Prema Entha Madhuram  Serial Today December 7th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌:   టెండర్‌ కోట్‌ కొట్టేసిన చిన్నొడు – గౌరిని డాక్టర్‌ చూపించమన్న శంకర్‌  

Prema Entha Madhuram  Today Episode:   ప్లాన్‌ ప్రకారం శంకర్‌ క్యాబిన్‌ లోకి వెళ్లిన చిన్నొడు టెండర్‌ కోట్‌ కొట్టేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Continues below advertisement

Prema Entha Madhuram  Serial Today Episode:  టీ తాగడానికి వెళ్తున్న శ్రావణి, సంధ్యలను శంకర్‌  పిలిచి మీ అక్కను మంచి డాక్టర్‌ కు చూపించమని చెప్తాడు. మొన్న అయోద్యపురం వెళ్లినప్పుడు జరిగిందే..మళ్లీ మొన్న అకి వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు జరిగింది. అందుకే గౌరి గారు వట్టి మనిషి కూడా కాదు. ఆవిడ లోపల  ఇంకొకరు ఉన్నారు అంటాడు.

Continues below advertisement

శ్రావణి: ఏంటండి మీరు చెప్పేది మా అక్కకు ఇంకా పెళ్లి కూడా కాలేదు.

శంకర్‌: అదే కదా నా బాధ. ఈ విషయం బయట తెలిస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా వస్తారా..? అర్జెంట్‌ గా వెళ్లి ట్రీట్‌మెంట్‌ చేయించండి.  

సంధ్య: చేసింది అంతా చేసి ఇప్పుడు మళ్లీ సలహాలు ఇస్తున్నారా..?

శంకర్‌: నన్నేం చేయమంటావు హైబ్రీడ్‌ ఆవిడ చంద్రముఖిలో గంగలా నా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తే నేనేం చేయాలి.

శ్రావణి: ఇంట్రెస్ట్‌ చూపిస్తే మీరు ఇగ్నోర్‌ చేయాలి.

శంకర్: అవును నా వల్లే ఇదంతా జరిగింది. మీ అక్క తప్పేం లేదు. ఇప్పుడు అంతా హ్యాపీ కదా..? మూసుకోండి పళ్లు.. మంచికి రోజులే లేవు.

సంధ్య: వీళ్లేంటే ఇంత పని చేశారు.

శ్రావణి: పైగా మనల్నే హాస్పిటల్ కు తీసుకెళ్లమంటున్నారు.

అని మాట్లాడుకుంటారు. వెనక నుంచి అంతా విన్న ఎఫ్ఎం ఆఫీసులో అందరికీ చెప్తాడు. సారు మేడం పెళ్లి చేసుకుంటే ఈ జన్మలో కూడా బుల్లి అభయ్‌, అకి లు పుడతారా..? అని డౌట్‌ అడుగుతాడు. ఇంతలో గౌరి శంకర్‌ నారాయణకు ఫోన్‌ చేసి తన క్యాబిన్‌ కు రమ్మని చెప్తుంది. తర్వాత శంకర్‌ క్యాబిన్‌లో ఫైల్‌ కొట్టేసేందుకు చిన్నోడు, పెద్దొడు వెళ్తారు.

పెద్దొడు: రేయ్‌ లోపలికి నువ్వు వెళ్లరా..!

చిన్నోడు: రేయ్‌ నేనా..

పెద్డొడు: అవునురా.. దొరికిపోయినా కూడా నువ్వు అబద్దం చెప్పి తప్పించుకుంటావు. కానీ నాకు చేత కాదురా..

చిన్నొడు: సరేరా.. అన్నయ్యా  వస్తే నాకు సిగ్నల్ ఇవ్వు..

పెద్దొడు: నేను చూసుకుంటాను నువ్వు వెళ్లరా..?

అని చెప్పగానే చిన్నొడు లోపలికి వెళ్లి టెండర్‌ డీటెయిల్స్‌ తీసుకుంటుంటాడు. అదంతా సీసీ కెమెరాలో రికార్డు అవుతుంది. ఇంతలో అక్కడకు జెండే వస్తుంటాడు. పెద్దొడు రేయ్‌ జెండే సార్‌ వస్తున్నాడురా అని చెప్పగానే చిన్నోడు కంగారుగా వెళ్లలేక టేబుల్‌ కిందకు దూరి దాక్కుంటాడు. జెండే వచ్చి ఫైల్‌ తీసుకుని వెళ్లిపోతాడు. తర్వాత అందరూ శంకర్‌ దగ్గరకు వెళ్తారు.

శంకర్‌: ఏంటి అందరూ కలిసి నన్ను రౌండప్‌ చేశారు.

గౌరి: మీరు మా చెల్లెల్లతో ఏం చెప్పారు.

శంకర్‌: ఆ విషయమా..? అందరికీ తెలిసిపోయిందా..?

అకి: అంటే అది నిజమేనా శంకర్‌ గారు

శంకర్‌: అవును అకి.. మేము అందరం కలిసి మీ ఊరికి వచ్చాము కదా..?

శ్రావణి: అది మేము చెప్తాములేండి..

అకి: అదేంటి శంకర్‌ గారు మీరు లిమిట్స్‌ లో ఉంటారు కదా..?

శంకర్‌: భలే ఉన్నావు అకి నువ్వు నేను లిమిట్స్‌ లోనే ఉన్నాను. కానీ గౌరి గారి లోపల ఉందే అది లిమిట్స్‌ ఉండదే..

సంధ్య: ఎందుకు ఉంటుంది నెలలు గడిచే కొద్ది పెరుగుతూనే ఉంటుంది.

గౌరి: మీరు నోరు మూయండే..

శంకర్‌: అంటే ఆత్మలు కూడా నెలలు గడిచేకొద్దీ పెరుగుతాయా..?

అకి: ఆ ఆత్మనా..

శంకర్‌: అవును మరి దేని గురించి మాట్లాడుకుంటున్నారు.

శంకర్‌ నారాయణ: సార్‌ అది గౌరి గారు ప్రెగ్నెంట్‌ అనే విషయం..

శంకర్: గౌరి గారు ప్రెగ్నెంటా..? పెళ్లి కాకుండానే పెగ్రెంటా..?

అని శంకర్‌ గట్టిగా అరుస్తాడు. దీంతో శ్రావణి మీరు కూడా ఆశ్చర్యపోతున్నారేంటి చెప్పింది మీరే కదా.. అంటుంది. దీంతో శంకర్‌ నేను చెప్పలేదు అంటాడు. దీనికి  పరిష్కారం పెళ్లి చేయడమే అంటాడు నారాయణ. అయ్యో అదంతా కాదండి ఆరోజు ఒక ఆత్మ ఆవహించినట్టు ఈరోజు కూడా ఆవహించిందేమోనని మంచి సైకియాట్రిస్ట్‌కు చూపించమని చెప్పాను అంటాడు శంకర్‌.  తర్వాత చిన్నొడు తను తీసుకెళ్లిన టెండర్‌ కోట్‌ రాకేష్‌కు ఇస్తారు.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

Continues below advertisement