ABP  WhatsApp

Election Results 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Lata Mangeshkar Demise: లతా మంగేష్కర్ మృతిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్

ABP Desam Updated at: 06 Feb 2022 08:32 PM (IST)
Edited By: Murali Krishna

లతా మంగేష్కర్ మృతి పట్ల పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంతాపం వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ ప్రధాని

NEXT PREV

దిగ్గజ గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతి మనకు తీరని లోటని పేర్కొన్నారు.







లతా మంగేష్కర్ మృతితో ప్రపంచమంతా తెలిసిన ఓ గొప్ప గాయనీమణిని మన ఉపఖండం కోల్పోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆమె పాటలను విని ఆనందాన్ని పొందారు.                                                          -       ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధాని


పాకిస్థాన్ ప్రధానితో పాటు నేపాల్, బంగ్లాదేశ్ ప్రధానులు, అధ్యక్షులు కూడా లతా మంగేష్కర్ మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమెకు తమ నివాళులర్పించారు.


లతా మంగేష్కర్ అంత్యక్రియలు ముంబయిలోని శివాజీ పార్కులో జరిగాయి. అంతకుముందు ఆమె పార్థివ దేహానికి గౌరవ వందనం సమర్పించారు. అభిమానులు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ, రేపు సంతాప దినాలుగా ప్రకటించింది.


పోరాడి..


భారత సినీ చరిత్రలో గాయనిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న లతా మంగేష్కర్ ఈరోజు​ తుదిశ్వాస విడిచారు. కరోనా బారినపడిన ఆమె జనవరి 8న ముంబయిలోని బ్రీచ్​ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స అందించిన క్రమంలో కొద్ది రోజులకు కోలుకున్నారు. అయితే.. శ్వాస సంబంధిత సమస్య తీవ్రమవటం వల్ల 28 రోజుల చికిత్స అనంతరం ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆమె సోదరి ఉషా మంగేష్కర్​ వెల్లడించారు.


లతా మంగేష్కర్ మృతి పట్ల సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.


Also Read: Lata Mangeshkar Passes Away: లతా జీ.. మీరే దూరమయ్యారు, కానీ ఆ స్వరం కాదు: నేపాల్ అధ్యక్షురాలు


Also Read: Lata Mangeshker: లతా మంగేష్కర్‌కు చెల్లి చేతి వంటంటే ప్రాణం, ఇష్టంగా వండించుకుని తినే వంటలివే

Published at: 06 Feb 2022 08:32 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.