Richer than Mukesh Ambani, Ratan Tata, Adani, now lives in rented house : డబ్బు , ఐశ్వర్యం ఉంటే సుఖంగా జీవితం గడిచిపోదు. రాసి పెట్టి ఉండాలి. దానికి సాక్ష్యం విజయ్ పథ్ సింఘానియా. రేమండ్స్ గురించి తెలియని వారు ఉండరు. ఆ బ్రాండ్ ను దేశవ్యాప్తం చేసింది విజయ్ పథ్ సింఘానియానే. ఇప్పుడు ఆయన ముంబైలోని ఓ చిన్న ఇంట్లో ఉంటున్నారు. ఇంటి అద్దెలు, ఖర్చుల కోసం వెదుక్కుంటున్నారు. రేమండ్స్ బాగానే ఉందికదా.. ఎందుకు ఆయనకు ఇన్ని కష్టాలు అనుకోవచ్చు. అక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
విజయ్ పథ్ సింఘానియా రేమండ్ ను ఓ రేంజ్ కు తీసుకెళ్లినప్పుడు ఆయన వ్యక్తిగత ఆస్తుల్లో ముఖేష్ అంబానీ, గౌతం అదానీని దాటిపోయారు. దశాబ్దాల కిందటే ఆయన వ్యక్తిగత సంపదపదకొండువేల కోట్లు ఉండేది. ఇప్పుడు కూడా ఆయనకు అప్పటి ఆస్తులు ఉంటే.. అత్యంత ధనికులైన వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ ఆస్తులేమీ ఆయన పేరు మీద లేవు. అలాగని ఆయన అనిల్ ఆంబానీలాగా అలవి కాని వ్యాపారాలు చేసి మొత్తం పోగొట్టుకుని దివాలా స్థితికి రాలేదు. సింఘానియా కుటుంబం చేతిలోనే రేమండ్ ఉంది. కానీ ఆ కుటుంబం విజయ్ పథ్ సింఘానియాను బయటకు పంపేసింది. అసలు ట్విస్ట్ అదే.
ఆరోగ్యం కోసం హెర్బల్ ప్రొడక్ట్స్ వాడుతున్నారా ? అయితే ఓ సారి లివర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే !
విజయ్ పథ్ సింఘానియా కుటుంబ వ్యవహారాల్లో భాగంగాతన ఆస్తులు మొత్తాన్ని కుమారుడు గౌతం సింఘానియా పేరు మీద రాశారు. వ్యాపార నిర్వహణ బాధ్యతను కూడా కుమారుడికే అప్పగించారు. మరో కుమారుడు మధుపాటి సింఘానికి ఆస్తుల్లో తన వాటాను తీసుకుని సింగపూర్ వెళ్లి స్థిరపడిపోయారు. కొన్నాళ్ల తర్వాత గౌతంసింఘానియాను ఇంటి నుంచి గెంటేశాడు కుమారుడు గౌతం. అలాగే కంపెనీ షేర్స్ అన్నీ రాయించేసుకున్నారు. అంటే.. కంపెనీ నుంచి రూపాయి ఆదాయం రాదు.. ఆస్తులు కూడా లేవు. పైగా కుమారుడు పైసా ఇవ్వకుండా ఇంటి నుంచి గెంటేశాడు.
కొన్నేళ్ల నుంచి గౌతం సింఘానియా అద్దె ఇంట్లో గడుపుతన్నారు. వృద్ధాప్యం ముంచుకొచ్చేస్తోందని రోజువారీ ఖర్చులకూ డబ్బులు ఉండటం లేదని ఆయన మీడియా ప్రతిని్ధులకు ఫోన్లు చేసి బావురుమంటూంటారు. అలాగైనా మీడియాలో వస్తే తన కుమారుడు పరువు తక్కువగా భావించి వచ్చి డబ్బులు ఇస్తాడని ఆయన భావన. కానీ గౌతం సింఘానియా మాత్రం తండ్రి మీద ఏ మాత్ర కన్సర్న్ చూపించడం లేదు. తండ్రి మీద గౌతం సింఘానియాకు అంత కోపం ఎందుకు వచ్చిందో కానీ.. ఒకప్పుడు వేల కోట్లకు అధిపతి అయినా ఇప్పుడు మాత్రం.. రోజువారీ జీవనానికి ఇబ్బంది పడుతున్నాడు.