ammayi garu serial today episode హారతి బిడ్డ డీఎన్‌ఏతో జీవన్ డీఎన్ఏ మ్యాచ్ అవుతుంది. దాంతో సూర్యప్రతాప్‌ జీవన్‌ని పట్టుకొని కొడతాడు. చంద్ర, సుమలు కూడా తమ కూతురి జీవితం నాశనం చేశావని తిడతారు. గుడి దగ్గర ఈ పంచాయితీ వద్దని ఇంటికి రమ్మని అందరినీ తీసుకొని వెళ్లిపోతాడు. ఇక అదంతా చూసిన విరూపాక్షి వాళ్లు ఇంటికెళ్లిన తర్వాత విరూపాక్షి తన ఫ్యామిలీ మీద దేవుడు పగ పట్టాడని బాధ పడుతుంది. పింకీకి దుర్మార్గుడితో పెళ్లి జరిగిందని కానీ వాడికి ఓ అక్రమ సంబంధంతో పింకీ జీవితం నాశనం అయిందని బాధ పడుతుంది.


చంద్ర: అన్నయ్యా ఆ జీవన్ అటు హారతితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇటు పింకీని పెళ్లి చేసుకొని పింకీ జీవితంలో ఆడుకున్నాడు అన్నయ్యా. వాడిని క్షమించకూడదు అన్నయ్యా వాడు రానీ వాడి పని చెప్తా.
సుమ: ఇంత జరిగాక వాడు మన ఇంటికి ఎందుకు వస్తాడండీ. 
రూప: అదిగో మాటల్లోనే వచ్చాడు.
చంద్ర: ఆవేశంగా వెళ్లి కాలర్ పట్టుకొని ఎందుకురా నా కూతురి జీవితంతో ఆడుకున్నావ్.
జీవన్: రిలాక్స్ మామయ్య మీరంతా నాకు రుణ పడి ఉండాలి కానీ ఇలా కోపంగా మాట్లాడకూడదు. అంతగా కోప్పడే పని నేను ఏం చేశాను.
సుమ: ఇంకేం చేయాలి బాబు మా కూతిరికి జీవితమే లేకుండా చేశావ్ మా ఎవ్వరికీ మనస్శాంతి లేకుండా చేసేశావ్. 
జీవన్: ఆ రోజు నేను ఆ తాళి కట్టింది కూడా మీ పరువు కాపాడటానికే చేశానని మీరు మర్చిపోతున్నారు. నన్ను నా పలుకుబడిని చూసి పింకీని పోలీసులు డ్రగ్స్ కేసు నుంచి వదిలేశారు. కానీ అంత కంటే పెద్ద మేటర్ ఇంకొకటి ఉంది మామయ్య. పింకీ దగ్గర డ్రగ్స్ దొరికినప్పుడు తన పక్కనున్నది నేను కాదు మామయ్య తన ప్రియుడు గోపి. అందరూ షాక్ అయిపోతారు.
సూర్యప్రతాప్‌: గోపీనా పింకీ ఎవరా గోపీ.
జీవన్: పింకీ చెప్పలేదు. మొన్న రాత్రి గోడ దూకి పింకీ గదిలోకి దూకాడు కదా అదే ఈ రాజు తమ్ముడు. 
పింకీ: పెద్దనాన్న గోపీ అలాంటి వాడు కాదు అసలు ఆ డ్రగ్స్ ఎలా వచ్చాయో మాకు తెలీదు.
జీవన్: అది సరే మామయ్య ఆ గోపీ నుంచి డ్రగ్స్ కేసు నుంచి కాపాడటానికి తాళి కట్టడం తప్పు అంటారా. ఓ హారతి గురించి ఆలోచిస్తున్నారా నేను హారతి ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. కానీ పింకీని ఆ పరిస్థితిలో చూసి సాయం చేయాలనుకున్నా. అంతే కానీ పింకీతో ఎప్పుడూ కాపురం చేయలేదు. తాళి కట్టానే కానీ భర్తలా ప్రవర్తించలేదు.
సూర్యప్రతాప్‌: పింకీని కాపాడాలి అంటే తాళి కట్టకుండా కూడా కాపాడొచ్చు కదా. రాజు ఆ రోజు గోపీ నీ కోసం వచ్చాడని చెప్పావ్. 
విజయాంబిక: అంతా డ్రామాలు తమ్ముడు అన్నా తమ్ముళ్లు కలిసి మన ఆస్తిని రెండు వాటాలుగా చేసుకోవాలి అనుకున్నారు. 
సూర్యప్రతాప్‌: రాజుకి గోపీ పింకీల ప్రేమ గురించి నాకు ఎందుకు చెప్పలేదు.
రాజు: పెద్దయ్యా నాకు వీళ్ల ప్రేమ విషయం తెలిసే నాటికి పింకీకి పెళ్లి అయిపోయింది. గోపీ పింకీ ఇద్దరూ సూసైడ్ చేసుకోవాలి అనుకున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఎవరికీ చెప్తే ఏం చేసుకుంటారో అని ఇద్దరికీ మంచి చెప్పి ఆపాను. మీకు చెప్పినా వాళ్ల బతకరు అని చెప్పలేదు. పనోడిలా  అయినా మీ దగ్గరే ఉండాలి అనుకున్నా కానీ మీ ఆస్తిలో వాటా కొట్టేయాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు పెద్దయ్యా. గోపీ గురించి మీరు టెన్షన్ పడొద్దు వాడికి నేను సర్దిచెప్పుకుంటా.
జీవన్: సీఎం ఇంటికి గోపీ సెక్యూరిటీని దాటుకొని వచ్చాడని అంటే నీ సాయం లేదని అనుకోవాలా. పీంకీ ఇళ్లు ఓకే కానీ పింకీ గది కూడా తెలుస్తుందా. మామయ్య వాడు పింకీని లేపుకెళ్లడానికే వచ్చాడు.


గోపీ తనకు క్షమాపణ చెప్పడానికి వచ్చాడని నా బాధకి కారణం అయినందుకు తనకి బతికే అర్హతే లేదని సూసైడ్ చేసుకోవాలి వచ్చాడని పింకీ చెప్తుంది. హారతిని తల్లిని చేసి నా కూతురిని ఎందుకు పెళ్లి చేసుకున్నావని ఇలాంటి వాడు మన పరువు కాపాడాలని ఎలా ప్రయత్నిస్తాడని చంద్ర, సుమ అంటారు. దాంతో జీవన్ నేను అడ్డుకోకపోతే మీ కూతురు కూడా ఆ గోపీ గాడి బిడ్డకు తల్లి అయ్యేద అంటే సూర్యప్రతాప్‌ కోపంగా వెళ్లి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావ్ రా అని కొడతాడు. నిజాలు తట్టుకునే దమ్ము ఉంటే నన్ను కెలకాలి లేదంటే అన్నీ మూసుకొని కూర్చొవాలి అని జీవన్ అంటే సూర్యప్రతాప్‌ జీవన్ కాలర్ పట్టుకుంటాడు.


మీరు సీఎం అయితే నేను కామన్ మ్యాన్‌ని నాకు ఏం ప్రాబ్లమ్ లేదు అంటాడు. మీరు నా గొంతు పట్టుకున్నట్లే నేను మీ గొంతు పట్టుకుంటా అని జీవన్ చేయి ఎత్తగానే పింకీ వచ్చి చెప్పుతో జీవన్‌ని కొడుతుంది. నా ఫ్యామిలీ తల దించుకొనే పరిస్థితి వస్తుందంటే అస్సలు ఊరుకోనని మా పెద్దనాన్న గొంతు పట్టుకొని ఉంటే నీ చేయి తెగిపడేదని అంటుంది. ఇక జీవన్ హారతి నా బిడ్డకు తల్లి అయిందని రేపు పీంకీ కూడా నా బిడ్డకు తల్లి అవుతుందని ఇంట్లో ఇళ్లాలు వంటింట్లో ప్రియురాలు అని ఇద్దరితో కాపురం చేస్తానని ఏం చేస్తారో చేసుకోండి అంటాడు. దాంతో సూర్యప్రతాప్‌ నీ లాంటి చీడ పురుగుని ప్రాణాలతో వదలను అని ఆవేశంగా గదిలోకి వెళ్లి గన్ తీసుకొని వచ్చి జీవన్‌కి గురి పెడతాడు. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పాపం జ్యోత్స్న.. మనవరాలి కోసం కూతురి ఇంటికి తాత.. ఘోరంగా అవమానించిన కార్తీక్!