శ్రీలంకలో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాని రణిల్ విక్రమ్‌ సింఘే రాజీనామా చేయాలంటూ చాలా రోజులుగా ఆందోళనలు చేపట్టారు. అధ్యక్షుడి ఇంటిపై ఇలా దాడి చేశారు.



అధ్యక్షుడి ఇంట్లోకి చొరబడ్డ ఆందోళనకారులు స్విమ్మింగ్ చేశారు. కిచెన్‌లోకి వెళ్లి ఆహార పదార్థాలు తిన్నారు. ఇంకొందరు అధ్యక్షుడి
బెడ్‌పై పడుకున్నారు. 




కొందరు నిరసనకారులు అధ్యక్షుడి ఇంట్లో ఉన్న అన్ని సౌకర్యాలనూ వినియోగించుకున్నారు. కొంత మంది టీవీ చూస్తూ ఉంటే, 
ఇంకొందరు టీవీ చూస్తూ కూర్చున్నారు. 




సైన్యం వీరిని అదుపు చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. కొన్ని చోట్ల నిరసనకారులు సైనికులపైనా దాడి చేసి వారిని
చెదరగొట్టారు. 



ఓ మహిళ అధ్యక్షుడి కుర్చీలో కూర్చుని దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చైర్‌లో కూర్చుని ఆ మహిళ నవ్వుతూ,
ఆశీర్వదిస్తున్నట్టుగా ఫోజ్ పెట్టారు. అక్కడి ప్రజల అసహనానికి అద్దం పడుతోంది ఈ ఫోటో. 




ప్రధాని, అధ్యక్షుడి ఇళ్లను భారీ సంఖ్యలో ముట్టడి చేశాక కానీ, వాళ్లిద్దరూ రాజీనామా చేసేందుకు అంగీకరించలేదు. ప్రస్తుతానికి 
రాజపక్స, విక్రమ్‌సింఘే ప్రజల కంట కనబడకుండా ఎక్కడో దాక్కున్నారు. 




ప్రధానమంత్రి రణిల్ విక్రమ్‌సింఘే ఇంటిని ఆందోళనకారులు తగలబెట్టారు. ఇది జరిగాకే ఆయన రాజీనామా చేస్తానని ప్రకటించారు. 
ఇంటిని తగలబెట్టిన సమయంలో ఆయన లోపల ఉన్నరా లేదా అన్నది తెలియరాలేదు. 






ప్రధాని, అధ్యక్షుడి రాజీనామా తరవాత ప్రతిపక్షాలు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరో వారం పది రోజుల్లో 
కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని అంచనా వేస్తున్నారు.