స్వప్న రాహుల్ కి కాల్ చేస్తుంది. కానీ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తాడు. ఇక లాభం లేదు నేరుగా రాజ్ ఇంటికి వెళ్ళి రాహుల్ అంతు తేల్చాల్సిందేనని అనుకుని స్వప్న బయల్దేరుతుంది. కనకం అల్లుడి కోసం అన్నీ రకాల వంటలు చేసి భోజనానికి సిద్ధం చేస్తుంది. అవన్నీ చూసి కావ్య ఎందుకు ఇవన్నీ అంటుంది. ఆడపిల్లని ఒక ఇంటికి ఇస్తాం. కూతుర్ని అల్లుడు బాగా చూసుకోవాలంటే ఇలా ఎన్నో వంటలు చేసి కొసరి కొసరి వడ్డించాలి. అలా చేస్తే అల్లుడు కూతుర్ని బాగా చూసుకుంటాడని కడుపు నిండా వడ్డిస్టే బంధాలు పెరుగుతాయని కృష్ణమూర్తి చెప్తాడు. అప్పుడే రాజ్ లుంగీ కట్టుకుని పడుతూ లేస్తూ తిప్పలు పడుతూ వస్తాడు. అప్పు ఇగో ఇగో అని పిలుస్తూ ఐస్ క్రీమ్ ఇగో ఇగో అంటుంది. అది నన్ను అన్నట్టు ఉంది ఇగో అనకు అంటాడు. కానీ అప్పు మాత్రం వదలకుండా ఇగో ఇగో అంటూ ఐస్ క్రీమ్ కావాలని రాజ్ ప్యాంట్ మీద పడేస్తుంది.


Also Read: చిత్రని పెళ్లి చేసుకోబోతున్నానని మాళవికకి చెప్పిన అభి- వేదని బలవంతం చేయబోయిన యష్


ఇప్పుడు ఎలా అని అనేసరికి అప్పు అయితే లుంగీ ఉంది కట్టుకోమని అనేసరికి రాజ్ చేసేది లేక అది కట్టుకుంటాడు. వంటలన్నీ చూసి ఫుడ్ ఎగ్జిబిషన్ పెట్టారు ఏంటని వెటకారం ఆడతాడు. కింద కూర్చోమని అంటే డైనింగ్ టేబుల్ లేదా అని అడుగుతాడు. ఉంది కానీ కుర్చీలు సరిగా లేవని చెప్తాడు. ఇంట్లో అపర్ణ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అది చూసి రుద్రాణి సంబరపడుతుంది. కంచులాంటి కోడలు వచ్చి నీ కొడుకిని కొంగున కట్టేసుకుందని సంతోషపడుతుంది. వెళ్ళి అపర్ణని పలకరిస్తుంది. రాజ్ భార్య మాట విని వెళ్ళడం తనకి నచ్చలేదని రుద్రాణి అంటుంది. అపర్ణని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. రాజ్ కి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదని అపర్ణ గట్టిగా చెప్తుంది. కానీ రాజ్ లో చాలా మార్పు వచ్చింది ఫస్ట్ నైట్ జరిగిన దగ్గర నుంచి మారిపోయాడు ఇప్పుడు అత్తారింటికి వెళ్ళాడు. వాళ్ళు రాజ్ కి మర్యాదలు చేసి తన వైపు తిప్పుకుంటారు కావాలంటే వీడియో కాల్ చేస్తానని రుద్రాణి అంటుంది. .


Also Read: తులసి ఇంట్లో సంబరంగా మొదలైన పెళ్లి పనులు- దివ్యకి ఫోన్ చేసిన ప్రియ


రాజ్ కింద కూర్చోడానికి ఇబ్బంది పెడుతుంటే అప్పు కూర్చోబెడుతుంది. ఒక పెద్ద అరిటాకు తెచ్చి వేసేసరికి రాజ్ బిత్తరపోతాడు. ఇంత ఖర్చు ఎందుకు దండగ నేను తినేది కొంచెం కదా అని అనేసరికి మీనాక్షీ చేసిన వంటలు లిస్ట్ చెప్పేసరికి నోరెళ్ళబెడతాడు. రాజ్ విస్తరి నిండుగా వడ్డిస్తారు. రుద్రాణి వీడియో కాల్ చేస్తే అప్పు లిఫ్ట్ చేస్తుంది. లుంగీ కట్టుకుని విచిత్రంగా కనిపించేసరికి అపర్ణ కోపం పీక్స్ కి వెళ్తుంది. మీనాక్షీ వాటిని అన్నింటిని వీడియోలో చూపిస్తుంది. మమ్మీ నేను తర్వాత కాల్ చేస్తానులే అని కట్ చేస్తాడు. అది చూసి అపర్ణ మరింత రగిలిపోతుంది. చేపల కూర వేసి తినమని కనకం అంటుంది. వద్దు నాకు ఫిష్ తినడం రాదని ముళ్ళు గొంతుల్లో ఇరుక్కుపోతాయని భయపడతాడు. నేను తీస్తా ముళ్ళు నేను తీస్తా అని కనకం వాళ్ళు గొడవ చేసేసరికి ఆపండి నేనే నా ముళ్ళు తీసుకుంటానని చేప తింటాడు.


గొంతులో ముల్లు ఇరుక్కునేసరికి మల్లగుల్లాలు పడతాడు. అందరూ టెన్షన్ గా హడావుడి చేస్తుంటే కావ్య అన్నం ముద్ద మింగమని చెప్తుంది. స్వప్న రాహుల్ కి పదే పదే ఫోన్ చేస్తుంది. దీంతో లిఫ్ట్ చేసి చిరాకు పడతాడు. మీ ఇంటి దగ్గరకి వచ్చానని చెప్పేసరికి రాహుల్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది.