దివ్య జీవితం నీ కళ్ళ ముందే నాశనం అవుతుంటే ఎలా ఉంటుందో చూస్తూ ఉండమని రాజ్యలక్ష్మి ప్రియతో చెప్తుంది. నన్ను హింస పెడుతున్నారు కదా దివ్యని వదిలేయండని ప్రియ బతిమలాడుతుంది. అయితే నువ్వు సంజయ్ కి నువ్వు విడాకులు ఇచ్చేయ్ దివ్యని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని అంటుంది. అప్పుడు నా జీవితం నాశనమవుతుంది కదా అంటే విక్రమ్ నా కొంగులో ఉన్నాడు ఎలాగైనా తనని వదిలేది లేదని మనసులో కుట్ర బయట పెడుతుంది. దివ్యకి నగలు వేసి అందంగా ముస్తాబు చేస్తుంది. అప్పుడే విక్రమ్ ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి వెంటనే కట్ చేస్తుంది. దీంతో విక్రమ్ దివ్య ఇంటికి వెళ్తే డైరెక్ట్ గా మర్యాదలు చేసి మాట్లాడుకోమని అంటారని వెళ్లాలని అనుకుంటాడు.


Also Read: కావ్యకి పూలు కొనిచ్చిన రాజ్- ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న అపర్ణ


నందు తులసి గదికి వచ్చి రావచ్చా అని అడుగుతాడు. నన్ను కాదు అడగాల్సింది లాస్యని, అయినా ఈ మధ్య తనలో మార్పు వచ్చింది అసూయ పడటం కనిపించలేదని అంటే నందు భార్యాని పాముతో పోల్చి తిడతాడు. నందు చీర తులసికి ఇచ్చి ఇడి నీకోసమే తీసుకున్నానని చెప్తాడు. ఎందుకు తీసుకున్నారని అంటే తీసుకోవాలని అనిపించింది అందుకే తీసుకున్నానని అంటాడు. కట్టుకున్న భార్యకి కాకుండా వేరే వాళ్ళకి చీర కొనివ్వడం మీకు అలవాటే కదా సెటైర్ వేస్తుంది. అందరి ముందు ఇవ్వకుండా ఇలా చాటుగా తీసుకొచ్చారెంటని ప్రశ్నిస్తుంది. నువ్వే ఇవ్వొద్దని చెప్పావ్ కదా అంటాడు. అది మన భార్యాభర్తలు ఉన్నప్పుడు చెప్పిన మాట.. కానీ ఇప్పుడు మనం జస్ట్ ఫ్రెండ్స్ అందరి ముందు ఏదైనా ఇవ్వండి ఇలా దొంగచాటుగా ఇవ్వొద్దని చెప్తుంది. తెలియకుండానే నాకు ఇష్టమైన కలర్ తెచ్చారని థాంక్స్ చెప్తుంది. తెలియకుండా కాదు తెలిసే తెచ్చానని నందు వెళ్ళిపోతాడు.


విక్రమ్ దివ్య ఇంటి గోడ దూకి మెల్లగా లోపలికి వెళతాడు. ఎవరూ చూడకుండా విక్రమ్ దివ్య గదికి వస్తాడు. అందరూ మంచి నిద్రలో ఉన్నారు దివ్యతో రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ ఉండవచ్చని అనుకుంటాడు. దివ్య నిద్రలేచి విక్రమ్ అని చూసుకోకుండా దొంగ దొంగ అని గట్టిగా అరిచేసారికి అందరూ వస్తారు. దివ్య అరుపుల దెబ్బకి విక్రమ్ మంచం కింద దూరిపోతాడు. విక్రమ్ మెల్లగా దివ్య కాలు గీరి వచ్చింది తనేనని సైగ చేస్తాడు. నిద్రలో పీడకల వచ్చినట్టు ఉంది ఎవరూ రాలేదని దివ్య కవర్ చేసేందుకు ట్రై చేస్తుంది. తులసి తోడుగా పడుకుంటానని చెప్తే వద్దని చెప్పి అందరినీ పంపించేస్తుంది. ఇంత రాత్రిపూట రావడం ఏంటి వాళ్ళు ఎవరైనా చూస్తే ఏంటని అంటుంది. తనని బలవంతంగా బయటకి తోసేయబోతుంటే ఏమైందని నందు వాళ్ళు తలుపు తీసుకుని లోపలికి వచ్చేస్తారు. విక్రమ్ మళ్ళీ అందరి ముందు దొరికిపోతాడు.


Also Read: కనురెప్పల కాలంలోనే కథ అంతా మారిపోయిందే- ఖుషిని దూరం చేసేందుకు అభిమన్యు కుట్ర


నీళ్ళు నములుతూ చూడాలని అనిపించిందని సిగ్గు పడుతూ చెప్తాడు. చాలా రోజుల తర్వాత ప్రేమ వాళ్ళు ఎంట్రీ ఇస్తారు. చిన్నన్నయ్య వాళ్ళు వచ్చారని వెళ్ళి సంతోషంగా వాళ్ళని కౌగలించుకుంటుంది. కాసేపటికి మాధవి వాళ్ళు కూడా వస్తారు.