Just In





Son Of India Trolls: రెండే టికెట్లు బుక్ అయ్యాయా? మోహన్‌బాబు 'సన్ ఆఫ్ ఇండియా'పై ట్రోల్స్ మామోలుగా లేవు!
'సన్ ఆఫ్ ఇండియా' సినిమాకు బుక్ మై షో యాప్‌లో రెండు టికెట్స్ మాత్రమే బుక్ అయ్యాయా? మోహన్ బాబు సినిమాపై ట్రోల్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి కదా!?

పద్మశ్రీ పురస్కార గ్రహీత, కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'సన్ ఆఫ్ ఇండియా'. ఫిబ్రవరి 18న (అనగా... ఈ శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బుక్ మై షో యాప్‌లో థియేటర్లు హౌస్ ఫుల్ కావడం లేదు. కొవిడ్ తర్వాత కొన్ని సినిమాలకు మాత్రమే గ్రాండ్ ఓపెనింగ్ లభించింది. సాధారణంగా బుకింగ్స్ స్లోగా ఉంటున్నాయి. అయితే... 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాకు రెండు అంటే రెండు టికెట్స్ మాత్రమే బుక్ అయ్యాయని, ఆ రెండు టికెట్స్ కూడా బుక్ చేసుకున్నది విష్ణు మంచు, లక్ష్మీ మంచు అని మీమర్స్ ఒక రేంజ్ లో రెచ్చిపోయారు. మంచు ఫ్యామిలీ మీద ట్రోల్స్ చేశారు. ఇటీవల సెలబ్రిటీల మీద ట్రోల్స్ చేయడం సర్వసాధారణం అయ్యింది. వీటిపై మోహన్ బాబు కూడా స్పందించారు. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
గమనిక: సోషల్ మీడియాలో ట్రెండవ్వుతున్న ట్రోల్స్, జోక్స్‌ను యథావిధిగా ఇక్కడ అందించాం. అందులో వ్యక్తులు పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. ఒక్కసారి సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ చూస్తే...