Prema Entha Madhuram Serial Today Episode: అభయ్ రవిని తిట్టి.. జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్లిపోతాడు. అక్కడి నుంచి రవి వెళ్లిపోతుంటే శ్రావణి, సంధ్య ఆపి రవిని ఓదారుస్తారు. ఇన్ని అవమానాలు పడుతూ కూడా ఇక్కడే ఎందుకు జాబ్ చేస్తున్నారు బయట వేరే జాబ్ చూసుకోవచ్చు కదా అని అడిగితే మా నాన్న కోసం ఇదంతా భరిస్తున్నానని రవి చెప్తాడు. దీంతో కొందరుంటారు జీవితాన్ని ఇచ్చిన వాళ్లను కూడా మర్చిపోతారు అంటారు. దీంతో పెద్దొడు, చిన్నోడు ఫీలవుతారు. శంకర్ చాంబర్‌లో ఆలోచిస్తుంటాడు.
శంకర్: ఏదో టెంబర్ అంటున్నారు. కోట్ అంటున్నారు. ఏంటో ఈ ఆఫీసు గోల ఒక్క ముక్క అర్థం కావడం లేదు.
రవి: ఎక్స్ కూజ్ మీ సర్ మే ఐ కమీన్ సార్.
శంకర్: ఓ నువ్వా రవి రా.. అయినా మనలో మనకు పర్మిషన్స్ ఏంటయ్యా.. అవును ఆఫీసులో పెద్ద ప్రాజెక్టుకు టెండర్ వేస్తున్నారట.. అందరూ హడావిడిగా ఉన్నారు. నాకు ఏ పని లేదు కాబట్టి.. టెన్షన్ పడే పని చేస్తున్నాను. ఇంతకీ ఆ టెండర్ గోల ఏంటయ్యా..
రవి: ఏమీ లేదు సార్ ఒక ప్రాజెక్టు చేయడానికి గవర్నమెంట్ టెండర్ నోటీస్ రిలీజ్ చేస్తుంది. కంపెనీస్ అన్ని ఆ ప్రాజెక్టును ఇంత బడ్జెట్ లో పూర్తి చేస్తామని ఎస్టిమేషన్ కోట్ చేస్తారు. తక్కువ బడ్జెట్ లో కోట్ చేసిన వాళ్లకు ప్రాజెక్టు దక్కుతుంది.
శంకర్: ఓహో అంటే ఇదో రకమైన వేలం పాట అన్నమాట. అందుకేనయ్యా అందుకే నేను నిన్ను నా పీఏగా తీసుకున్నాను.. అనుకుంటున్నావా…? అదికాదు అకిని నిన్ను కలపడానికి నిన్ను ఇక్కడ సెట్ చేశాను.
రవి షాక్ అవుతాడు. మానాన్నకు బాధ కలిగించే ఏ పని నేను చేయను అంటాడు. ఇంతలో జెండే వచ్చి టెండర్ కోట్ శంకర్ కు ఇచ్చి జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. రవిని తీసుకుని బయటకు వెళ్తాడు జెండే. వాళ్లు వచ్చారు మాట్లాడారు వెళ్లిపోయారు. మళ్లీ నేను ఏ పని చేయాలని టెన్షన్ స్టార్ట్ అయింది అనుకుంటాడు. మరోవైపు ఉదయ్, రాకేష్‌కు ఫోన్ చేసి ఆర్యవర్ధన్ కోట్ చేసే టెండర్ లీక్ చేస్తా అన్నారు ఏమైందని అడుగుతాడు. ఇస్తానని చెప్తాడు రాకేష్. చిన్నోడు, పెద్దొడి దగ్గరకు వెళ్లి నేను చెప్పిన పని ఏమైందని అడుగుతాడు. ఇప్పడే చేస్తామని శంకర్ చాంబర్‌లోకి వెళ్తారు.
శంకర్: వీళ్లిద్దరేంటి లోపలికి రాకుండా డోర్ దగ్గరే స్టెప్పులేస్తున్నారు.
రాకేష్: వీళ్లను నమ్ముకుంటే లాభం లేదు. నేనే ఏదో ఒకటి చేసి సెట్ చేయాలి. ( అని మనసులో అనుకుంటారు) మీరిద్దరూ ఇక్కడే ఉండండి నేను వెళ్లి సెట్ చేస్తాను. (శంకర్ చాంబర్‌లోకి వెళ్తాడు.) మీ తమ్ముళ్లిద్దరూ మీకు సారీ చెప్పాలని అనుకుంటున్నారు. కానీ మీకు భయపడి బయటే ఆగిపోయారు.
శంకర్: సారీ అయినా వాళ్లు చెప్తారా..? నువ్వే చెప్తావా..?
రాకేష్: ఇప్పుడే తీసుకొస్తాను.. ఇంకా ఆలోచిస్తారేంటి.. సారీ చెప్పండి..
అనగానే ఇద్దరూ శంకర్ కాళ్ల మీద పడి ఏడుస్తుంటారు. ఇక లేవండి క్షమిస్తాడు మీ అన్నయ్య అని రాకేష్ చెప్పగానే ఎలా క్షమిస్తాను అంటాడు శంకర్. ఇంతలో ఇద్దరూ మళ్లీ శంకర్‌ను హగ్ చేసుకుని ఏడవడంతో శంకర్ సరేనని ఇద్దరిని క్షమిస్తున్నాను అని మన ముగ్గురం కలిపిపోయిన విషయం గౌరి గారికి చెప్పాలి అని బయటకు వెళ్తాడు. బయట ఎదురుగా గౌరి వచ్చి శంకర్‌కు డాష్ ఇవ్వగానే.. గౌరి గతజన్మలో జరిగింది గుర్తు చేసుకుంటూ నవ్వుతుంది. శంకర్ ఆశ్చర్యంగా చూస్తూ గౌరిని కింద పడేస్తాడు. దీంతో ఇద్దరి మద్య చిన్నపాటి గొడవ జరుగుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!