'పుష్ప: ద రైజ్' సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) సిగ్నేచర్ డైలాగ్ గుర్తుంది కదా... 'తగ్గేదే లే' అంటూ ఐకాన్ స్టార్ చేసిన పెర్ఫార్మన్స్ ఆడియ‌న్స్‌కు, బన్నీ అభిమానులకు బాగా  నచ్చింది. సినిమాకు బోలెడు క్రేజ్ తెచ్చింది. థియేటర్లలో భారీ వసూళ్ళు రాబట్టిన ఈ సినిమా, ఓటీటీలోనూ విడుదలై డిజిటల్ తెర వీక్షకులనూ ఆకట్టుకుంది. పుష్ప... పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు నెలల అవుతోంది. కానీ, అల్లు అర్జున్ అండ్ సినిమా క్రేజ్ ఇంకా తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు... ఉత్తరాదిలోనూ అల్లు అర్జున్ క్రేజ్ ఎంత ఉందనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ.


ఔరంగాబాద్‌కు చెందిన సోహన్ కుమార్ అల్లు అర్జున్ అభిమాని. 'పుష్ప' సినిమా, అంతకు ముందు హిందీలో అనువాదమైన అల్లు అర్జున్ సినిమాలు చూసి ఆయన అభిమానిగా మారారు. 'పుష్ప' విపరీతంగా నచ్చడంతో... అల్లు అర్జున్ విగ్రహం (Allu Arjun Statue - Pushpa) తయారు చేశాడు. 'పుష్ప'లో హీరో గన్ చేతిలో పట్టుకుని కూర్చున్న పోజును విగ్రహంగా చేశాడు. ఏప్రిల్ 8న... బన్నీ బర్త్ డేకు ఆ విగ్రహాన్ని అతడికి అందజేయాలని అనుకుంటున్నాడు సోహన్ కుమార్.


Also Read: చిరంజీవి 'గాడ్ ఫాదర్' వీళ్ళిద్దరికీ హ్యాట్రిక్! న‌య‌న్‌తో సినిమా అంటే...


'పుష్ప' భారీ విజయం సాధించడంతో టీమ్ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. త్వరలో 'పుష్ప 2'ను సెట్స్ మీదకు తీసుకువెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మికా మందన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్, ధనుంజయ తదితరులు నటించిన సంగతి తెలిసిందే. 


Also Read:  'భీమ్లా నాయక్' - ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న ఆర్ఆర్ఆర్?