PM Modi Hyderabad Tour: ప్ర‌ధాన‌ మంత్రి నరేంద్ర మోదీ రాక‌ కోసం కొంద‌రు ఎదురు చూస్తే..  తెలంగాణ సీఎం కేసీఆర్ కోసం మాత్రం మ‌రికొంత‌ మంది ఎదురుచూశారు. గ‌తంలో ఇద్ద‌రూ చాలాసార్లు క‌లుసుకున్నా.. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ క‌ల‌వ‌బోతున్నారని,  కానీ మరోసారి కలుసుకునే సందర్భమని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అప్పుడు క‌ల‌వ‌డం వేరు, ఇప్పుడు క‌ల‌వడం వేరు. మొన్న కేంద్ర బ‌డ్జెట్ రోజు ప్రెస్ మీట్ లో కేంద్ర ప్ర‌భుత్వాన్ని త‌న‌దైన శైలిలో ఘాటుగా విమ‌ర్శించిన కేసిఆర్ ఇప్పుడు ప్రధానితో ఏం మాట్లాడ‌బోతున్నారు? అని అంతా ఆసక్తిగా ఎదురుచూసినా ప్రధాని పాల్గొన్న రెండు ప్రోగ్రామ్స్‌లో కేసీఆర్ పాల్గొన‌లేదు. 


అసలేం జరిగింది, సీఎం కేసీఆర్ అధికారికంగా వెళ్లి ఎందుకు పాల్గొన‌డం లేద‌ని ఎక్క‌డా సీఎంఓ కార్య‌ాలయం చెప్పలేదు. మరోవైపు కేసీఆర్‌కు జ్వ‌రం వ‌చ్చింద‌ని వంద‌తులు కూడా వ్యాపించాయి. ప్రధాని మోదీతో వేదిక షేర్ చేసుకోవ‌డం ఇష్టంలేకనే సీఎం కేసీఆర్ కావాల‌నే రాలేదా. మ‌రోవైపు కేసిఆర్ బడ్జెట్ మీద ప్రెస్ మీట్‌ను హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో కొంద‌రు బీజేపీ నేత‌లు త‌ర్జుమా చేసి బీజేపీ అధిష్టానానికి చెప్పి ఉంటారని చ‌ర్చ‌జ‌రుగుతోంది. ముచ్చింత‌ల్ లో జ‌రిగిన శ్రీ రామానుచార్యుల విగ్ర‌హావిష్క‌ర‌ణ‌తో అక్క‌డ హోమం, ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో మోదీ పాల్గొన‌డంతో పాటు త‌న‌దైశిలో ప్ర‌సంగించ‌డం బీజేపీ నేత‌ల్ని ఉత్సాహ‌ప‌ర్చింది. 






మొత్తం కార్య‌క్ర‌మానికి మోదీ హైలెట్ అవ‌డంతో తెలంగాణ బీజేపీ నేత ఒక‌రు ప్రొగ్రామ్ అయిపోయిన త‌ర్వాత కేసీఆర్ రాక‌పోవ‌డమే మంచిదైంది అని అన‌డం ఆశ్చ‌ర్యాన్ని గురిచేసింది. కేసీఆర్ రాక‌పోయినా ప్ర‌భుత్వం త‌రపున మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ తో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు, సీనియ‌ర్ నేత వేణుగోపాలాచారి పాల్గొన్నారు. ఇక్రిసాట్ విజిటింగ్, ఫోటోల‌కు ఫోజులు, ముచ్చింత‌ల్‌లో కూడా ఆలానే జ‌రిగింది. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు.. అయితే హైద‌రాబాద్‌లో ప్రధాని అడుగుపెట్టిన వెంట‌నే గులాబీ శ్రేణులు సోష‌ల్ మీడియా వేదిక దాడి చేశాయి.




కేటీఆర్ ట్వీట్‌తో హాట్ హాట్‌గా మోదీ టూర్....
సమతా మూర్తి (Statue of Equality)విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ తెలంగాణ‌లో అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచి వెళ్లేవ‌ర‌కు #EqualityForTelangana ట్యాగ్ శ‌నివారం మ‌ధ్య‌ాహ్నం నుంచి ట్విట్టర్లో పోస్టులు చేస్తూ ట్రెండ్ చేయాలంటూ గులాబీ శ్రేణుల‌కు వారి సోష‌ల్ మీడియా టీం సందేశం ఇచ్చినట్లుంది. స‌మ‌తామూర్తి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌డానికి వ‌స్తున్న మోదీ స‌మాన‌త్వం పాటించ‌డం లేదని, తెలంగాణ‌లో స‌మాన‌త్వం ఏదంటూ మొద‌ట కేటీఆర్ ప్ర‌శ్నించారు. దీంతో ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ హాష్ ట్యాగ్ ట్విట్టర్లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ట్రెండ్ అయింది. తెలంగాణకు చెందిన నెటిజన్లు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించారు.


మంత్రుల ట్వీట్ల వ‌ర్షం..
లు రంగాల్లో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని, వివక్షను ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వ నిధుల పంపిణీ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అందని సహాయం, పునర్ విభజన చట్టం హామీలు, తెలంగాణకు దక్కని జాతీయ ప్రాజెక్టు హోదా వంటి అంశాలపైన తమదైన శైలిలో ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులు సైతం ప్రధాని పర్యటన సందర్భంగా ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వ వివక్షను ప్రశ్నించారు. కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ సమస్యలపై ఎన్నిసార్లు కోరినా కేంద్రం ప‌ట్టించుకోవ‌డంలేద‌ని ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణలోని వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం పైన చూపిస్తున్న వివక్ష పైన మంత్రి నిరంజన్ రెడ్డి ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించకపోవడంపై మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు.


ట్యాంక్ బండ్‌పై నిరసన 
టీఆర్ఎస్ నేతలు, పార్టీ మద్దతుదారులు కొంద‌రు ఓ పెద్ద బ్యాన‌ర్ ప‌ట్టుకొని ట్యాంక్ బండ్ పై ప్ర‌ద‌ర్శ‌న‌కు చేశారు. తెలంగాణపైన కేంద్రం వివక్షత‌ను చూపుతోందంటూ వాటి వివ‌రాల‌ను అంశాల‌వారిగా బ్యాన‌ర్‌తో నిర‌స‌న‌ తెలిపారు. ప్రధాని పర్య‌ట‌న సంద‌ర్భంగా రాష్ట్ర నెటిజ‌న్లు 20 వేలకు పైగా ట్వీట్లు చేయ‌డంతో ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ హాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ అయి టాప్ లో నిలిచింది. 


అప్పుడు వ‌ద్ద‌న్నారు? ఇప్పుడెందుకు రాలేదు? 
మోదీ ప‌ర్య‌ట‌నలో  కేసీఆర్ భాగం కాకపోవడంపై చ‌ర్చ‌ జ‌రుగుతోంది. న‌వంబ‌ర్ 2020లో మోదీ హైదరాబాద్ వ‌చ్చిన‌ప్పుడు కేసీఆర్‌ను ఆహ్వ‌నించ‌క‌పోవ‌డంపై మీ సంస్కారం ఇదేనా అంటూ గులాబీ శ్రేణులు మండిప‌డ్డాయి. కరోనా వ్యాక్సిన్ త‌యారీని పరిశీలించేందుకు భార‌త్ బ‌యోటెక్ కు వ‌చ్చారు. అప్పుడు పీఎంఓ నుంచి సీఎంను రావ‌ద్ద‌ని చెప్పారు. అప్పుడు రావ‌ద్ద‌న్నారు  ఇప్పుడు ర‌మన్నా పోవ‌డం ఎందుకు అని కేసిఆర్ అనుకున్నారేమోన‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్నారు. బడ్జెట్ తరువాత కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యల కారణంగానే వెళ్ల‌లేద‌ని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని మోదీని రిసివ్ చేసుకునేవారి జాబితాలో ఉన్నప్పటికీ చివ‌రి నిమిషంలో వ్యూహాత్మ‌కంగానే కేసీఆర్ రాలేద‌ని ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ‘ఏబీపీ దేశం’తో చెప్పారు. ప్రోగ్రామ్ కు తమ సార్ కూడా వ‌స్తే బాగుండేద‌ని మ‌రో నేత అన్నారు. 


వ్యూహాత్మ‌కంగానే రాలేదా? 
కేసిఆర్ ఎప్పుడు ఏం చేసినా దానికి ఓ లాజిక‌ల్ థింకింగ్ ఉంటుంద‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతుంటారు. మొన్న ప్రెస్ మీట్ లో కేసీఆర్ చెప్పిన విష‌యాలు ప్ర‌జ‌లు చ‌ర్చించుకోవాలి, అంద‌రి దృష్టి ఆ అంశాల మీద ఉండాలి కాబ‌ట్టే మోదీని కేసీఆర్ కలవలేదని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. కేంద్ర‌పై పోరాటం అంటూ మోదీతో కలిసి ప్రోగ్రాంలో పాల్గొంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయ‌నుకున్నారో... లేక టీఆర్ఎస్ ఆఫీయ‌ష్ ట్విట్ లో చెప్పిన విధంగా హోం మినిస్ట్రీ పాయింట్స్ లో పీఎం ప్రైవేటు ప్రోగ్రామ్‌లో సీఎంలు హాజరుకావాల్సిన అవ‌స‌రం లేదు కనుక కేసీఆర్ లైట్ తీసుకున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.