PM - Fasal Bima Yojana : పంటల బీమా పథకం దరఖాస్తుకు పొడింగిపుల పర్వం సాగుతోంది. ఈ పథకం కోసం స్వయంగా రైతులే వచ్చి నమోదు చేసుకోవాలి. కానీ ఈ బీమా పథకం (Insurance Scheme)పై ఉన్న తక్కువ అవగాహన కారణంగా రైతులు వెనుకంజలో ఉంటున్నారు. మరో వైపు బీమా ప్రీమియం కూడా అధికంగా ఉండడంతో రైతులు అంత ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.


జీడి పంటకు ప్రీమియం గడువు నవంబర్ 22, 2024.. మిగతా అన్ని పంటలకు డిసెంబర్ 31తోనే ముగిసింది. అయితే ప్రస్తుతం వరికి మాత్రమే ఈ తేదీని పెంచుతున్నట్టు ప్రకటించాయి బీమా కంపెనీలు. వరి పంటకు ప్రీమియం చెల్లింపు గడువును బీమా కంపెనీలు జనవరి 15 వరకు పొడిగించాయి. దీంతో మిగతా పంటలకు కూడా ప్రీమియం చెల్లింపునకు మరింత అవకాశం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. గతేడాది 43.82 లక్షల మంది రైతులకు బీమా లభించగా, ఈసారి రబీలో 7.6 లక్షల మందికే కవరేజ్ లభించిందని చెబుతున్నారు.


పంటల బీమా నమోదులో రైతుల నిరాసక్తి


సాధారణంగా బ్యాంకుల్లో ఎవరైతే రుణాలు తీసుకోవాలనుకుంటారో.. వారు తాము వేసే పంటల వివరాలను జాతీయ పంటల బీమా పోర్టల్ (ఎన్సీఐసీ)లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రుణం తీసుకునేటప్పుడు బ్యాంకులే రైతుల నుంచి ప్రీమియం వసూలు చేసి బీమా కంపెనీకి చెల్లిస్తాయి. ఒకవేళ ఇలాంటివేమీ లేకుండా బీమా వద్దనుకుంటే మాత్రం బ్యాంకుకు ముందే చెప్పాలి. బ్యాంకుల నుంచి రుణం తీసుకోని రైతులు నేరుగా తమ వాటా ప్రీమియంను ఆన్ లైన్ లో చెల్లించి.. కావల్సిన పత్రాలతో సచివాలయాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పోస్ట్ ఆఫీస్ లు కామన్ సర్వీస్ సెంటర్ లకు వెళ్లి ఎన్సీఐసీ అధికారిక పోర్టల్ లో అప్ లోడ్ చేయాలి. ఇందుకు ఏరియా షోన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఆధార్ సీడింగ్ బ్యాంక్ పాస్ బుక్, మొబైల్ నంబర్ ను రైతులు.. రైతు సేవా కేంద్రాల సిబ్బందికి అందజేయాలి.


Also Read: Tirumala Update: శ్రీవారి భక్తులకు అలర్ట్, తిరుమలలో 10 రోజులపాటు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు


పెసర, మినుము పంటల నమోదులో మూడో స్థానం


కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకానికి సంబంధించి పెసర, మినుము పంటల నమోదులో రాష్ట్రస్థాయిలో విజయనగరం జిల్లా మూడో స్థానంలో నిలిచింది. మొదట్లో ఈ నమోదుకు డిసెంబర్ 15, 2024 వరకే అవకాశమివ్వగా.. రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో ఈ తేదీని డిసెంబర్ 31కి పెంచారు. ఈ క్రమంలోనే డిసెంబరు చివరి వారంలో ఎక్కువ సంఖ్యలో సీఎస్‌సీ కేంద్రాలకు వెళ్లి బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. అలా జిల్లా వ్యాప్తంగా మొత్తం 88వేల 59మంది రైతులు నమోదు చేసుకున్నారు. అత్యంత ఎక్కువగా గంట్యాడ మండలంలో, తక్కువ మొత్తంలో చీపురుపల్లి మండలం రైతులు దరఖాస్తు చేసుకున్నారు.


Also Read : Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!