Trending
Nobel Prize 2021 For Chemistry: రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్.. బెంజమిన్, డేవిడ్‌లకు దక్కిన పురస్కారం
రసాయన శాస్త్రంలో ఈ ఏడాది ఇద్దరికి నోబెల్ బహుమతి దక్కింది. బెంజమిన్ లిస్ట్, డేవిడ్ వి.సి. మెక్‌మిల్లన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ అవార్డు లభించింది.
రసాయన శాస్త్రంలో (కెమిస్ట్రీ) ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం ఈ ఏడాది ఇద్దరికి దక్కింది. బెంజమిన్ లిస్ట్, డేవిడ్ వి.సి. మెక్‌మిల్లన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ ఏడాది నోబెల్ బహుమతిని కైవసం చేసుకున్నారు. అసిమెట్రిక్ ఆర్గానోక్యాటలసిస్‌ను (Asymmetric Organocatalysis) అభివృద్ధి చేసినందుకు గానూ వీరికి ఈ పురస్కారం వరించింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్..
భౌతికశాస్త్రంలో (ఫిజిక్స్) ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ బహుమతి దక్కింది. సుకురో మనాబే, క్లాస్‌హాసెల్‌మేన్, జార్జియోపారిసీకి అనే ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా ఈ పురస్కారం అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. భూతాపం తీవ్రతను అంచనా వేయడంపై సాగిన పరిశోధనలకు గానూ వీరికి నోబెల్ అవార్డు ఇస్తున్నట్లు వెల్లడించింది.
Read More: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్.. సుకురో, క్లాస్, పారిసీకి దక్కిన పురస్కారం
వైద్య రంగంలో ఇద్దరికి నోబెల్..
2021 ఏడాదికి గాను వైద్య శాస్త్రానికి సంబంధించి ఇద్దరికి నోబెల్ పురస్కారం లభించింది. డేవిడ్ జులియస్, ఆర్డెమ్ పటాపౌటియన్ అనే ఇద్దరు శాస్తవేత్తలకు సంయుక్తంగా నోబెల్ అవార్డు అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. వేడి, చలి, స్పర్శ వంటి వాటికి మానవ శరీరంలోని నాడీ వ్యవస్థ ఎలా ప్రతిస్పందిస్తుందనే అంశంపై వీరు పరిశోధనలు చేశారు.
ఈ అవార్డులో భాగంగా బంగారు పతకంతో పాటు సుమారు 1.14 మిలియన్ల అమెరికన్ డాలర్లను బహుమతిగా అందిస్తారు. 2021లో ప్రకటించిన తొలి నోబెల్ బహుమతి ఇదే కావడం విశేషం. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రంలో బహుమతులను ప్రకటించగా.. సాహిత్యం, శాంతి, ఆర్థిక శాస్త్రంపై త్వరలోనే వెల్లడించనున్నారు.
Also Read: లఖ్‌నవూ ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా.. ధర్నాకు దిగిన రాహుల్ గాంధీ
Also Read: దసరాకి ఏపీలో 4 వేల స్పెషల్ బస్సులు, ఈ బస్సులెక్కితే 50 శాతం అధిక ఛార్జీ.. ఎందుకంటే..: ఆర్టీసీ ఎండీ