జానీ మాస్టర్ (Jani Master)... తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకరు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఆయనకు మంచి డిమాండ్ ఉంది. పాన్ ఇండియా సినిమాలలో సూపర్ హిట్ సాంగ్స్ కొరియోగ్రఫీ చేసిన ట్రాక్ రికార్డ్ జానీది. అటువంటి జానీ మాస్టర్ పేరు ప్రతిష్టల మీద ఒక్కసారిగా మచ్చ పడింది. ఆయనపై ఆరోపణలు నిజమా? కదా? అనేది పక్కన పెడితే... అప్పటి నుంచి ఆయన పేరు చాలామంది నోటి నుంచి రావడం మానేసింది. కానీ, హన్సిక (Hansika Motwani) కేసులకు భయపడకుండా ఆయన పేరు తీసింది.
జానీ మాస్టర్ గుర్తు వచ్చారన్న హన్సిక
ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న డాన్స్ రియాలిటీ షో ఢీ జోడి (Dhee Jodi Latest Promo)కి యాపిల్ బ్యూటీ హన్సిక జడ్జి కింద వ్యవహరిస్తున్నారు. లాస్ట్ సీజన్ కూడా ఆవిడ చేశారు. ఇప్పుడు కొత్త సీజన్ కూడా జడ్జి సీటులో ఆవిడ కనిపిస్తున్నారు. అయితే... లాస్ట్ సీజన్ కొన్ని ఎపిసోడ్లలో జానీ మాస్టర్ కూడా కనిపించారు. కానీ ఇప్పుడు ఆయన లేరు.
జానీ దగ్గర పనిచేసిన ఒక లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల కొన్ని రోజులు ఆయన జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఆయనకు నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ చేశారు. దాంతో మనకు ఎందుకు వచ్చిన గొడవ అని చాలామంది జానీ పేరు తీయడం మానేశారు. అయితే లేటెస్టుగా విడుదలైన 'ఢీ షో' ప్రోమో చూస్తే... ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ తర్వాత నిన్ను చూస్తే నాకు జానీ గుర్తుకు వచ్చారు అని హన్సిక చెప్పారు. జానీ మాస్టర్ మీద ఫిమేల్ అసిస్టెంట్ పెట్టిన కేసు గురించి గానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి గానీ ఆవిడ పట్టించుకోలేదు. కేవలం జానీ డాన్స్ గురించి మాట్లాడారు. ప్రజెంట్ ఈ ప్రోమో డిస్కషన్ పాయింట్ అవుతోంది.
Also Read: రెండో రోజూ అల్లు అర్జున్ జోరు... బాక్సాఫీస్ బరిలో 400 కోట్లు దాటేసిన 'పుష్ప 2', టోటల్ ఎంతో తెలుసా?
రాకింగ్ రాకేష్ తీసిన కెసిఆర్ వేడుకలోనూ...
జానీ మాస్టర్ మీద ఓ అమ్మాయి కేసు పెట్టడం ఆ తర్వాత ఆయన జైలుకు వెళ్లి రావడం వంటి వివరాలు విషయాలు అన్నీ తెలుగు ప్రజలకు తెలుసు. ఆ కేసులో జైలు నుంచి బెయిల్ మీద జానీ విడుదల అయ్యారు.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాకింగ్ రాకేష్ హీరోగా నటించడంతో పాటు ప్రొడ్యూస్ చేసిన కేసీఆర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు జాన్ మాస్టర్ వచ్చారు. కాలమే అన్నిటికి సమాధానాలు చెబుతుందని ఆయన అన్నారు. తనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తన భార్య ఎంతో అండగా నిలబడిందని ఆవిడ గురించి గొప్పగా చెప్పారు.
Also Read: మహిళా అభిమాని మృతిపై అల్లు అర్జున్ ఎమోషనల్ - 25 లక్షల సాయం, ఆ ఫ్యామిలీకి భరోసా