Unacademy co-founder Roman Saini: రోమన్ సైనీ గురించి చాలా మందికి తెలియదు. కానీ ఎడ్యూటెక్ కంపెనీ అన్‌అకాడెమీ గురించి తెలిసిన వారికి మాత్రం రోమన్ సైనీ గురించి బాగా తెలుసు. ఓ యూట్యూబ్ చానల్ గా ప్రారంభమైన ఆ కంపెనీ విలువ ఇప్పుడు రూ. 26వేల కోట్ల పైమాటే. బైజూస్ ఆకాశానికి ఎగిరి పాతాళంలోకి పడిపోయింది. కానీ అన్అకాడెమీని మాత్రం రోమన్ సైనీ ఆయన మిత్రులు అలా నడపడంలేదు. ఎందుకంటే ఎలా నడపాలో.. ఎలా సక్సెస్ చేయాలో వారికి బాగా తెలుసు.
16 ఏళ్లకే ఎయిమ్స్ ఎంబీబీసీలో సీటు - 21 ఏళ్లకే సివిల్స్‌లో ర్యాంక్
రోమన్ సైనీ గురించి కంపెనీని నడపడం గురించి అందరికీ తెలుసు కానీ..ఆయన కలెక్టర్ గా కూడా పని చేశాని చాలా మందికి తెలియదు. ఆయన లైఫ్ స్టోరీ చూస్తే.. ఇంత కాన్ఫిడెన్స్ ఉన్న యువకుడు ఏమైనా సాధించగలడని అనుకుంటారు. పదహారు ఏళ్ల వయసులో ఢిల్లీలోని ఎయిమ్స్ నిర్వహించే ఎంట్రన్స్ టెస్టును సులువుగా పాసయ్యాడు రోమన్ సైనీ.ఎంబీబీఎస్‌లో చేరిపోయాడు. 21 ఏళ్లకు ఎంబీబీఎస్ పూర్తయిపోయింది.కొన్ని రోజులు డాక్టర్ గా చేసినా సంతృప్తి అనిపించలేదు.దాంతో సివిల్స్ రాశాడు. తొలి ప్రయత్నంలోనే ఆయనకు ర్యాంక్ వచ్చింది.
Also Read: మరో 50 ఏళ్లలో అంతరించిపోనున్న సగం దేశాలు - ఎలాన్ మస్క్ హెచ్చరిక - ఇది వంద శాతం నిజం !
మధ్యప్రదేశ్ క్యాడర్‌లో కొన్నాళ్లు కలెక్టర్‌గా చేసి వీఆర్ఎస్
2015కి ముందు మధ్యప్రదేశ్ క్యాడర్ లో చేరారు. కలెక్టర్ గా కూడా కొన్నాళ్లు పని చేశారు. రోమన్ సైనీకి నచ్చలేదు. ఇంకా ఏదో చేయాలనుకున్నారు. అందుకే తృణప్రాణంగా తన ఐఏఎస్ కెరీర్ ను వదిలేసుకున్నారు. ఆ యువకుడు కాన్ఫిడెన్స్ చూసి చాలా మంది ఐఏఎస్ కన్నా ఎంతో సాధిస్తారని అనుకున్నారు. అందుకే ఎవరూ అడ్డు చెప్పలేదు. ఆపాలని అనుకోలేదు. అలా ఐఏఎస్‌కు రిజైన్ చేసిన తర్వాత తన స్నేహితులతో కలిసి యూట్యూబ్ చానల్ పెట్టి ఉచితంగా విద్యార్థులకు చదువులు చెప్పడు ప్రారంభించారు.మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆయన అన్ అకాడెమీ పేరుతో దీన్ని ప్రారంభించారు.
స్నేహితులతో కలిసి యూట్యూబ్ చానల్ పెట్టి .. రూ. 26 వేల కోట్ల విలువై న కంపెనీగా మార్పు
ఇప్పుడు అన్ అకాడెమీ గురించి చెప్పాల్సిన పని లేదు. యూట్యూబ్ చానల్ నుంచి ఐదారేళ్లలోనే రూ. 26వేల కోట్ల విలువైన కంపెనీగా ఎదిగింది. రోమన్ సైనీ వయసు ఇప్పుడు మూడు పదుల్లోనే ఉన్నారు. అయినా ఆయన జీవితంలో డాక్టర్ అయ్యారు.. ఐఏఎస్ అయ్యారు.. కలెక్టర్ అయ్యారు.. ఓ కంపెనీకి ఓనర్ అయ్యారు. ఓ యువకుడిలో తనకు ఏది కావాలో క్లారిటీ ఉంటే.. ఐఏఎస్ లాంటి ఉద్యోగాలను అయినా క్షణం ఆలోచించకుండా వదిలేయవచ్చని రోమన్ సైనీ నిరూపించారు.