గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) షెడ్యూల్ ఫుల్ బిజీ. ఒక వైపు సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా ప్రచార కార్యక్రమాలు, మరో వైపు ఇటీవల కొత్తగా సెట్స్ మీదకు తీసుకోవలసిన సినిమా పనులు...‌ బిజీ బిజీగా ఉంటున్నారు. ఆయన లేటెస్ట్ షెడ్యూల్ ఏమిటంటే? 


బూత్ బంగ్లాకు RC 16... సెకండ్ షెడ్యూల్ షురూ!
'ఉప్పెన'తో దర్శకుడుగా పరిచయం అయిన, తొలి సినిమాతో 100 కోట్ల క్లబ్బులో చేరిన సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హీరోగా చరణ్ 16న సినిమా కనుక RC 16 అంటున్నారు. నవంబర్ (గత నెల)లో మైసూరులోని చాముండేశ్వరి ఆలయంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించారు.‌ 


రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా తాజా సమాచారం ఏమిటంటే... ఈ నెల 10వ తేదీ నుంచి హైదరాబాద్ సిటీలోని బూత్ బంగ్లాలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నారు. ఓ వారం పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఆ తర్వాత రామ్ చరణ్ అమెరికా ప్రయాణం అవుతారు.


Also Readరెండో రోజూ అల్లు అర్జున్ జోరు... బాక్సాఫీస్ బరిలో 400 కోట్లు దాటేసిన 'పుష్ప 2', టోటల్ ఎంతో తెలుసా?






అమెరికాలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్!
Game Changer Pre Release Event: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం‌ వహించిన సినిమా 'గేమ్ చేంజర్' సంక్రాంతి సందర్భంగా జనవరి 10న పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను అమెరికాలో ఈనెల 21వ తేదీన భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో నిర్వహించనున్నారు.‌ 


బుచ్చి బాబు సినిమా సెకండ్ షెడ్యూల్ పూర్తి అయ్యాక ఆ ఈవెంట్ కోసం చరణ్ అమెరికా వెళతారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇండియాలో మరికొన్ని నగరాల్లో ఏర్పాటు చేసిన ఈవెంట్లలో పార్టిసిపేట్ చేస్తారు. ఆ తర్వాత మళ్లీ బుచ్చి బాబు సినిమా షూటింగ్ మొదలు అవుతుంది. న్యూ ఇయర్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్



సంక్రాంతి తర్వాత RC 16 మూడో షెడ్యూల్!
RC 16 Movie 3rd Schedule: రామ్ చరణ్ 16వ సినిమా మూడో షెడ్యూల్ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానందుని సమాచారం. అమెరికన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత గేమ్ చేంజర్ ప్రచార కార్యక్రమాలతో ఆయన బిజీ బిజీగా ఉంటారని హీరో సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.


రామ్ చరణ్ జంటగా జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ సినిమాలో హిందీ నటుడు, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ద్వారా సౌత్ ఇండియన్ ప్రేక్షకులలో కూడా పాపులర్ అయిన మున్నాభాయ్ పాత్రధారి దివ్యేందు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.


Also Read: హన్సిక నోటి వెంట జానీ మాస్టర్ పేరు... కేసులకు భయపడకుండా చెప్పేసిందిగా!