గుంటూరు జిల్లాలో జరిగిన చంద్రబాబు కార్యక్రమంలో తొక్కిసలాట ఘటనలో ఆ కార్యక్రమ నిర్వహకుడు ఎన్నారై శ్రీనివాస్ కు వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ బాసటగా నిలిచారు. గుంటూరు ఘటనను చిలువలు పలువలు చేసి మాట్లాడడం సరికాదని కృష్ణ ప్రసాద్ అన్నారు. ఉయ్యూరు శ్రీనివాస్ తనకు మంచి మిత్రుడని, ప్రవాసాంధ్రుల వలన దేశానికి మంచి జరుగుతుందని అన్నారు. శ్రీనివాస్ పేదల పట్ల అభిమానం ఉన్న వ్యక్తి అని, టీడీపీతో కలిసి కార్యక్రమం చేశారు కాబట్టి శ్రీనివాస్ పై ఇలా వివాదాలు ముసురుకుంటున్నాయని అన్నారు. సేవా కార్యక్రమాలు చేయడం మంచి పని అని, ఇలా ప్రవర్తిస్తే భవిష్యత్ లో ప్రవాసాంధ్రులు సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రారని తెలిపారు.


తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. పది రోజుల పాటు కొనసాగే ఈ వైకుంఠ ద్వారం దర్శనంతో భక్తులు పునీతులు అవుతున్నారు.. మంగళవారం రోజున 71,924 మంది స్వామి వారి దర్శించుకున్నారు.. ఇక స్వామి వారికి 15,771 మంది తలనీలాలు సమర్పించగా, 3.13 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు..  టైంస్లాట్ విధానం ద్వారా టిటిడి స్వామి వారి దర్శనంకు అనునతిస్తూ వస్తుంది..


శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు.. ఇందులో‌ భాగంగా బుధవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి రచించిన పాసురాళ్ళను జీయ్యం గార్లు పఠించారు.. అనంతరం  తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు.. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు.. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు.. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు సమర్పించగా, ఇక బుధవారం నాడు "బెల్లం పాయసం" ను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.. 


సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వి.ఐ.పి భక్తులను స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టిటిడి.. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "బుధవారం" రోజు నిర్వహించే "సహస్రకళషాభిషేకం"ను విగ్రహ అరుగుల కారణంగా పరిరక్షణకై ఆగమ శాస్త్రం పండితుల సలహాలు,‌ సూచనల మేరకు టిటిడి రద్దు చేసింది.. కేవలం ఏడాదికి‌ ఓ మారు సర్కారు వారి సహస్రకళషాభిషేకం టిటిడి నిర్వహిస్తొంది.. అనంతరం  సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు.. శ్రీవారి ఉత్సవమూర్తు అయినా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవంను నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అర్చకులు.. అటుతరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మంపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు అర్చకులు.


సాయంకాలం సహస్రదీపాలంకారసేవ  కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు అర్చకులు.. సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతిస్తారు.. నిత్య సేవల్లో‌భాగంగా సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి సహస్ర దీపాలంకారసేవను నిర్వహించి, తిరుఉత్సవం నిర్వహిస్తారు అర్చకులు.. అటుతరువాత ఉత్సవమూర్తులు శ్రీవారి ఆలహం చేరుకోగానే, సృవదర్శనం భక్తులను నిలిపి వేసి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు.. రాత్రి కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు.. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు..


అమిత్ షా పర్యటన వాయిదా
కర్నూలులో ఈనెల 8వ తేదీ జరగాల్సిన కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. సవరించిన తేదీలు త్వరలోనే ప్రకటిస్తారని బీజేపీ రాష్ట్ర మీడియా విభాగం తెలిపింది. సంక్రాంతి తరువాత అమిత్ షా పర్యటన జరిగే అవకాశం ఉంది.