Pakistan Counter-Terror Officers:
యాంటీ టెర్రరిజం అధికారులు..
పాకిస్థాన్‌లో ఉగ్రవాద చర్యలు రోజురోజుకీ మించిపోతున్నాయి. Tehreek-e-Insaf ఉగ్రవాద సంస్థ ఇప్పటికే పాక్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది. ప్రభుత్వాధికారులు, ఆర్మీ, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ యాంటీ టెర్రరిజం విభాగం డిప్యుటీ డైరెక్టర్, ఇన్‌స్పెక్టర్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని ఖనేవాల్‌లో ఈ దాడి జరిగింది. డిప్యుటీ డైరెక్టర్ నవీద్ సాదిక్, ఇన్‌స్పెక్టర్ నాజిర్ ఓ రెస్టారెంట్ వద్ద భోజనం చేసేందుకు ఆగారు. సరిగ్గా అదే సమయానికి ఉగ్రవాదులు ఉన్నట్టుంది అటాక్ చేశారు. ఈ దాడిలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. Tehreek-e-Taliban ఉగ్రవాద సంస్థ కూడా పాక్ ప్రభుత్వంపై దాడి చేస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారు. పోలీసులు, భద్రతా బలగాలపై దాడులు చేస్తున్నారు. ఈ ఉగ్ర సంస్థ పాకిస్థాన్‌లో అతి పెద్దది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాన్నాళ్లుగా యుద్ధం చేస్తోంది. ఐక్యరాజ్య సమితి వెల్లడించిన వివరాల ప్రకారం...టీటీపీ ఉగ్రవాదులు అఫ్ఘాన్ పాక్ సరిహద్దుల్లోనూ ఉన్నారు. పాకిస్థాన్ మిలిటరీ యాక్షన్, అమెరికా డ్రోన్‌ల దాడుల కారణంగా 2014-18 వరకూ ఈ ఉగ్రసంస్థ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అయితే...2020 ఫిబ్రవరిలో అమెరికా, తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి మళ్లీ యాక్టివ్ అయింది టీటీపీ సంస్థ. దాదాపు 10 ఉగ్రవాద సంస్థలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి.
ఉగ్రవాదులు హతం..
పాకిస్థాన్‌లోని ఖైబర్ పక్తుంఖ్వాలో పాక్ సైన్యం నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. జెనీ ఖేల్ ఏరియాలో నిఘా వర్గాల ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్టు Dawn వార్తాపత్రిక వెల్లడించింది. వీరితో పాటు ఓ పాక్ సైనికుడు కూడా చనిపోయినట్టు తెలిపింది. ఈ మధ్య కాలంలో పాకిస్థాన్ సైనికులపై ఉగ్రవాదులు దాడులు చేస్తూ చంపుతున్నారు. సామాన్య పౌరులనూ బలి తీసుకుంటు న్నారు. దీనికి బదులు తీర్చుకోవాలనుకున్న పాక్ సైన్యం...సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి నలుగురు ముష్కరులను హతమార్చింది. ఉన్నట్టుండిసైనికులను ఉగ్రవాదులు చుట్టుముట్టారు. ఆ సమయంలోనే ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు జరిగాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ సైనికుడు ఒకరు నేలకొరిగారు. ఆ తరవాత పోలీసులు ఎదురు దాడి చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఉగ్రవాదుల నుంచి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. హ్యాండ్ గ్రెనేడ్స్, రాకెట్స్‌ను వినియోగిస్తూ స్థానిక పౌరులను, సైనికుల ప్రాణాలు తీస్తున్నారు ఉగ్రవాదులు. డిసెంబర్ 25 పోలీసుల వ్యాన్‌పై ఉగ్రవాదులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు ముందుగానే గుర్తించి ప్రమాదాన్ని తప్పించారు. డిసెంబర్ 29న తక్వారా ఏరియాలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న 6గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఓ పిస్టల్‌ని, 20 క్యాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు...ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఒక పోలీస్ ప్రాణాలు కోల్పోగా...ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Also Read: Delhi Girl Attacked: బ్రేకప్ చెప్పినందుకు రెచ్చిపోయిన యువకుడు, యువతిపై కత్తితో దాడి