Ambulance Theft In Hayatnagar In Hyderabad: భాగ్యనగరంలో అంబులెన్స్ దొంగతనం కలకలం రేపింది. ఓ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్‌ను ఓ వ్యక్తి రోగి అందులో ఉండగానే చోరీ చేసి వెళ్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు సినిమా స్టైల్‌లో ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. హయత్‌నగర్‌లోని (HayatNagar) సన్ రైస్ ఆస్పత్రికి చెందిన అంబులెన్సును ఓ వ్యక్తి శనివారం ఉదయం చోరీ చేసి పరారయ్యాడు. ఆస్పత్రి సిబ్బంది అతన్ని పట్టుకునేందుకు యత్నించగా తప్పించుకున్నాడు. దీనిపై పోలీసులకు సమాచారం అందించగా వెంటనే రంగంలోకి దిగారు. ఈ క్రమంలో అంబులెన్స్ సైరెన్ మోగిస్తూ అతి వేగంతో విజయవాడ వైపు వెళ్లాడు. చిట్యాల వద్ద పట్టుకునేందుకు యత్నించగా.. ఓ వ్యక్తిని ఢీకొట్టి పరారయ్యాడు.
అనంతరం కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద గేట్‌ను ఢీకొట్టి వేగంగా ముందుకెళ్లాడు. టేకుమట్ల వద్ద రోడ్డుపై అడ్డంగా లారీలు పెట్టిన పోలీసులు దొంగను పట్టుకున్నారు. నిందితుడు కాలభైరవగా గుర్తించిన పోలీసులు అతనిపై గతంలో పలు చోరీ కేసులున్నట్లు తెలిపారు. అంబులెన్స్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అటు, అంబులెన్స్ ఢీకొట్టిన ఘటనలో గాయపడ్డ జాన్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read: Earthquake: తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం