Lakhimpur Kheri Incident LIVE: సీతాపుర్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ.. ప్రియాంకతో కలిసి లఖింపుర్‌కు పయనం
రాహుల్ గాంధీ సహా ఛత్తీస్‌గఢ్, పంజాబ్ సీఎంలు ఉత్తర్‌ప్రదేశ్ పర్యటనకు బయలుదేరారు. అయితే వీరిని లఖ్‌నవూ ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకుంటామని పోలీసులు తెలిపారు.
రాహుల్ గాంధీ బృందం సీతాపుర్‌కు చేరుకుంది. ఈ బృందంతో ప్రియాంక గాంధీ కలిసి లఖింపుర్ ఖేరీ వెళ్లనున్నారు. గత 3 రోజులుగా ప్రియాంక గాంధీ యూపీ ప్రభుత్వం అతిథి గృహంలో నిర్బంధించింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లఖ్‌నవూ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. సొంత వాహనంలో లఖింపుర్ వెళ్తానని రాహుల్ కోరగా అందుకు పోలీసులు నిరాకరించారు. తమ వాహనంలోనే తీసుకువెళ్తామని తెలిపారు. అయింతే ఇందుకు అంగీకరించని రాహుల్ విమానాశ్రయంలోనే ధర్నాకు దిగారు.
.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లఖ్‌నవూ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సుర్జేవాలా ఉన్నారు.
ఛండీగఢ్‌లోని రాజ్‌భవన్ ఎదుట లఖింపుర్ ఘటనను నిరసనిస్తూ ఆమ్‌ఆద్మీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. వీరిపై పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా మరో ముగ్గురికి లఖింపుర్ ఖేరీలో పర్యటించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు యూపీ హోంశాఖ వెల్లడించినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
రాహుల్ గాంధీ బృందాన్ని ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకుంటామని లఖ్‌నవూ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
Background
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లఖింపుర్ ఖేరీకి వెళ్లేందుకు పయనమయ్యారు. ఆయనతో పాటు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ కూడా ఉన్నారు. వీరు ముగ్గురు లఖింపుర్ ఖేరీ ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు.
అయితే వీరి పర్యటనకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అనుమతి నిరాకరించింది. అయినప్పటికీ రాహుల్ పర్యటిస్తానని తేల్చిచెప్పారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -