National Herald Case: ప్రధాని నరేంద్ర మోదీకి భయపడే సమస్యే లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాడులపై రాహుల్ ఫైర్ అయ్యారు. మోదీ, అమిత్ షాకు ఏం కావాలంటే అది చేసుకోవాలని సవాల్ విసిరారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఉపయోగించి విపక్ష పార్టీల గొంతుకలను నొక్కాలని భాజపా అనుకుంటోందని రాహుల్ అన్నారు. యంగ్ ఇండియన్ కార్యాలయాన్ని సీజ్&znj; చేయడంపై కాంగ్రెస్ ఎంపీలు చర్చించేందుకు సమావేశమవుతోన్న సందర్భంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
నేషనల్ హెరాల్డ్ అంశం పూర్తిగా బెదిరింపు చర్యే. మాపై చిన్న ఒత్తిడి తెస్తే మేము మౌనంగా ఉంటామని నరేంద్ర మోదీ, అమిత్‌షా భావిస్తున్నారు. కానీ వారికి భయపడే ప్రసక్తే లేదు. మోదీకి నేను ఏ మాత్రం భయపడను. బారీకేడ్లు ఎన్ని పెట్టుకున్నా పర్లేదు. కానీ నిజాన్ని బారీకేడ్లు ఆపలేవు. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
Also Read: Chief Justice of India: తదుపరి CJIగా జస్టిస్ యూయూ లలిత్- ఇక సుప్రీం కోర్టు 9 గంటలకే మొదలా?