సుమారు 200 ఏళ్ల పాటు భారతదేశాన్ని నియంతృత్వంగా పాలించిన బ్రిటిషర్లు... విడిచిపోతూ మత ప్రాతిపదిక దేశాన్ని రెండుగా విభజించారు. భారతదేశం స్వతంత్ర కాంక్ష నేరవేరే కొద్ది గంటల ముందే కొద్ది గంటల ముందే భారతావని రెండు ముక్కలైంది. భారత్ స్వాతంత్రానికి కొన్ని గంటల ముందు భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడింది. ఆ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో లక్షల మంది ప్రాణాలు వదిలారు. విభజన గాయాలు ఈనాటికీ వెంటాడుతున్నాయి.
Also Read: 1906లో మన జాతీయ జెండా ఎలా ఉండేదో తెలుసా? చూస్తే.. ఆశ్చర్యపోతారు!
Also Read: Independence Day quotes: స్వాతంత్య్ర సమరయోధుల స్పూర్తిదాయక సూక్తులు
ప్రధాని మోదీ కీలక నిర్ణయం
భారత్- పాకిస్థాన్ విభజన సమయంలో మత్మోనాద శక్తులు రెచ్చిపోయాయి. దాడులకు తెగబడ్డాయి. లక్షలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశానికి తరలి వచ్చారు. దేశ విభజన జరిగిన ఆగస్టు 14పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ కీలక నిర్ణయం వెల్లడించారు. ఆగస్టు 14వ తేదీని ఇక నుంచి 'విభజన భయానకాల స్మారక దినం'(Partition Horrors Remembrance Day)గా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రధాని వెల్లడించారు.
విరోధం తొలగిపోవాలని ప్రధాని ఆకాంక్ష
దేశ విభజన నాటి గాయాలను ఎన్నటికీ మరువలేమని ప్రధాని మోదీ అన్నారు. మతిలేని ద్వేషం, హింస వల్ల కొన్ని లక్షల మంది సోదర, సోదరీమణులు నిరాశ్రయులు అయ్యారన్నారు. ఎందరో ప్రాణాలను కోల్పోయారని చెప్పారు. ప్రజల త్యాగాలు, కష్టాలను గుర్తు చేసుకునేందుకు ఆగస్టు 14ను ఇకపై Partition Horrors Remembrance Day ప్రకటిస్తున్నామని అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇక నుంచైనా సామాజిక వ్యత్యాసాలు, విరోధం వంటివి తొలగిపోవాలని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. సామాజిక సామారస్యాన్ని, మానవాళి అభివృద్ధిని బలోపేతం చేసే దిశగా విభజన భయానకాల స్మారక దినం జరుపుకుందామని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. విభజన సమయంలో పశ్చిమ బెంగాల్‌లోని నోఖాలి, బిహార్‌లో పెద్ద ఎత్తున మత విద్వేషాలు చెలరేగాయి. దీంతో నోఖాలి జిల్లాలో శాంతిని పునరుద్ధరించేందుకు మహాత్మా గాంధీ అక్కడ నిరాహార దీక్ష చేశారు.
Also Read:- Independence Day 2021: జాతీయ పతాకం ఎగురవేయవద్దు.. గోవా దీవిలో ప్రజల అభ్యంతరం.. రంగంలోకి సీఎం ప్రమోద్ సావంత్