అపర్ణ తనకి అవమానం జరిగిందని ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి బ్యాగ్ సర్దుకుని రావడం చూసి అందరూ షాక్ అవుతారు.


అపర్ణ: మీరంతా ఏకమై నా కొడుకు పెళ్లి జరిపించారు, మీరందరూ కలిసి వాడికి ఇష్టం లేకుండా శోభనం ఏర్పాటు చేశారు. ఇప్పుడు నా మాటని కాదని ఆ మాంత్రికుల గుహలోకి పంపించారు నాకు ఇష్టం లేని ప్రదేశం అది. అందరూ కలిసి నా కొడుకుని నా నుంచి విడదీస్తున్నారు.


సీతారామయ్య: నువ్వు అపార్థం చేసుకుంటున్నావ్ పెళ్లి నిర్ణయం వాడికే వదిలేశాము. శోభనం విషయంలో మేము వాడి నిర్ణయాన్ని గౌరవించాము. ఇప్పుడు కూడా రాజ్ తనంతట తానే కావ్యని తీసుకుని వెళ్తానని అన్నాడు. అందరం కలిసి వాడి అభిప్రాయం రుద్దలేదు కదా


ఇంద్రాదేవి: నీ కొడుకు వాడంతట వాడు పెళ్ళాం పుట్టింటికి వెళ్తే నీకు పుట్టింటికి వెళ్లాల్సిన అవమానం ఏం జరిగింది


Also Read: తన విజయానికి కారణం మాళవిక అన్న యష్- గుండె పగిలేలా ఏడ్చిన వేద


అపర్ణ: మీరిద్దరూ కురు వృద్ధుల్లాగా కూర్చుని వరాల మీద వరాలు ఇస్తుంటే ఇక ఇక్కడ నా ఇంట్లో విలువ ఏముంది


ఇంద్రాదేవి: నీ కొడుకు కోడలు మనసు గుర్తించకూడదా? వాడి మనసు మారకూడదా?


అపర్ణ: ఇష్టం లేని పెళ్లి జరిపించి ఇష్టం లేని కాపురం చేయమని చెప్తున్నారు. మీరందరూ కలిసి వాడికి నన్ను దూరం చేశారు అందుకే వాడు కూడా నా మాట వినకుండా నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. కోడలిగా, భార్యగా, తల్లిగా అణగదొక్కారు. నా మాటకి విలువ లేని ఇంట్లో నేను ఉండలేను


శుభాష్: కోపం ప్రదర్శించు నీకు ఆ హక్కు ఉంది. కానీ అత్తగారింటి గడప దాటి వెళ్తే మళ్ళీ జీవితంలో ఈ ఇంటి గడప తొక్కలేవు. నీ కొడుకు ఇష్టం లేని పెళ్ళికి ఒప్పుకుని ఈ వంశ గౌరవం పెంచాడు. నువ్వు ఆవేశంలో నిర్ణయం తీసుకుని ఈ ఇంటి పరువు తీయాలని అనుకుంటున్నావ్ ఏది సరైనదో నువ్వే నిర్ణయించుకో


అపర్ణ: నన్ను గడప దాటకుండా ఈ వంశ గౌరవం ఆపింది. కానీ నేను ఇష్టపడని కోడలితో ప్రవర్తించే తీరు మారదు. అప్పుడు నన్ను ఏ శక్తి ఆపలేదని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అదంతా చూసి రుద్రాణి మనసులో తెగ సంతోషపడుతుంది. రాజ్ కావ్య ఇంట్లో స్వప్న కోసం అన్నీ గదులు వెతుకుతూ ఉంటాడు. స్వప్నని ఏ ట్రంకు పెట్టెలో కుక్కారు, ఏ అటక మీద పెట్టారని చూస్తూ ఉంటాడు. అప్పుడే స్వప్న ఇంటి గుమ్మం ముందర నిలబడి డోర్ కొడుతుంది. అయితే స్వప్న డోర్ కొట్టింది తన ఇంటిది కాదు తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది.


Also Read: అర్థరాత్రి దివ్య గదికి విక్రమ్- మళ్ళీ ప్రేమ్ జంట ఎంట్రీ, తులసి తల్లి కాళ్ళ మీద పడ్డ నందు


రాజ్ డోర్ తీయగానే ఒక వ్యక్తి చేప పట్టుకుని బావగారు అని మీద పడిపోతాడు. నా పేరు రాములు ఆటో మనదేనని రాజ్ చేయి పట్టుకుని ఊపేస్తాడు. రాజ్ తన చెయ్యి వాసన చూసుకుని వాక్ అంటాడు. అక్కడ రాజ్ తిప్పలు చూడాలి భలే ఫన్నీగా ఉంటుంది. వెంటనే కనకం వచ్చి ఈ చేపల కంపుతో అల్లుడిని పట్టుకుంటావ్ ఏంటని తిడుతుంది. కాసేపు కావ్య రాజ్ ని ఆట పట్టిస్తుంది. స్వప్న కోసం రాజ్ ఇంటి మేడ మీద కూడా వెతుకుతాడు. నీ చెల్లి మమ్మల్ని ఎలా మోసం చేసిందో నీ నోటితో చెప్పించి తనని వదిలించుకుంటానని మనసులో అనుకుని గదికి వస్తాడు.


కావ్య: దొరికిందా సమాధానం. ఒక భ్రమలో ఉండి కలను వెతుకుతున్నారు. కనుమరుగైపోయిన మా అక్కని వెతుకుతున్నారు


రాజ్: నీకు ఎలా తెలుసు


కావ్య: కానీ మీరు నాతో ఎందుకు వచ్చారో సమాధానం దొరికింది. నేను అడగాకుండానే పుట్టింటికి తీసుకొచ్చారంటే నేను ఎలా నమ్ముతాను


రాజ్: నేను నీకోసం రాలేదు స్వప్నని ఇక్కడ దాచావని నమ్మకంతో వచ్చాను. కానీ రాగానే నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటావ్. నువ్వే తనని దాచి పెట్టి ఉంటావ్


ఇద్దరూ కాసేపు స్వప్న గురించి వాదించుకుంటారు. రాజ్ కోపంగా వెళ్లిపోతుంటే కావ్య అడ్డుపడుతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోదామని డోర్ తీసేసరికి మీనాక్షి పెద్దమ్మ ఎదురుగా ఉండి మళ్ళీ కాసేపు సోది పెడుతుంది.