Brahmamudi Serial Today Episode:   సీతారామయ్యా ఐసీయూలో ఉంటారు. బయట ధాన్యలక్ష్మీని అందరూ తిడుతుంటారు. ఇంతలో అక్కడకు రుద్రాణి వచ్చి ఇందులో ధాన్యలక్ష్మీది తప్పేముంది అని అడుగుతుంది. దీంతో అపర్ణ కోపంగా రుద్రాణిని తిడుతుంది. నువ్వు ఇంకొక మాట మాట్లాడినా చంపేస్తాను. నువ్వు నోరెత్తకు నీకేం సబంధం లేదు. ఎక్కువ మాట్లాడితే మెడ పట్టుకుని బయటకు గెంటి వేస్తాను అంటుంది. స్వప్న కూడా మీరు ఒప్పుకుంటే ఇప్పుడే నేను మెడ పట్టి బయటకు గెంటి వేస్తాను అంటుంది.


అపర్ణ: ఒక్కపూజ ఒకరి ఇంట్లో అన్నం తింటేనే జీవితాంతం ఆ కుటుంబం సుఖంగా ఉండాలని అన్నదాత సుఖీభవ అని దీవించే సంస్కృతి మనది. ఆ పెద్ద మనిషి పెట్టిన బిక్షతో బతికే నువ్వు ఈ సమయంలో ఈ బుద్దిలేని దానితో ఇలా మాట్లాడతావా..? అడ్డమైన విషయాల్లో వత్తాసు పలుకుతావా..?


రుద్రాణి: అమ్మా ధాన్యలక్ష్మీ నీకో దండం. మధ్యలో నాకెందుకు వచ్చింది. నేను నీతో మాట్లాడిన పాపానికే నేనేదో నూరి పోస్తున్నాను అంటున్నారు. మా నాన్నకు అలా ఉంటే నా మనసు ఎన్ని ముక్కలు అయిపోతుందో


ప్రకాష్‌: అమ్మా రుద్రాణి నటించకు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది.


ధాన్యలక్ష్మీ: ఎందుకు అందరూ రుద్రాణి మీద పడ్డారు. మామయ్యకు ఇలా జరిగినప్పుడు నాకు బాధగా ఉంది. కానీ నేను నట్టింట్లో ఉరి వేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మీరు ఇలా లేరు కదా..?


ప్రకాష్‌: అసలు నువ్వు చేసిన రచ్చ వల్లే మా నాన్నకు ఈ పరిస్థితి వచ్చింది.


ఇందిరాదేవి: ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను వినండి. నా భర్తకు ఏదైనా జరగరానిది జరిగితే మాత్రం ఆస్థి మొత్తం అనాథ శరణాలయానికి రాసేస్తాను.


రాజ్‌: మమ్మీ ఏం జరిగింది.


అపర్ణ: ఆయనకు హార్ట్‌ అటాక్‌ వచ్చింది.


రాజ్‌: నాన్నమ్మ తాతయ్యకు ఏం కాదులే..


డాక్టర్‌: ఇక్కడ కావ్య ఎవరు..? కండీషన్‌ సీరియస్‌ గానే ఉంది. ఇప్పుడున్న పరిస్థితి తర్వాత ఉంటుందో లేదో తెలియదు. మీరు వెళ్లి కలవండి కావ్య.


ఇందిర: నేను వెళ్తే తట్టుకోలేనని ఆయన నిన్ను కలవాలనుకుంటున్నారు వెళ్లు అమ్మా


  కావ్య లోపలికి వెళ్తుంది. డాక్టర్‌ రాజ్‌ను పక్కకు తీసుకెళ్లి కండీషన్‌ చాలా క్రిటికల్‌ గా ఉందని మీరే మీ ఫ్యామిలీకి చెప్పండి అని వెళ్లిపోతాడు.  లోపలికి వెళ్లిన కావ్యను చూసిన సీతారామయ్య.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఇంటిని వదిలి వెళ్లోద్దని.. రాజ్‌ తొందరపడ్డా నువ్వే ఓపికగా ఉండాలని ఇల్లు ముక్కలు అవ్వకుండా అందరూ కలిసి ఉండేలా నాకు మాటివ్వమ్మా అని అడుగుతాడు. సరేనని మాటిస్తుంది కావ్య. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకిచ్చిన మాట తప్పనని చెప్తుంది. తర్వాత కావ్య బయటకు వస్తుంది.


అపర్ణ: తాతయ్యగారికి ఎలా ఉంది కావ్య.


కావ్య: అలాగే ఉంది అత్తయ్యా.. సరిగ్గా ఊపిరి కూడా తీసుకోవడం లేదు.


రాజ్‌: ఏయ్‌ సగం సగం చెప్పకు లోపల ఏం జరిగిందో చెప్పు.


రుద్రాణి: నేను అడిగేది కూడా అదే.. లోపల ఏవో మంతనాలు జరిగాయి. ఏవేవో డీల్స్‌ కుదిరాయి ఏంటవి..?


అపర్ణ: నువ్వసలు మనిషివేనా రుద్రాణి.


సుభాష్‌: చెప్పమ్మా లోపల ఏం జరిగింది.


అని అడగ్గానే కావ్య తాతయ్య గారు ఏం చెప్పారో అది చెప్తున్నాను అంటూ సీతారామయ్య చెప్పింది కాకుండా ఇంకోలా చెప్తుంది. ఇంతలో ఇందిరాదేవి ఏడుస్తుంది. వెంటనే రుద్రాణి.. ధాన్యలక్ష్మీ వద్దకు వెళ్లి మాటలతో రెచ్చగొడుతుంది. మరోవైపు అప్పు పోలీస్‌ సెలెక్షన్‌కు సెలెక్ట్‌ అయినట్టు కాల్‌ లెటర్‌ వస్తుంది. అది చూసిన అప్పు, కళ్యాణ్‌ హ్యాపీగా ఫీలవుతారు. కొరియర్‌ లేటుగా వచ్చిందని ఈరోజే ట్రైనింగ్‌ కు వెళ్లాలని చెప్తాడు కళ్యాణ్‌. అప్పును రెడీ కమ్మని చెప్తాడు. ఇంతలో కళ్యాణ్‌కు కావ్య ఫోన్‌ చేసి తాతయ్యను హాస్పిటల్‌ లో జాయిన్‌ చేశామని జరిగింది చెప్తుంది. ఇంతలో అప్పు రెడీ అయి వస్తుంది.  అప్పుకు విషయం చెప్పకుండా రైటర్‌ ఫోన్‌ చేశారు. నేను అర్జెంటుగా వెళ్లాలి నువ్వే రైల్వే స్టేషన్‌కు వెళ్లాలి అని చెప్పగానే సరే అంటుంది అప్పు.  ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!