యష్ ని అభిమన్యు కావాలని రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. నా మీద ప్రొఫెషనల్ గా గెలిచినా నీకు కిక్కు ఉండదు. ఆల్రెడీ నా ముందు బొక్క బోర్లా పడిపోయావ్. ఇప్పుడు నీ బాధకి కారణం నేను మాత్రం కాదు అప్పుడు మాళవిక ఇప్పుడు వేద. అప్పుడు అభిమన్యు ఇప్పుడు వివిన్. కేవలం నిమిత్త మాత్రులమే. నిన్ను చూస్తుంటే జాలికే జాలి వేస్తుందని మంట పెట్టి వెళ్ళిపోతాడు. ఆ మాటలకు యష్ చాలా బాధపడతాడు. వేద హాస్పిటల్ కి వస్తుంది. యష్ మాటలనే గుర్తు చేసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. వెనుకాలే విన్నీ కూడా వస్తాడు. వేదకి  ఒకామే ఫోన్ చేసి బాబుకి తగ్గిపోయిందని హాస్పిటల్ కి రావడం లేదని చెప్పేసరికి చాలా కొప్పడుతుంది. ఎప్పుడు కూల్ గా మాట్లాడే మీరు ఏంటి ఇంత కోపంగా మాట్లాడుతున్నారని ఆమె అడిగేసరికి నాకు ఫిలింగ్స్ ఉండవా అని ఫోన్ పెట్టేస్తుంది.


Also Read: మనోహర్ దెబ్బకి రామ, జానకి విలవిల- రోడ్డున పడ్డ జ్ఞానంబ పరువు


ఎందుకు వేదూ సడెన్ గా ఇంత ఇరిటేట్ అవుతున్నావ్ అని విన్నీ అడుగుతాడు. ఆయన్ని నేను చాలా మిస్ అవుతున్నా. ఆయన విషయంలో నాకు సెల్ఫీష్ పెరిగిపోతుంది. ఆయన సంతోషంలో బాధలో నేనే ఉండాలనే స్వార్థం పెరిగిపోతుంది. అందుకే నేను ఇరిటేట్ అవుతున్నానేమోనని బాధపడుతుంది. ఎక్కడ చూసినా యష్ పేరే వినిపిస్తుంది గ్రేట్ కదా అని మాళవిక అనేసరికి అభిమన్యు కోపంగా తన చెంప పగలగొట్టి పీక పిసికేస్తాడు. ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని గెలవడం కూడా ఒక గెలుపెనా. వేద, విన్నీతో ఎఫైర్ పెట్టుకుంది రేపో మాపో వాడితో వెళ్ళిపోతుంది. వాడు నా శత్రువు నా ముందు ఎప్పుడు వాడి గురించి గొప్పగా మాట్లాడకని అభి కోపంగా చెప్తాడు. పప్పుముద్దలా ఉండే వేద లైఫ్ లో కూడా ఒక లవర్ ఉన్నాడా ఇదేదో బాగుందే అని మాళవిక మరో కుట్ర వేస్తుంది. యష్ తాగుతూ ఉంటే వసంత్ వచ్చి ఏమైంది నీకు చంపేసిన ఆ మాళవిక గుర్తుకు వచ్చింది కానీ పునర్జన్మ ఇచ్చిన వేద వదిన గుర్తుకు రాలేదా? అని నిలదీస్తాడు.


వసంత్: ఆ చందమామలో అయినా మచ్చ ఉండవచ్చు కానీ వేద వదిన లో ఏ మచ్చ లేదు ఈ విషయం నీకు త్వరలోనే అర్థం అవుతుంది. నీకు నువ్వు పరీక్షించుకో అనేసి వెళ్ళిపోతాడు.


యష్: ఈరోజు చాలా తప్పు చేశావ్ మాళవిక నీ మనసు ముక్కలు చేసిందని వేద మనసు ముక్కలు చేస్తావా? నా సంతోషం అన్నీ తన వల్లే కదా ఇప్పుడు ఒకవేళ నాకు దూరం అవాలని వేద డిసైడ్ అయితే ఆ తప్పు వేదది కాదు నాది తనని టార్చర్ చేస్తుంది నేనే కదా. ఏ రిలేషన్ షిప్ లో అయినా ఇచ్చి పుచ్చుకోవాలి కదా. సంతోషం నేను తీసుకుని బాధని తనకి ఇస్తున్నా. వెలుగులో నేను చీకట్లో తను. ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను తను నాకోసం ఎంతో ప్రేమగా బ్రేస్ లేట్ కొనిస్తే దాన్ని పడేశాను కదా తప్పు అది నా చేతికే ఉండాలని అంతా వెతుక్కుతాడు. బ్రేస్ కనిపించగానే దాన్ని అందుకుని సంతోషపడతాడు. వేదతో జీవితాన్ని ఇక పోగొట్టుకొను నా గుండెల్లో దాచుకుంటాను. ఐలవ్యూ వేద


Also Read: తులసి తల్లి కాళ్ళ మీద పడిన నందు- దివ్యకి విక్రమ్ లవ్ లెటర్, ఆటాడేసుకున్న ప్రేమ్


రత్నం యష్ ని తిడతాడు. మాలిని, రత్నం కాసేపు వేద, యష్ గురించి బాధపడతారు. వాడితో వేదకి క్షమాపణ చెప్పిస్తానని అంటాడు. విన్నీ వేదని డ్రాప్ చేసినప్పుడే యష్ కూడా ఇంటికి వస్తాడు. వేద విన్నీతో నవ్వుతూ మాట్లాడటం చూసి తప్పుగా అర్థం చేసుకుంటాడు.