ఐపీఎల్‌లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. షేక్ జయేద్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేసులో ఉన్న జట్ల అవకాశాలను ఈ మ్యాచ్ ప్రభావితం చేయదు కానీ.. బెంగళూరు భారీ తేడాతో గెలిస్తే మాత్రం.. టాప్-2కి వెళ్లే అవకాశం ఉంటుంది. అప్పుడు క్వాలిఫయర్-1లో ఆడే అవకాశం బెంగళూరుకు దక్కుతుంది. సన్‌రైజర్స్ గెలిచినా.. ఓడినా పోయేదేమీ లేదు.


పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ తుదిజట్టులో మార్పులు చేయలేదు. అది పాజిటివ్ రిజల్ట్‌నే అందించింది. కాబట్టి ఈ మ్యాచ్‌లో కూడా జట్టును మార్చకపోవచ్చు. ప్లేఆఫ్స్‌కు ముందు కీలక ఆటగాళ్లకు విశ్రాంతిని ఇవ్వాలనుకుంటే కొందరు కొత్త ఆటగాళ్లకు అవకాశం దక్కే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో సరైన ప్రదర్శన చేయని డాన్ క్రిస్టియన్ బెంచ్‌కు పరిమితం అయ్యే అవకాశం ఉంది. మ్యాక్స్‌వెల్ అద్భుతమైన ఫాంలో ఉండగా.. డివిలియర్స్ మాత్రం భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. బౌలర్లలో హర్షల్ పటేల్, చాహల్, సిరాజ్ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.


ఇక సన్‌రైజర్స్ విషయానికి వస్తే.. వాళ్లకి ఈ సీజన్‌లో ఇంతవరకు ఏమీ కలిసిరాలేదు. మొత్తం 12 మ్యాచ్‌ల్లో కేవలం రెండు మాత్రమే గెలిచింది. ఏకంగా 10 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. జేసన్ హోల్డర్ మినహా ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా ఫాంలో లేడు. బౌలర్లలో భువనేశ్వర్, ఉమ్రాన్, సందీప్ శర్మ, రషీద్ మంచిగా బౌలింగ్ చేస్తున్నా.. బ్యాట్స్‌మెన్ సహకారం లేకపోవడంతో అదంతా బూడిదలో పోసిన పన్నీరవుతోంది.


ఈ రెండు జట్ల ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు జరగ్గా సన్‌రైజర్స్ 10 మ్యాచ్‌లు గెలిచింది. బెంగళూరు 8 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. ఈ రెండు జట్లూ తలపడిన గత ఆరు మ్యాచ్‌ల్లో చెరో మూడు గెలిచాయి. 2016 ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరును రైజర్స్ ఓడించి ఐపీఎల్ ట్రోఫీ సాధించిన సంగతి తెలిసిందే.. ఈ మ్యాచ్‌లో బెంగళూరు గెలిచి రెండో స్థానం వైపు వెళ్తుందో.. రైజర్స్ విజయం సాధించి చాలెంజర్స్ అవకాశాలను దెబ్బ తీస్తుందో చూద్దాం..!


Also Read: కోల్‌కతా మ్యాచుకు ముందు పంజాబ్‌కు షాక్‌! బుడగ వీడిన క్రిస్‌గేల్‌.. ఎందుకంటే?


రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు(అంచనా)
విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, డాన్ క్రిస్టియన్/చమీరా, గార్టన్/దేశ్‌పాండే, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చాహల్


సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు(అంచనా)
జేసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్, ప్రియం గర్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, సిద్ధార్థ్ కౌల్


Also Read: యాష్‌ తప్పేం చేయలేదు! సోషల్‌ మీడియాలో ఫాలోవర్లు పెంచుకొనేందుకే అతడిపై విమర్శలు.. గౌతీ సీరియస్‌!


Also Read: విరాట్‌ సరసన స్మృతి మంధాన.. పింక్‌ టెస్టులో సెంచరీ. ఔటివ్వకున్నా పెవిలియన్‌ వెళ్లిన పూనమ్‌!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి