PM Modi 72nd Birthday: 


నమీబియా నుంచి స్పెషల్‌ ఫ్లైట్‌లో వచ్చిన 8 చీతాలను ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా కునో నేషనల్ పార్క్‌లోకి వదిలారు. చీతాలను వదిలాక కెమెరాతో స్వయంగా ఆయనే చీతాలను ఫోటోలు తీశారు.





స్పెషల్ ప్లేన్‌లో వచ్చిన చీతాలను ప్రత్యేకంగా తయారు చేసిన క్వారంటైన్ ఎన్‌క్లోజర్స్‌లో ఉంచనున్నారు. రెండు మగ చీతాలను ఈ ఎన్‌క్లోజర్‌లో ఉంచుతారు. ఆడ చీతాని పక్కనే మరో ఎన్‌క్లోజర్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం 8 చీతాల కోసం ఆరు పెద్ద ఎన్‌క్లోజర్‌లు అరేంజ్ చేశారు. "Action Plan for Introduction of Cheetah in India"లో భాగంగా...కేంద్రం ఈ చీతాలను దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడికి రప్పించింది. ఇప్పటికే వీటికి వ్యాక్సిన్‌లు వేశారు. వాటికి సాటిలైట్ కాలర్‌లు కూడా అమర్చారు. ఇండియాలో చీతాల గాండ్రింపులు మరోసారి వినపడాలన్న లక్ష్యంతో...ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది కేంద్రం. అయితే...ఇదేమంత సులువుగా అయిపోలేదు. దాదాపు 50 ఏళ్ల సంప్రదింపుల తరవాత ఈ కల సాకారమైంది. 


1952లో భారత్..ఈ చీతాలను అంతరించిపోయే జంతువుల జాబితాలో చేర్చింది. వీటి సంఖ్య పెంచేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నా... ఆశించిన స్థాయిలో అయితే పెరగటం లేదు. కానీ..భారత్ మాత్రం తమ ప్రయత్నాల్ని ఆపటం లేదు. ఇందులో భాగంగానే...
ఆఫ్రికా నుంచి చీతాలను మధ్యప్రదేశ్‌కు (Madhya Pradesh)తీసుకొచ్చారు. కునో-పల్‌పూర్ (Kuno-Plpur) ఫారెస్ట్‌లో ఈ చీతాలను ప్రధాని మోదీ వదిలారు. దాదాపు 5 దశాబ్దాలుగా ఈ చీతాను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికి ఆ కల నెరవేరనుంది. అధికారికంగా ఈ చింటు చీతాలు మధ్యప్రదేశ్‌లోని ఫారెస్ట్‌లో అడుగు పెట్టాయి. ఇది జరగటానికి ముందు ఎన్నో సవాళ్లు దాటుకోవాల్సి వచ్చింది. 


1. 1952లో భారత్‌లో తొలిసారి వైల్డ్‌లైఫ్‌ బోర్డ్ మీటింగ్ (Wildlife Board Meeting) జరిగింది. చిరుతల సంఖ్య దారుణంగా పడిపోయిందని గుర్తించింది అప్పుడే. వెంటనే భారత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 


2. 1972లో అప్పటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ..ఇరాన్ ప్రభుత్వంతో చర్చలు మొదలు పెట్టారు. ఆసియా చీతాలను భారత్‌కు రప్పించి అందుకు బదులుగా ఆసియా సింహాలను ఇచ్చేలా సంప్రదింపులు జరిగాయి. ఆ తరవాత కొన్ని రోజుల పాటు చర్చలు ఆగిపోయాయి. 


3.  2009లో చర్చలు పున:ప్రారంభమయ్యాయి. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇందుకు చొరవ చూపించారు. కానీ...ఎందుకో ఆ ప్రయత్నం ఫలించలేదు. 


4. ఇప్పుడు నరేంద్ర మోదీ హయాంలో మొత్తానికి  ఈ ప్లాన్ సక్సెస్ అయింది. 


కునో పల్‌పూర్ నేషనల్ పార్క్..


ఈ పార్క్‌లో చీతాలకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇక్కడి సగటు ఉష్ణోగ్రతలు 42.3 డిగ్రీ సెల్సియస్. శీతాకాలంలో 6-7డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ప్రస్తుతానికి ఈ నేషనల్ పార్క్‌లో 21 చీతాలు మనుగడ సాగిస్తున్నాయి. కనీసం 36 చీతాలు ఇక్కడ ఉండేందుకు అన్ని వసతులూ ఏర్పాటు చేశారు. మొత్తం 748 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఈ నేషనల్ పార్క్. కొత్తగా వస్తున్న చీతాలను సంరక్షించేందుకు ప్రత్యేకంగా రెండు అదనపు పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేయనున్నారు.