విక్రమ్ దివ్యకి కొరియర్ పంపించానని ఫోన్ చేసి చెప్తాడు. దేవుడా అది ఇంట్లో వాళ్ళకి చిక్కితే ఇంకేమైనా ఉందా అని దివ్య టెన్షన్ పడుతుంది. నందు తులసి తల్లి సరస్వతి ఇంటికి వస్తాడు. గతంలో నువ్వు ఈ ఇంటికి అల్లుడు హోదాలో వచ్చాడని కానీ ఇప్పుడు తన ఇంటికి వచ్చే పాలవాడితో సమానమని అవమానిస్తుంది.
నందు: నా మీద కోపంతో తులసి వాళ్ళకి దూరంగా ఉండొద్దు
సరస్వతి: కొన్ని రోజుల క్రితం నీ ఆఫీసుకి వచ్చి నా కూతురికి అన్యాయం చేయవద్దని ప్రాధేయ పడ్డాను కానీ నువ్వు అప్పుడు ఏమన్నావ్ పరిస్థితులను బట్టి నడవాలని అన్నావ్ ఇప్పుడు కూడా అదే కదా
Also Read: అపర్ణకి కండిషన్ పెట్టిన శుభాష్- స్నేహితురాలి ఇంటికి చేరిన స్వప్న, కావ్య ఇంట్లో రాజ్ తిప్పలు
నందు: అప్పటి నా ప్రవర్తన తప్పు తులసి విషయంలో అలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదు కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నా చేయాలని ఉన్నా నేను చేయలేకపోతున్న పని ఏంటో తెలుసా తులసి కాళ్ళ మీద పడి క్షమించమని అడగటం ఇప్పుడు నేను చేసేది ఒకటే చేసిన పనికి మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగటం. ఒకప్పుడు నేను తులసిని బాధపెట్టాను కనీసం ఇప్పుడైనా తను సంతోషంగా ఉండాలని ఆరాటపడుతున్నా మీరు నాకు ఆ అవకాశం ఇవ్వడం లేదు కూతురు పెళ్లి అని తులసి మొహంలో సంతోషం కనపడుతుంది కానీ మీరు లేరని మనసులో బాధపడుతుంది. మీరు ఆ బాధని దూరం చేయండి ఇంకెప్పుడు మీరు బాధపడేలా ప్రవర్తించను దయచేసి బయల్దేరండి. మంచి భర్తని, తండ్రిని కాలేకపోయాను.
సరస్వతి: నీ మీద కోపం తప్ప శతృత్వం లేదు ఇప్పుడు నేను ఎంత ఆరాటపడ్డా కూతురి జీవితాన్ని బాగు చేయలేను కానీ తను సంతోషంగా ఉంచేలా చేయగలను తులసి దగ్గరకి వెళ్దాం
దివ్య విక్రమ్ పంపించిన కొరియర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉండగా దివ్య అటూ ఇటూ టెన్షన్ గా తిరగడం ప్రేమ్ చూసి కాసేపు తనని ఆట పట్టిస్తాడు. కొరియర్ రాగానే ఎవరికి కనిపించకుండా లోపలికి తీసుకుని వెళ్లిపోవాలని దివ్య అనుకుంటూ ఉండగా అప్పుడే కొరియర్ వస్తుంది. అది తీసుకుని లోపలికి వెళ్దామని అనుకునే లోపు ప్రేమ్ ఎదురుగా నిలబడి దాని వైపు చూస్తూ ఉంటాడు. హాస్పిటల్ నుంచి వచ్చిందని అబద్ధం చెప్తుంది కానీ ప్రేమ్ ఆ కొరియర్ లాగేసుకుని వామ్మో అబద్ధాలు చెప్పేస్తుందని దాని మీద పేరు చూసి నీ అల్లుడు దగ్గర నుంచి వచ్చిందని తులసితో చెప్తాడు. చదివిన తర్వాత ఇస్తానని కాసేపు ఆట పట్టిస్తాడు.
Also Read: తన విజయానికి కారణం మాళవిక అన్న యష్- గుండె పగిలేలా ఏడ్చిన వేద
దివ్య ప్రేమ్ ఆ లెటర్ చదువుతున్నాడని బుంగమూతి పెడుతుంది. దేవుడు నువ్వు నాకు ఇచ్చిన వరం, నువ్వు ఆకాశంలో నక్షత్రం. నేనేమో మట్టి రేణువు. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటో అంతా కలలాగా ఉందని తెగ రాసేస్తాడు. అది విని అందరూ నవ్వుకుంటారు. నందు తులసి తల్లిని తమ్ముడిని ఇంటికి తీసుకుని వస్తాడు. తల్లిని చూసి తులసి ఎమోషనల్ అవుతుంది. దివ్య వాళ్ళ నాన్న వచ్చి పిలిస్తే వచ్చానని సరస్వతి చెప్తుంది. పిలవడమే కాదు దగ్గరుండి మరీ తీసుకొచ్చారని దీపక్ భార్య అంటుంది. కూతురి పెళ్లి అడ్డం పెట్టుకుని బంధాలు కలుపుకుంటున్నారన్న మాట. ఈ పెళ్లితో దివ్య జీవితం నాశనం అవబోతోందని లాస్య మనసులో సంతోషపడుతుంది.