PM Modi Best Leader: 


మార్నింగ్ కన్సల్ట్ సర్వే..


ప్రధాని నరేంద్ర మోదీ పాపులారిటీ రోజురోజుకీ పెరుగుతోంది. విదేశాల్లోనూ ఆయనకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే కొన్ని సర్వేలు ప్రధాని మోదీ ది బెస్ట్ పీఎం అంటూ కితాబునిచ్చాయి. ఇప్పుడు మరో రిపోర్ట్ కూడా ఇదే విషయం వెల్లడించింది. Morning Consult సర్వేలో ప్రపంచంలోనే టాప్ లీడర్‌గా ర్యాంకు సాధించారు నరేంద్ర మోదీ. మొత్తం 22 దేశాల టాప్‌ లీడర్స్‌నీ వెనక్కి నెట్టి మోదీ ముందంజలో నిలిచారు. ఈ సర్వేలో మోదీకి అత్యధికంగా 78% రేటింగ్ వచ్చింది. ఈ ఏడాది జనవరి 26 నుంచి 31 వరకూ సర్వే చేపట్టి...ఈ ర్యాంకులు వెలువరించారు. ఈ లిస్ట్‌లో భారత ప్రధాని మోదీ తరవాత...మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రడార్ రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు 68% మంది ఓటు వేశారు. 
ఆ తరవాత ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మూడో స్థానం దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆరో స్థానం దక్కింది. ఆయనకు కేవలం 40% మంది ఓటు వేసినట్టు సర్వే వెల్లడించింది. బైడెన్ తరవాత కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఏడో స్థానంలో ఉన్నారు. ఇక భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌ పదో స్థానానికి పరిమితమయ్యారు. టాప్‌ వరల్డ్  లీడర్స్‌ జాబితాలో ఆయనకు 30% ఓట్లు దక్కాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ 11వ స్థానంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 20 వేల మందిని ఇంటర్వ్యూ చేసిన 
Morning Consult ఈ ర్యాంకులు వెల్లడించింది. ఈ ఇంటర్వ్యూలు చేసిన సమయంలో వాళ్లు ఇచ్చిన సమాధానాల ఆధారంగా లిస్ట్ తయారు చేశారు. అమెరికాలో 45 వేల మందిని ఇంటర్వ్యూ చేశారు. మిగతా దేశాల్లో ఈ సంఖ్య 500-5 వేల మందిని ఇంటర్వ్యూ చేశారు. 


బెస్ట్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్..


దేశంలో 30 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరు బెస్ట్..? అని ఓ సర్వే చేపట్టగా...ఇందులో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. తన పని తీరుతో, సంచలన నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఆయన...ఉత్తమ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. సీఓటర్, ఇండియా టుడే చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మూడ్ ఆఫ్ ది కంట్రీ పేరుతో చేసిన ఈ సర్వేలో బెస్ట్ సీఎం ఎవరు అని ప్రశ్నించగా...ఎక్కువ మంది యోగి ఆదిత్యనాథ్ పేరు చెప్పారట. సర్వే ప్రకారం మొత్తం 39.1% మంది ప్రజలు బెస్ట్ సీఎం క్యాటగిరీలో "యోగి ఆదిత్య నాథ్‌"కే ఓటు వేశారు. యోగి తరవాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. 16% మంది కేజ్రీవాల్‌కు ఓటు వేశారు. ఇక మూడో బెస్ట్ సీఎంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 7.3% మంది ఓటు వేశారు. యోగి పాపులారిటీ బాగా పెరిగినట్టు సర్వేలో తేలింది. ఇదేసమయంలో గతేడాది ఆగస్టుతో పోల్చి చూస్తే...కేజ్రీవాల్ పాపులారిటీ 6% మేర తగ్గింది. గతేడాది ఆగస్టులో కేజ్రీవాల్‌ను బెస్ట్ సీఎంగా 22% మంది తేల్చి చెప్పారు. 


Also Read: US - China: అమెరికా ఎయిర్‌ బేస్‌లో చైనా స్పై బెలూన్, అలెర్ట్ అయిన అగ్రరాజ్యం