Pakistan Economic Crisis:
IMF రుణం కోసం కష్టాలు..
పాకిస్థాన్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అప్పుల కుప్పుల్లో కూరుకుపోయిన ఆ దేశం ఇప్పట్లో ఆ ఊబి నుంచి బయటపడేలా కనిపించడం లేదు. ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలంటూ IMFని అర్థిస్తోంది పాకిస్థాన్. కానీ...IMF మాత్రం చాలా విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తోంది. 7 బిలియన్ డాలర్ల రుణం అందించేందుకు సిద్ధంగానే ఉన్నా...అందుకు తగ్గ అర్హతలన్నీ పాక్‌కు ఉన్నాయా లేదా అని సమీక్షిస్తోంది. ఈ లోన్ ఇచ్చేందుకు ఇప్పటికే 8 సార్లు పాక్‌కు వచ్చిన IMF బృందం...ఇప్పుడు తొమ్మిదో సారీ సమీక్ష జరుపుతోంది. దీనిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ఆర్థిక మంత్రి ఇషాక్ దర్‌కు IMFని ఎదుర్కోటం చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తమకు గడ్డు కాలం అంటూ వ్యాఖ్యానించారు.
"ప్రస్తుతం మేం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాలు ఎప్పుడూ ఊహించనిది. IMF చెప్పిన కండీషన్స్‌ని రీచ్ అవడం మా శక్తికి మించి పనిగా అనిపిస్తోంది. కానీ...మాకు వేరే మార్గం లేదు. కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాల్సిందే"
- షెహబాజ్ షరీఫ్, పాక్ ప్రధాని
కండీషన్స్ అప్లై..
రుణ భారం మోయలేక పాక్ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. IMFరివ్యూ జరిగిన ప్రతిసారీ గండం దాటినట్టే ఉంటోందని పాక్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ దేశ మారక ద్రవ్య నిల్వలు 3.09 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. మరో 18 రోజుల పాటు దిగుమతులకు మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. ఆ తరవాత పరిస్థితి ఏంటన్నది ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. IMF రివ్యూఆధారంగా చూస్తే...పాక్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పెట్రోల్ రేట్లను 16% పెంచాలి. ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్నీ 30% పెంచాలి. వీటిని అమలు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. కానీ..IMF మాత్రం ఈ కండీషన్స్ ఓకే అంటేనే లోన్ ఇస్తామని తేల్చి చెబుతోంది.
నేషనల్ గ్రిడ్‌లో ఏర్పడ్డ సమస్యల కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తింది. ఇప్పుడు వందల మంది ఉద్యోగాలు లేక రోడ్డున పడుతున్నారు. ఇలా ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో పొరుగు దేశం పాకిస్థాన్ అల్లాడుతోంది.
సోమవారం పాకిస్థాన్ నేషనల్ గ్రిడ్ ఫెల్యూర్ కారణంగా విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీంతో ఆ దేశంలో అంధకారం అలుముకుంది. కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడిపోయారు. ప్రధాన నగరాలు ఇస్లామాబాద్, కరాచీ, పెషావర్ లాంటి ప్రధాన నగరాల్లోనూ విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఉదయం 7.30 ప్రాంతంలో నేషనల్ గ్రిడ్ లో సమస్య తలెత్తింది అయితే వెంటనే పునరుద్ధరణ చర్యలు ప్రారంభించామని.. 12 గంటల్లో విద్యుత్ ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించామని ఆ దేశ విద్యుత్ శాఖ మంత్రి ఖుర్రమ్ అన్నారు. పాకిస్థాన్ లో నిరుద్యోగిత రేటు రోజురోజుకూ పెరుగుతోంది. వేలాదిమంది పాకిస్థానీయులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. దీనికి తోడు పాక్ కు చెందిన డాన్ వార్తాపత్రిక ఇచ్చిన నివేదిక ఆ దేశ ప్రధానితో సహా అందరిలోనూ ఆందోళన పెంచుతోంది. ఈ నివేదిక ప్రకారం ఈ ఏడాదిలో ఆ దేశంలో నిరుద్యోగుల సంఖ్య 62.5 లక్షలకు చేరుకుంటుందని అంచనా. ఈ ప్రకారం నిరుద్యోగుల సంఖ్య పెరిగితే అది దేశ అభివృద్ధిని మరింత కుంగదీస్తుంది.
Also Read: PM Modi: ప్రపంచంలోనే ది బెస్ట్ లీడర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ, ఆ సర్వేలో టాప్ ర్యాంక్