Patra Chawl Land Scam: 


అపోజిషన్ ముక్త్ పార్లమెంట్ కావాలేమో: ఖార్గే


పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్‌ను కాంగ్రెస్ నేతలు ఖండించారు. భాజపా "బెదిరింపు" రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ కూడా ఈ అంశంపై స్పందించారు. సంజయ్‌ రౌత్‌ను ఎంతో ధైర్యమైన వ్యక్తిగా అభివర్ణించిన ఆయన..భాజపాపై విమర్శలు గుప్పించారు. కాషాయ
పార్టీపై మండిపడుతూ ట్వీట్ చేశారు. "భాజపా రాజకీయాలకు, బెదిరింపులరు సంజయ్ రౌత్ ఎప్పుడూ తలొగ్గలేదు. ఆయన చేసిన నేరం అదే. నేరారోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ ఎంతో ధైర్యవంతుడు. ఆయనకు అండగా మేముంటాం" అని ట్వీట్‌లో పేర్కొన్నారు అధిర్ రంజన్. అటు మరో కాంగ్రెస్ నేత శశి థరూర్ కూడా స్పందించారు. భాజపా, సెంట్రల్ ఏజెన్సీని దుర్వినియోగం చేస్తోందని, ప్రతిపక్ష నేతలను కావాలనే లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శించారు. "ప్రభుత్వ సంస్థలు ఉన్నది రాజకీయాలు చేయటం కోసం కాదు" అని అభిప్రాయపడ్డారు. "ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే భాజపా ఇలా చేస్తోంది" అని రాజ్యసభ ఎంపీ మల్లికార్జున్ ఖార్గే అన్నారు. "భాజపాకు అపోజిషన్ ముక్త్ పార్లమెంట్‌ కావాలి. అందుకే సంజయ్‌ రౌత్‌ను ఇలా ఇరికించారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఖార్గే.













 


ఆరు గంటల పాటు ప్రశ్నించిన అధికారులు 


దక్షిణ ముంబయిలోని ఈడీ జోనల్ ఆఫీసులో దాదాపు 6 గంటల పాటు రౌత్‌ను ప్రశ్నించిన అనంతరం అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి 12.05 నిమిషాలకు మనీ లాండరింగ్ చట్టం (PMLA) ప్రకారం సంజయ్ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకున్నట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. పత్రా చాల్ కేసులో దర్యాప్తునకు రౌత్ సహకరించకపోవడంతో ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఉదయం 7 గంటలకు ఈడీ అధికారుల బృందం సీఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి ముంబయి బందూప్‌లో ఉన్న సంజయ్ నివాసానికి చేరుకున్నారు. ముంబయిలోని ఓ భవనం అభివృద్ధి, దానికి సంబంధించిన లావాదేవీలు, ఆయన సతీమణి, సన్నిహితుల లావాదేవీలపై అధికారులు ప్రశ్నించారు. ఆయన నివాసంలో దొరికిన రూ.11.5 లక్షలను సీజ్ చేశారు.


Also Read: Comedian Sarathi: టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు సారథి కన్నుమూత


Also Read: Cheddi Gang: నిజామాబాద్ లో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ హల్ చల్, ఏం చేశారంటే?