Stocks to watch today, 11 April 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 25 పాయింట్లు లేదా 0.14 శాతం గ్రీన్‌ కలర్‌లో 17,710 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


బ్యాంక్ ఆఫ్ బరోడా: ప్రభుత్వ రంగ రుణదాత బ్యాంక్ ఆఫ్ బరోడా, 2023 మార్చి త్రైమాసికంలో, అడ్వాన్స్‌ల వృద్ధిలో ఆరోగ్యకరమైన నంబర్లను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 19% వృద్ధిని ఇప్పుడు చూపుతోంది.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: పబ్లిక్ ఆఫర్‌తో లేదా సీనియర్ అన్‌సెక్యూర్డ్ నోట్ల ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతలలో $2 బిలియన్ల వరకు దీర్ఘకాల నిధుల సేకరణ కోసం యోచిస్తోంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి బ్యాంక్ బోర్డు ఏప్రిల్ 18న సమావేశం అవుతుంది.


శిల్పా మెడికేర్: యాక్టివ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్న వయోజన రోగుల ‍‌(adult patients) చికిత్స కోసం ఉపయోగించే ANDA, Apremilast టాబ్లెట్‌లకు USFDA నుంచి ఆమోదం పొందింది.


IRB ఇన్‌ఫ్రా డెవలపర్స్‌: మార్చి నెలలో టోల్ వసూళ్లు 21% పెరిగి రూ. 3,699 కోట్లకు చేరినట్లు ఈ కంపెనీ నివేదించింది.


వేదాంత: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన NCDs జారీ ప్రతిపాదనను పరిశీలించడానికి ఏప్రిల్ 13న కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం కాబోతోంది.


JSW స్టీల్: FY23 నాలుగో త్రైమాసికంలో, ఏకీకృత ముడి ఉక్కు ఉత్పత్తిలో 13% వృద్ధితో 6.58 మిలియన్ టన్నులను (MT) JSW స్టీల్ సాధించింది.


కల్పతరు పవర్ ట్రాన్స్‌మిషన్: కల్పతరు పవర్ ట్రాన్స్‌మిషన్, దీని అంతర్జాతీయ అనుబంధ సంస్థలు మార్చి & ఏప్రిల్‌ నెలలో ఇప్పటి వరకు రూ. 3,079 కోట్ల విలువైన కొత్త ఆర్డర్‌లు దక్కించుకున్నాయి.


సిప్లా: 2026 జనవరి 1 నుంచి టైప్ 2 డయాబెటిస్ చికిత్సలో ఉపయోగించే గాల్వస్, గాల్వస్ కాంబినేషన్ బ్రాండ్‌లను తయారు చేయడానికి, మార్కెట్ చేయడానికి నోవార్టిస్ ఫార్మా AGతో శాశ్వత లైసెన్స్ ఒప్పందాన్ని సిప్లా కుదుర్చుకుంది. సోమవారం (ఏప్రిల్ 10) ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.


జైడస్ లైఫ్ సైన్సెస్: అజిత్రోమైసిన్ టాబ్లెట్‌లను తయారు చేయడానికి, మార్కెట్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) నుంచి ఈ ఫార్మా కంపెనీకి తుది ఆమోదం లభించింది.


బజాజ్ ఆటో: ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్‌ ఇండియా సేల్స్, మార్కెటింగ్ కార్యకలాపాలు మొత్తం బజాజ్ ఆటోకు బదిలీ చేసే ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.