మేష రాశి
పని ఒత్తిడి చికాకు కలిగిస్తుంది. అయినా మీరు ఉత్సాహంగానే ఉంటారు. ఇది వరకు మీ దగ్గర అప్పు తీసుకుని చెల్లించని మిత్రులను అవాయిడ్ చెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనశాంతిని ఇస్తాయి. ప్రియతములతో మాట్లాడే సమయంలో జాగ్రత్త మీ మాటలు వారి మనసు నొప్పించవచ్చు. ఆఫీసులో ప్రశంశలు అందుతాయి. జీవిత భాగస్వామి మీతో కాస్త కినుకగా ప్రవర్తించవచ్చు.
వృషభ రాశి
జీవితాన్ని మరీ సీరియస్ గా తీసుకోవద్దు. షేర్స్ లో లాభాలు రావచ్చు. అధ్యాత్మిక కార్యక్రమాలు, యోగ సాధన మనఃశాంతిని ఇస్తుంది. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకునేందుకు అనువైన రోజు. దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. మొత్తానికి రోజు సంతోషంగా గడుస్తుంది.
మిథున రాశి
ఈరోజు కాస్త విశాలంగా ఆలోచిస్తే మంచిది. ఎవరితోనూ గొడవపడొద్దు. ఈ గొడవ మీ అనుబంధాన్ని శాశ్వతంగా తెగ్గొట్టొచ్చు. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోవచ్చు. ప్రియతములతో ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో చికాకుగా ప్రవర్తిస్తారు.
కర్కాటక రాశి
అనారోగ్యంతో ఉండి ఉంటే ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది. రుణ ప్రయత్నం చేస్తున్న వారికి రుణం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఈ రోజు చేస్తున్న పని మీకు భవిష్యత్తులో మంచి లాభాన్ని తెచ్చిపెడుతుంది. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
సింహరాశి
ఆధ్యాత్మిక గురువు ఆశిస్సులు లభిస్తాయి. ప్రశాంతంగా గడుపుతారు. సంపాదన పెంచుకునే మార్గాలు అన్వేషించండి. పిల్లలతో కొంత సమయం గడపడం అవసరం. సన్నిహితులతో అభిప్రాయ బేధాలను తొలగించుకుంటారు. ఉద్యోగులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ట్రేడింగ్ సాధారణ ఫలితాలను ఇస్తాయి. ఇతరుల సలహా పాటిస్తే లాభాలు పొందవచ్చు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
కన్యా రాశి
వాదనలు పెట్టుకోకండి. మూడ్ పాడైపోవచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. మీ పట్ల శ్రద్ధ చూపే వ్యక్తులతో కొంత సమయం గడపడం మంచిది. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. విలువలతో కూడిన మీ ఆలోచనా ధోరణి మీ విజయానికి కారణం అవుతుంది. ఆధ్యాత్మికంగా తృప్తిగా బతికేందుకు దారులు వెతకాలి. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
తులారాశి
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక లాభాలున్నాయి. ఇంట్లో రిపేరు పనులు రావచ్చు. ప్రియమైన వారితో టూర్ లో ఉన్నవారికి మధుర జ్ఞాపకాలు మిగులుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. కానీ భాగస్వాముల మద్య విబేధాలు రావచ్చు. ప్రకృతిలో గడపడానికి ఇష్ట పడతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మొత్తానికి ఈ రోజు ఆనందంగా గడుస్తుందనే చెప్పవచ్చు.
వృశ్చిక రాశి
అనేక మార్గాల్లో ఆర్థిక లాభం ఉండొచ్చు. పిల్లల విజయం మీకు గర్వాన్ని కలిగిస్తుంది. ప్రియమైన వారి నుంచి బహుమతులు అందుకుంటారు. ఈరోజు కొంత ఖాళీ సమయం దొరకవచ్చు. కానీ మీరు పనుల్లోనే ఆ సమయాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. జీవిత భాగస్వామితో చిన్న తగాదాలు వచ్చినప్పటికీ సర్దుకుంటాయి.
ధనస్సు రాశి
మానసికంగా చాలా బలంగా, పరిణతితో వ్యవహరిస్తారు. ఇది ఇలాగే కొనసాగిస్తే అన్నింటా విజయం మీదే. పెట్టుబడులు పెట్టే ముందు మరోసారి ఆలోచించి పెట్టండి. భవిష్యత్తులో మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. ఇంట్లోని టెన్షన్లు దూరం అవుతాయి. వ్యాపారరీత్యా చేసే ప్రయాణం దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తుంది. అకస్మాత్తుగా అతిథుల రాకతో వేసుకున్న ప్రణాళికలు తలకిందులవుతాయి. అయినా సరే ఈ రోజు ఆనందంగా గడుస్తుంది.
మకర రాశి
ఇవ్వాళ తీసుకునే భోజనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. నూనెపదార్థలు, మసాల వంటకాలకు దూరంగా ఉండండి. స్పెక్యూలేషన్లు లాభాల్లో ఉంటాయి. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. మీరు కూడా పాలుపంచుకోవడం మంచిది. అనుకున్న ఫలితాలు రాలేదని నిరాశ పడొద్దు. జీవిత భాగస్వామితో ప్రేమగా సమయం గడుపుతారు.
కుంభ రాశి
విశ్రాంతిగా గడిపే రోజు. వినోదం, ఆట విడుపు మధ్య సమయం గడుస్తుంది. ఆర్థిక స్థితి పెద్ద అనుకూలంగా లేదనే చెప్పాలి. మీరు బాగా నమ్మిన వ్యక్తి మీరు నలుగురిలో తలదించుకునేలా చేస్తారు. మీ ప్రేమను అప్ డేటెడ్ గా ఫెట్టుకోవడం అవసరం. మీ శక్తిని మీ కెరియర్ బావుండేందుకు వాడాలి. పనిలో గొప్ప విజయం సాధించగలరు.
మీన రాశి
చిన్న నాటి అనుభూతులు మదిలో మెదిలి ఆనందంగా ఉంటారు. ఇంటి కోసం డబ్బుదాచటం మంచిది. కుటుంబం కోసం కష్టపడతారు. ఇవ్వాళ ఒక ప్రత్యేక వ్యక్తిని కలుసుకుంటారు. మంచి భాగస్వామ్య అవకాశాలు ఎదురవుతాయి. కానీ తొందర వద్దు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.