NIA Alerts Mumbai Police:
అప్రమత్తమైన ముంబయి పోలీసులు..
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ముంబయి పోలీసులను అలెర్ట్ చేసింది. డేంజరస్ మేన్ ముంబయిలోకి అడుగు పెట్టాడని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు మెయిల్ చేసింది. "Dangerous" అని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మరీ మెయిల్ పంపింది. ఆ వ్యక్తి సర్ఫరాజ్ మెమోన్‌గా అనుమానిస్తోంది. ఇప్పటికే సర్ఫరాజ్ ముంబయికి వచ్చాడని తెలిపింది. ఇండోర్‌కు చెందిన ఈ వ్యక్తి చైనా, పాకిస్థాన్, హాంగ్‌కాంగ్‌లో ట్రైన్ అయినట్టు స్పష్టం చేసింది. భారత్‌పై కుట్ర చేస్తున్నాడని, అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని వివరించింది. పేరు, ఊరు మాత్రమే కాదు. ఆ వ్యక్తికి సంబంధించి అన్ని వివరాలనూ మెయిల్‌లో పంపింది. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఎల్‌సీ కాపీలను ముంబయి పోలీసులకు అందజేసింది. ముంబయి పోలీసులు ఇండోర్ పోలీసులకు ఈ సమాచారం అందించారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఇప్పటికే ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది. వెపన్స్ ట్రైనింగ్ కోసం పాకిస్థాన్ వెళ్తున్న వారిద్దరినీ అదుపులోకి తీసుకుంది. మహారాష్ట్రలోని థానేకు చెందిన ఖలీద్ ముబారక్ ఖాన్, తమిళనాడుకు చెందిన అబ్దుల్లాను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరూ అక్రమంగా పాకిస్థాన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారని తెలిపారు. రెండు తుపాకులు, 10 క్యాట్‌రిడ్జ్‌లు, కత్తి, వైర్ కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోనూ దాడికి కుట్ర..
హైదరాబాద్‌పై దాడికి కుట్ర జరిగింది. పాకిస్థాన్‌కు చెందిన Lone Wolf Attack సంస్థ ఈ దాడికి ప్లాన్ చేసినట్టు విచారణలో తేలింది. హైదరాబాద్‌లో ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన NIA అధికారులు విచారణ జరిపారు. అయితే ఈ కుట్ర వెనకాల ISI,లష్కరేతోయిబా కూడా ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్‌లోని ఉగ్రసంస్థలతో అరెస్ట్ అయిన ఉగ్రవాది జహీద్‌కు సంబంధాలున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. పాక్ నుంచి అతడికి హ్యాండ్ గ్రనేడ్‌లు కూడా సప్లై చేసినట్టు విచారణలో తేలింది. ఈ ఉగ్రవాది మరి కొందరిని రిక్రూట్ చేసుకుని దాడులకు ప్లాన్ చేసినట్టు వెల్లడైంది. ఏదైనా ర్యాలీని కానీ...జనం ఎక్కువగా ఉన్న పబ్లిక్ ప్లేస్‌లో కానీ దాడులు చేయాలని చూశారు ముష్కరులు. మత కల్లోలాలు సృష్టించేందుకు చేసిన ప్రయత్నాల్ని NIA అడ్డుకుంది. అరెస్ట్ అయిన ఉగ్రవాది నుంచి 2 హ్యాండ్ గ్రనేడ్స్‌తో పాటు రూ.4లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ జహీద్‌ను 2005లో అరెస్ట్ చేశారు. ఆత్మాహుతి దాడి ఘటనలో అతని హస్తం ఉందని అదుపులోకి తీసుకున్నా..సరైన ఆధారాలు లభించకపోవడం వల్ల 2017లో విడుదల చేశారు. పాక్ నుంచి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో పలు చోట్ల దాడులు చేసేందుకు ప్లాన్ చేసినట్టు విచారణలో చెప్పాడు జహీద్. గతేడాది అక్టోబర్ 2న కూడా హైదరాబాద్ పోలీసులు ముగ్గురు ముష్కరులను అరెస్ట్ చేశారు. బహిరంగ సభల్లో గ్రనేడ్‌లతో దాడులు చేయాలని కుట్ర చేయగా...ఆ ప్లాన్ అమలు చేయకుండా అడ్డుకున్నారు.
Also Read: Manish Sisodia Arrest: సిసోడియాకు మెడికల్ టెస్ట్‌లు, కోర్టులో హాజరు పరచనున్న సీబీఐ