసుకోమని అంటాడు.