Pakistan Petrol Price Hike:


 
పాకిస్థాన్‌లో పరిస్థితి ఇది..


పాకిస్థాన్‌లో రోజురోజుకీ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ద్రవ్యోల్బణం ఆ దేశాన్ని వణికిస్తోంది. దాదాపు దివాళా తీసింది. ఫారెక్స్ నిల్వలు పడిపోతున్నాయి. ఆదాయం పెంచుకునే మార్గాలు వెతుక్కుంటున్న ప్రభుత్వం...పెట్రో ధరలపై పడింది. క్రమంగా పెంచుకుంటూ పోతోంది. IMF పెట్టిన కండీషన్స్‌ని పాటించడంలో భాగంగా పెట్రో ధరలు పెంచుతోంది. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.272. ఒకేసారి రూ.22.20 పైసలు పెంచడం వల్ల రికార్డు స్థాయిలో ధర పెరిగింది. డాలర్‌తో పోల్చుకుంటే పాకిస్థాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయిన నేపథ్యంలోనే...ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇక డీజిల్‌ ధర కూడా ఇదే స్థాయిలో ఉంది. ఒకేసారి రూ.17.20 పైసలు పెంచింది. ఫలితంగా...పాక్‌లో లీటర్ డీజిల్ ధర రూ.280కి పెరిగింది. కిరోసిన్‌ ధర రూ.202.73 పైసలు. ఇప్పటికే ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం ఎదుర్కొంటున్న పాకిస్థాన్...ఈ ధరల పెంపుతో మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. IMFఇప్పటికిప్పుడు రుణం అందిస్తే తప్ప కాస్తో కూస్తో గట్టెక్కే మార్గం దొరకదు.  


కొండెక్కిన ధరలు..


పాకిస్థాన్ లో పాల ధరలు లీటరు రూ. 190 నుంచి రూ. 210 వరకు ఉంది. బ్రాయిలర్ చికెన్ ధర 2 రోజుల్లో కిలోకు రూ. 30- 40 కి పెరిగింది. గతంలో కిలో రూ. 620- 650 మధ్య ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ. 700- 780 మధ్యలో ఉంది. అలాగే బోన్ లెస్ చికెన్ అయితే ఏకంగా వెయ్యికి చేరింది. ఇది ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరిందని డాన్ వార్తాపత్రిక నివేదించింది. వెయ్యి మందికి పైగా దుకాణదారులు పాల ధరలను పెంచారు. పాడి రైతులు, హోల్ సేల్ వ్యాపారులు ధరల పెంపును వెనక్కి తీసుకుంటే ధరలు తగ్గవచ్చు అని కరాచీ మిల్క్ రిటైలర్స్ అసోసియేషన్ ప్రతినిథి వాహిద్ అన్నారు. చికెన్ టోకు రేటు కిలో రూ. 600 ఉండగా.. వాటి మాంసం ఖరీదు రూ. 650- 700ల మధ్య ఉంది. ద్రవ్యోల్బణం పెరుగుదల ఈ మధ్యనే ఎక్కువగా ఉంది. ఐఎంఎఫ్, పాకిస్థాన్ మధ్య చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఇది షెహబాద్ షరీఫ్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అని పౌల్ట్రీ, సింధ్ పౌల్ట్రీ హెల్ సేలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్సి కమల్ అక్తర్ సిద్ధిఖీ అన్నారు. పాకిస్థాన్ లో నిరుద్యోగిత రేటు రోజురోజుకూ పెరుగుతోంది. వేలాదిమంది పాకిస్థానీయులు ఉద్యోగాలు కోల్పోతున్నారు.