Serial Killer Arrested: 


వరుస హత్యలు..


మధ్యప్రదేశ్ పోలీసులు ఓ సీరియల్ కిల్లర్‌ను అరెస్ట్ చేశారు. నలుగురు సెక్యూరిటీ గార్డ్‌లను హత్య చేసిన కేసులో నిందితుడైన ఈ వ్యక్తిని శివ ప్రసాద్‌గా గుర్తించారు. సాగర్‌ సిటీలో ముగ్గురు సెక్యూరిటీ గార్డ్‌లను, భోపాల్‌లో మరో సెక్యూరిటీ గార్డ్‌ను హత్య చేశాడు. అరెస్ట్‌కు ముందే నాలుగో హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్‌ లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేసి పట్టుకున్నట్టు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. "నిందితుడిని పట్టుకోవటం చాలా కష్టమైపోయింది. చాలా దారుణంగా హత్య చేసిన వ్యక్తిని పట్టుకున్న సాగర్ పోలీస్‌లకు అభినందనలు. నిందితుడు హత్య చేసి ఓ వ్యక్తి మొబైల్‌ను తనతో పాటే ఉంచుకున్నాడు. ఆ ఫోన్ లొకేషన్ ఆధారంగానే పట్టుకోగలిగారు" 
అని మిశ్రా తెలిపారు. అరెస్ట్ అయ్యే ముందు భోపాల్‌లో ఓ సెక్యూరిటీ గార్డుని దారుణంగా హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. ఆధార్‌ కార్డులోని వివరాల ప్రకారం...నిందితుడి పేరు శివ ప్రసాద్‌గా గుర్తించారు. సాగర్ జిల్లాలోని కేస్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నట్టు తెలిపారు. "భోపాల్‌లో తెల్లవారుజామున నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. ఈ వరుస హత్యల వెనక ఉన్నది కచ్చితంగా ఇతనే అని భావిస్తున్నాం. ఇప్పటికే విచారణ ప్రారంభించాం" అని సాగర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ తెలిపారు. ఖజురి ఏరియాలో మార్బుల్ షాప్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్న సోను వర్మ మార్బుల్‌తో కొట్టి చంపాడు. భోపాల్‌కు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగర్ సిటీలో ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డ్ కల్యాన్ లోధిని కూడా హతమార్చాడు. ఓ సుత్తితో కొట్టి చంపినట్టు పోలీసులు వెల్లడించారు. 


Also Read: Tirupati Crime : తిరుపతి జిల్లాలో దారుణం, బాలికకు మత్తు మందు ఇచ్చి సామూహిక లైంగికదాడి!


Also Read: INS Vikrant: ఇండియన్ నేవీలోకి IAC విక్రాంత్, జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ