Skybuses For Bengaluru:
ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు..
బెంగళూరులో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో దశాబ్దాలుగా ఈ సమస్య అక్కడి ప్రజల్ని ఇబ్బందులు పెడుతోంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..దీనికో పరిష్కారం చెప్పారు. ఫిలిప్పైన్స్ సహా మరి కొన్ని దేశాల్లో లాగానే...బెంగళూరులో స్కై బస్(Sky Bus)లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. "ప్రస్తుతం బెంగళూరులోని రోడ్ల విస్తీర్ణం పెంచటం చాలా కష్టం. అందుకే మేము రెండు
నిర్ణయాలు తీసుకున్నాం. చెన్నై తరహాలోనే ఇక్కడా త్రీ డెక్ లేదా గ్రేడ్ సెపరేటర్స్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం" అని కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్రజా రవాణా కోసం పూర్తిగా విద్యుత్ వాహనాలనే వినియోగించాలనీ భావిస్తున్నట్టు తెలిపారు. టెక్నాలజీ ఎంతో మారిందని, బెంగళూరులో లాండ్‌ని సేకరించటం కష్టమని అన్నారు నితిన్ గడ్కరీ. అందుకే..స్కై బస్‌ల ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చినట్టు చెప్పారు. వీటిని ఎలా అందుబాటులోకి తీసుకురావాలో తెలుసుకోవాలని...National Highway Authority of Indiaకు సూచించారు. నిపుణులతో చర్చించాలని తెలిపారు. లక్షలాది మంది ప్రజలు రోడ్డు మార్గంలో కాకుండా ఇలా ఆకాశ మార్గంలో ప్రయాణించేవెసులుబాటు వస్తే...ట్రాఫిక్ సమస్య తీరిపోయినట్టేనని అన్నారు గడ్కరీ.
గోవాలోనూ ప్లాన్..
ఇప్పుడే కాదు. గతంలోనూ భారత్‌లో ఈ స్కై బస్ కాన్సెప్ట్ చర్చకు వచ్చింది. 2016లో గోవాలో ఈ ప్రాజెక్ట్ నిర్మించాలని అనుకున్నా...కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. ఇప్పుడు గడ్కరీ ప్రకటనతో మరోసారి దీనిపై చర్చ మొదలైంది. ఇంతకీ స్కైబస్ అంటే ఏంటి..? (What Is A Skybus?)దాదాపు మెట్రోని పోలి ఉండే ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ ఇది. ఇకో ఫ్రెండ్లీ కూడా. పట్టణాల్లో పెద్ద మొత్తంలో ప్రజల్ని తమ గమ్య స్థానాలకు చేర్చేందుకు ఇదే బెస్ట్ మెథడ్. దీని కోసం ప్రత్యేకంగా ఎలివేటెడ్ ట్రాక్ నిర్మిస్తారు. జర్మనీలో H-Bahn transport systemని పోలి ఉంటుంది..ఈ స్కైబస్ సిస్టమ్. గంటకు 100 కిలోమీటర్ల వేగంతా, పూర్తిగా విద్యుత్‌తోనే నడుస్తాయి స్కై బస్‌లు. సివిల్ ఇన్‌ఫ్రా విషయంలో మెట్రోతో పోల్చుకుంటే ఖర్చు చాలా తక్కువే. గ్రావిటీకి ఆపోజిట్‌గా క్యారేజీ వీల్స్‌ను పట్టుకుని ఉండేలా...కాంక్రీట్ బాక్స్‌లో ట్రాక్స్ ఏర్పాటు చేస్తారు. ఈ ట్రాక్‌లు విడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. 2003లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ కొత్త సంవత్సరం కానుకగా..గోవాకు స్కై బస్ ప్రాజెక్ట్‌ని ప్రకటించారు. ఇందుకోసం రూ.100 కోట్లు కేటాయించారు. కానీ...ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్లలేదు. మపుసా నుంచి పనాజీ వరకూ పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టాలని అప్పట్లో ప్లాన్ చేశారు. 2016లో Konkan Railways Corporation ఈ స్కైబస్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టింది. కమర్షియల్‌గా ఇది పెద్దగా వర్కౌట్ కాదని తేల్చి చెప్పింది.
Also Read: Garikapati : తిరువనంతపురం అనంతపద్మనాభ స్వామి ఆలయంపై గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు | DNN | ABP Desam