విక్రమ్ రాసిన లవ్ లెటర్ చూసుకుంటూ తెగ మురిసిపోతుంది. ఎంత బాగా రాశావో ఎదురుగా ఉంటే తియ్యటి గిఫ్ట్ ఇచ్చేదాన్ని అని అనుకుంటూ ఉండగా సరస్వతి వచ్చి పలకరిస్తుంది. ప్రేమగా హగ్ చేసుకుని తర్వాత బుంగమూతి పెడుతుంది. మనవరాలి పెళ్లి అంటే నెల రోజుల ముందు రావాల్సింది పోయి ఇప్పుడు తిప్పుకుంటూ వస్తావా అని అలుగుతుంది. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. నందు దగ్గరకి తులసి వెళ్తుంది. తను రాగానే సంతోషంగా ఉందా అని అడుగుతాడు. మీ ఇగోని పక్కన పెట్టి నా సంతోషం కోసం ఆలోచించారా అని తులసి ఆశ్చర్యపోతుంది. అమ్మ ఈ ఇంటికి వస్తుందని నమ్మకం వదిలేసుకున్నా, ఆశ కూడా పెట్టుకోలేదు. నేను ఎంతో బతిమాలాను కానీ వినలేదు నువ్వు ఇలా బతిమలాడితే ఇష్టం లేకపోయినా వచ్చి ఉంటానని అన్నది. కానీ ఈరోజు అమ్మ ఇంటికి వచ్చింది. మీ రుణం తీర్చుకోలేను, అమ్మ మనసు మార్చేందుకు ఏం చెప్పారని తులసి అడుగుతుంది.


Also Read: స్వప్నకి ఘోరమైన అవమానం, మళ్ళీ రోడ్డున పడ్డ బతుకు- రాజ్ తిక్క కుదురుస్తున్న అప్పు


నందగోపాల్ అనే వ్యక్తి మీ జీవితంలోకి రాలేదని అనుకోమని చెప్పాను నీకు కూడా అదే చెప్తున్నా అంటాడు. ఇక తెల్లారగానే ఇంట్లో పెళ్లి పనులు స్టార్ట్ అయిపోతాయి. అందరూ తలా ఒక పని చేస్తూ హడావుడి చేస్తారు. ఇల్లంతా మామిడి తోరణాలతో పూలతో అందంగా ముస్తాబు చేస్తారు. పసుపు దంచే కార్యక్రమం మొదలు పెడతారు. పెళ్లి నిర్విగ్నంగా జరగాలని కోరుకుంటూ పసుపు దంచమని అంటారు. అత్త లేని కోడలు ఉత్తమురాలు అని తులసి బ్యాచ్ పాడితే పెళ్ళాం లేని వాడు ఉత్తముడు అని నందు బ్యాచ్ పాడుతుంది. నందు పెళ్లి పనులు చేస్తుంటే దివ్య అది చూసి బాధపడుతుంది. నేను కోరుకున్నప్పుడు నాన్న ఇలా లేరు. నాన్నని వదిలి వెళ్లాలని అనిపించడం లేదు ఆయన భుజం మీద తల పెట్టి నిద్రపోవాలని అనిపిస్తుందని దివ్య బాధపడుతుంది. దొరికిన వాటితో సంతోషపడాలని తులసి కూతురికి నచ్చజెపుతుంది.


Also Read: యష్ చెంప పగలగొట్టిన వేద- మాళవిక గొంతు నులిమేసిన అభిమన్యు


నందు పెళ్లి అక్షింతలు తయారు చేస్తూ ఉంటాడు. తులసి, దివ్య కన్నీళ్ళు పెట్టుకోవడం చూసి ఏమైందని సైగ చేస్తాడు. తులసి ఇంట్లో అందరికీ ఒక్కొక పని పురామాయిస్తుంది. ప్రేమ్ అప్పుడే పెళ్లి కార్డ్స్ తీసుకుని వస్తాడు. ముందు నేనే చూస్తానని అందరూ అల్లరి చేస్తారు. తులసి కార్డ్ చూసిన తర్వాత అందరూ చూస్తారు. కార్డ్ చాలా బాగుందని అంటారు. ఇంట్లో పెళ్లి సందడి కనిపించడం లేదు ఏంటని రాజ్యలక్ష్మిని విక్రమ్ తాతయ్య అడుగుతాడు. తమ్ముడి పెళ్లి ఘనంగా జరగనప్పుడు వాడి పెళ్లి ఘనంగా జరిగితే బాధపడతాడని సింపుల్ గా చేసుకుంటున్నాడని రాజ్యలక్ష్మి అంటుంది. కానీ ఇది వాడి మీద ప్రేమ కాదు సంజయ్ పెళ్లి ఘనంగా చేయలేకపోయావని ఇప్పుడు విక్రమ్ పెళ్లి సరిగా చేయడం లేదని తిట్టేసి వెళ్ళిపోతాడు.