వేద పెట్టిన గిఫ్ట్ కి ఎమోషనల్ వాల్యు ఏమి లేదని అనేసరికి బాధపడుతుంది. అలా అనేశారు ఏంటి అంటే ఏముందిలే మా ఆయనేగా అని సర్ది చెప్పుకుంటుంది. మాళవిక వేద దగ్గరకి వచ్చి రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.
మాళవిక: ఇద్దరి మధ్య ఏదో చాలా పెద్ద గ్యాప్ వచ్చినట్టు ఉంది
వేద: మేము దిక్కులు ఎన్ని చూసినా నా దిక్కు ఆయనే, ఆయన దిక్కు నేనే. మేము ఎప్పుడు కలిసే బతుకుతాము
మాళవిక: పేరుకే నువ్వు యశోధర్ భార్యవి కాపురానికి కాదు. నేను వదిలేసిన మొగుడికి సెకండ్హ్యాండ్ వైఫ్ వి నువ్వు, సెకండ్ హ్యాండ్ లైఫ్ నీది
వేద: ఒకరు వదిలేస్తే దక్కిన అదృష్టం కాదు. ఆయనకి నాకు ఉంది మధ్య ఉట్టి బంధం కాదు ఆయనకి నాకు రాసిపెట్టి ఉంది. నా భర్త ఎప్పుడు గర్వపడే స్థానంలో ఉంటారు కుళ్ళుకునే స్థానంలో ఉండరు అయినా పిలవని పేరంటానికి వచ్చావా
Also Read: అర్థరాత్రి దివ్య గదికి విక్రమ్- మళ్ళీ ప్రేమ్ జంట ఎంట్రీ, తులసి తల్లి కాళ్ళ మీద పడ్డ నందు
మాళవిక: యశోధర్ పిలిస్తే వచ్చాను. మనసులు కలిస్తే సరిపోదు శరీరాలు కలవని పెళ్లి ఎప్పటికైనా పెటాకులు కాక తప్పదు
ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. యశ వ్యాపార రంగంలో రాణిస్తూ పెద్ద అవార్డు గెలుచుకున్నారని మెచ్చుకుంటారు. యష్ మాట్లాడుతూ కలలు ఎప్పుడు నిజం కావు వాటిని నాశనం చేయడానికి మన పక్కన ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటారు. లైఫ్ ఎప్పుడు ఉజ్వలంగా ఉండరు. ఎప్పుడు డార్క్ గానే ఉంటుందనిన్ చాలా బాధగా మాట్లాడతాడు. యష్ ఎందుకు అలా మాట్లాడుతున్నాడో అర్థం కాక అందరి మొహాలు మాడిపోతాయి. ప్రతి మగాడి విజయం ఉంటుందని అంటారు నా విషయంలో కూడా అలాగే జరిగింది ఈ క్రెడిట్ మొత్తం నా భార్యకి సోరి నా మాజీ భార్య మాళవికకి అని అనగానే వేద గుండె ముక్కలవుతుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే తను నన్ను ద్వేషించి వెన్ను పోటు పొడిచి బాధని కలిగించిందని మాళవిక వెళ్ళిపోయిన సంఘటన గుర్తు చేసుకుంటాడు.
వెన్నుపోటు పొడవడం చూశాను బాధపడ్డాను ఒకసారి కాదు రెండు సార్లు అందరికీ తెలిసిన విషయమే. నాకు చేసింది అసలు చేయకపోయి ఉంటే నేను ఇక్కడి దాకా వచ్చేవాడిని కాదు. తను నాకు జీవితంలో పెద్ద పాఠం నేర్పించి శక్తిని అవకాశాన్ని ఇచ్చింది. నన్ను నేను నిరూపించుకోవడానికి నిజానిజాలు తెలుసుకోవడానికి ఇదంతా నీ వల్లే జరిగింది మాళవిక అనేసరికి వేద ఎదుస్తూనే ఉంటుంది. యష్ మాటలకు బాధగా తట్టుకోలేక వేద అక్కడ నుంచి ఏడుస్తూ వెళ్లిపోతుంటే విన్నీ వెనుకాలే వెళతాడు. అందరిలోనూ ఇన్సల్ట్ చేసి హర్ట్ చేశారని బాధగా వెళ్ళిపోతుంది. యష్ దగ్గరకి అభిమన్యు వచ్చి రెచ్చగొట్టేలా మాట్లాడతాడు.
Also Read: కావ్యకి పూలు కొనిచ్చిన రాజ్- ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న అపర్ణ
నీ ప్రెసిడెంట్ పోస్ట్ అచీవ్ మెంట్ కాదు నీ పెళ్ళానికి విన్నీతో ఉన్న ఎటాచ్ మెంట్ వల్ల వచ్చిందని అభి అనేసరికి యష్ కోపంగా వాడి కాలర్ పట్టుకుంటాడు. నీ కన్నా సీనియర్ ని పెద్ద పలుకుబడి నాది అయినా నువ్వు గెలిచావ్ కారణం ఏంటో తెలుసా ఢిల్లీలో నాకంటే వివిన్ కి కాస్త ఎక్కువ పలుకుబడి ఉంది తను నీకు గుడ్డిగా మద్దతు ఇవ్వబట్టి వచ్చింది. తను నీకు మద్దతు ఎందుకు ఇచ్చాడంటావ్ వివిన్ ఏమైనా నిన్ను వెతుక్కుంటూ వచ్చాడా లేకపోతే ఎఫైర్ ఉందా? నీ లైఫ్ ఇంతే యశోధర్ సంతోషం ఉండదు. అభి మాటలకు యష్ చాలా బాధపడతాడు.